ఐసీఏఆర్ జాతీయస్థాయి పీజీ ప్రవేశ పరీక్షల్లో టాప్ 10 ర్యాంకులు వీరివే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి పీజీ ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ) విద్యార్థులు వివిధ కేటగిరీల్లో పది ర్యాంకులు సాధించి సత్తా చాటారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రకల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థుల్లో బి.వెంకటేశ్వర్‌రెడ్డి ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, హుస్నా తక్వీం ఎనిమిదో ర్యాంకు దక్కించుకున్నారు. సీహెచ్ భార్గవి ఓపెన్ కేటగిరీలో 14వ, ఓబీసీ కేటగిరీలో ఎనిమిదో ర్యాంకు సాధించారు. దివ్యాంగుల కేటగిరిలో అమిత్‌రెడ్డి మొదటి ర్యాంకు దక్కించుకోగా, ఎస్సీ కేటగిరీలో ఇందు కాలె, అనిష్ ఐదు, ఆరు ర్యాంకులను సాధించారు. ఓబీసీ కేటగిరీలో తేజశ్రీ ఆరో ర్యాంకు దక్కించుకోగా, పి.కళ్యాణి ఓపెన్ కేటగిరీలో 29వ, ఓబీసీ కేటగిరీలో 15వ ర్యాంకు పొందింది. మంచి ప్రతిభ చూపిన విద్యార్థులను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, ఇతర అధికారులు అభినందించారు.
మంచి కళాశాలల్లో ప్రవేశాలు
డెహ్రాడూన్‌లోని ఎఫ్‌ఆర్‌ఐ, బనారస్ వర్సిటీ, ఐసీఏఆర్-ఏఐఈఈఏ పీజీ ప్రవేశపరీక్ష లోనూ ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థులు ఇప్పటికే మంచి ర్యాంకులు సాధించిన విషయం తెలిసిందే. బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ ఎమ్మెస్సీ ప్రవేశాల కోసం మంచి విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలు దక్కాయి. అంత ర్జాతీయ స్థాయిలో అలబామాలోని అబర్న్ వర్సిటీలో సూర్యదీపిక, సుహర్ష ప్రవేశాలు పొం దారు. విద్యార్థుల విజయం వెనుక బోధనా సిబ్బంది కృషి ఉందని కళాశాల డీన్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

Published date : 12 Nov 2020 05:02PM