Skip to main content

చదువే చెప్పని సబ్జెక్టులకు ఇంటర్నల్స్‌ ఎందుకు?

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసి, ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో హ్యూమన్‌ వ్యాల్యూస్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎగ్జామినేషన్స్‌కు ఇంటర్నల్స్‌ ఎందుకని లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు.
ఆసలు లెక్చరర్లే లేని, పాఠాలే చెప్పని ఆ సబ్జెక్టులకు ఇంటర్నల్స్‌ నిర్వహించడం ఎందుకని పేర్కొంటున్నారు. అసలే కరోనా కేసులు పెరుగుతుంటే ఇంటర్నల్స్‌ స‌బ్‌మిట్‌ చేయాలంటూ విద్యార్థులను, ప్రిన్సిపాళ్లను, లెక్చరర్లను కాలేజీలకు పంపడం ఏంటని అడుగుతున్నారు. వాటివల్ల ఎవరికి ఉపయోగమని, విద్యార్థుల జాబితాల్లోనూ వాటి మార్కులే ఉండనప్పుడు లక్షల మంది విద్యార్థులను, లెక్చరర్లను ఇబ్బందుల పాలు చేయడమేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో హ్యూమన్‌ వ్యాల్యూస్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎగ్జామినేషన్‌ పరీక్షలను రద్దు చేసి, ఇంటర్నల్‌ నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్‌ చేయాలని పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఇంటర్‌ బోర్డు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

తెలంగాణ ఇంటర్‌ స్టడీ మెటీరియల్, మోడల్‌ పేపర్లు, ప్రాక్టీస్‌ పేపర్లు, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్‌ టిప్స్, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

తమను కాలేజీలకు పంపొద్దంటున్న డిగ్రీ లెక్చరర్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న లెక్చరర్లు చాలా మందికి కరోనా సోకిందని, ఈ నేపథ్యంలో లెక్చరర్లు కాలేజీలకు రావాలనే నిబంధనను తొలగించాలని డిగ్రీ లెక్చరర్లు కోరుతున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలకు చెందిన చాలామంది లెక్చరర్లు కరోనా భయంతో ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. తాము గతేడాది ఇళ్లల్లోనే ఉండి డిగ్రీ ఆన్‌లైన్‌ పాఠాలు బోధించామని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కాలేజీలకు రావాలనడం సరికాదని, తాము ఇం టి నుంచే విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
Published date : 26 Apr 2021 05:14PM

Photo Stories