అన్ని జిల్లాల్లో న్యాక్ శిక్షణ కేంద్రాలు: వేముల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి బాటలు వేసేందుకు వీలుగా అన్ని జిల్లా కేంద్రాల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
బుధవారం జరిగిన న్యాక్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో వృత్తి నైపుణ్యంలో 21 వేల మందికి శిక్షణ ఇవ్వటంతో పాటు 10 వేల మందికి ఉపాధి దొరికేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. న్యాక్‌లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.14 కోట్లతో పనులు చేపడతామన్నారు. సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, న్యాక్ డెరైక్టర్ జనరల్ భిక్షపతి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు బీఏఐ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ సీఈ సత్యనారాయణ, రామకృ ష్ణారావు, శేఖర్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Published date : 11 Feb 2021 04:13PM