Skip to main content

బీకాం విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేందుకు ‘ప్రేరణ’ రాష్ట్రస్థాయి పోటీలు

సాక్షి, హైదరాబాద్: కామర్స్ విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు, కామర్స్‌లో భవిష్యత్తు అవకాశాలపై ‘ప్రేరణ’ పేరుతో బీకాం విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని తెలంగాణ కామర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఆవిష్కరించారు. 3 దశల్లో ఈ పోటీలుంటాయని వెల్లడించారు. మొదట కాలేజీ స్థాయిలో, తర్వాత యూనివర్సిటీ స్థాయిలో పోటీలుంటాయని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను వచ్చే నెల 8వ తేదీన హైదరాబాద్‌లోని భద్రుకా కాలేజీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బిజినెస్ క్విజ్, కామర్స్ క్వెస్టా, జస్ట్ ఏ మినిట్, వ్యాసరచన, వకృ్తత్వం పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.
Published date : 23 Jan 2020 02:46PM

Photo Stories