Skip to main content

‘అమ్మ ఒడి’ అందని అర్హులను గుర్తించండి

ఏర్పేడు (చిత్తూరు జిల్లా): అర్హత కలిగి ఉండి అమ్మ ఒడి పథకం కింద ప్రోత్సాహక నగదు అందని లబ్ధిదారులను గుర్తించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ అధికారులను ఆదేశించారు.
చిత్తూరు జిల్లా పాపానాయుడుపేట ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను సోమవారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల హాజరు, కుళాయిలు, మరుగుదొడ్ల నిర్వహణ తదితరాలను స్వయంగా పరిశీలించారు. గతంలో పాఠశాల భవనాల పరిస్థితిని తెలిపే ఫొటోలను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నాడు-నేడు పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు.
Published date : 16 Feb 2021 02:19PM

Photo Stories