Skip to main content

ఆయుష్‌ సీట్ల భర్తీకి నేడు అదనపు మాప్‌అప్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: యూజీ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్‌అప్‌ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
యూనివర్సిటీ పరిధిలోని యూజీ ఆయుష్‌ కళాశాలల్లో ఖాళీ సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు కోవాలని పేర్కొంది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు ఇచ్చుకోవాలని, గతంలో సీటు పొంది కాలేజీల్లో చేరని అభ్యర్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులని తెలిపింది. వివరాల కోసం www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ చూడాలని సూచించింది.
Published date : 16 Mar 2021 03:29PM

Photo Stories