Skip to main content

బీసీ గురుకుల సొసైటీలో 1000 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో కొత్తగా వెయ్యి ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
సొసైటీ పరిధిలో 119 బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్‌ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసిన క్రమంలో వీటిని 2021–22 విద్యాసంవత్సరంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టిన సొసైటీ తాజాగా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేస్తోంది. బోధన, బోధనేతర కేటగిరీల్లో 119 కాలేజీల్లో దాదాపు వెయ్యిపోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని సొసైటీ భావిస్తోంది. రెగ్యులర్‌ ఉద్యోగులు వచ్చేవరకు ఇదే పద్ధతిని అనుసరించనున్నట్లు సొసైటీ అధికారి ఒకరు తెలిపారు.

చ‌ద‌వండి: సెప్టెంబర్‌ 1 నుంచి ఉపకార దరఖాస్తులు ప్రారంభం!

టీఎస్‌ ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ 2021 పరీక్షలు సెప్టెంబర్‌లో... వారంలో షెడ్యూల్‌..

గెస్ట్‌ ఫ్యాకల్టీతో ముందుకు...
బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో టీచింగ్‌ కేటగిరీల్లో 850 పోస్టులు, నాన్‌ టీచింగ్‌ కేటగిరీలో 150 వరకు ఉద్యోగాలున్నాయి. వీటిని ఔట్‌సొర్సింగ్‌ పద్ధతిలో కాకుండా గెస్ట్‌ ఫ్యాకల్టీ/గెస్ట్‌ ఎంప్లాయీస్‌గా సొసైటీ అధికారులే నేరుగా నియమించుకోనున్నారు. ఈ మేరకు జిల్లాలవారీగా ప్రాంతీయ సమన్వయకర్త(ఆర్సీవో)లకు ఈ బాధ్యతలు అప్పగించాలని సొసైటీ భావిస్తోంది. వారి ద్వారా దరఖాస్తులు స్వీకరించి అక్కడే వడపోసిన తర్వాత అర్హులుగా తేలినవారిని నియమించనుంది. మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అతిత్వరలో సొసైటీ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయనుంది.
Published date : 23 Aug 2021 03:01PM

Photo Stories