ఐటీ ఉద్యోగులు ‘రెడ్‌క్రాస్’ సభ్యత్వం తీసుకోవాలి: తమిళిసై పిలుపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరేలా ఐటీ ఉద్యోగులను ప్రోత్సహించాలని నగరంలోని ఐటీ కంపెనీల సీనియర్ అధికారులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
ఐటీ ఉద్యోగులందరూ రెడ్‌క్రాస్ సొసైటీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో బుధవారం ఆమె నగరంలోని ఐటీ కంపెనీల సీనియర్ అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ యాప్ వినియోగం ఎంతో సులువు అని, ఐటీ ఉద్యోగులు రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, ప్రకృతి చికిత్స కేంద్రాలు, వృద్ధాప్య గృహాల నిర్వహణ వంటి సేవలకు రెడ్‌క్రాస్ సొసైటీ పెట్టింది పేరు అని పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు రక్తం సరఫరా జరుగుతోందని తెలిపారు.
Published date : 23 Jan 2020 02:38PM