బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో స్కూళ్ల ప్రారంభానికి బ్రేక్
Sakshi Education
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలల ప్రారంభానికి తాత్కాలిక బ్రేక్ పడింది.
విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు ఆగస్టు 31వ తేదీన(మంగళవారం) స్టే విధించింది. ప్రభుత్వ జీవోపై వారం పాటు హైకోర్టు స్టే విధించింది. సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు ప్రారంభించొద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతులకూ ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందంటూ ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి గైడ్ లెన్స్ లేకుండా విద్యా సంస్థలు ప్రారంభించడాన్ని పిటిషనర్ సవాలు చేశారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
Published date : 31 Aug 2021 12:27PM