ఆగస్టు 8న సింగరేణి ఫిట్టర్ ట్రైనీ పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా వాయిదాపడిన ఫిట్టర్ ట్రైనీ (ఎక్స్టర్నల్) కేటగిరీ–1 పరీక్షను ఆగస్టు 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు సింగరేణి జనరల్ మేనేజర్ ఎ.ఆనందరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు www.scclmines.com వెబ్‌సైట్ నుంచి కొత్త హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ హాల్‌టికెట్లలో మారిన పరీక్షా కేంద్రాల వివరాలను చూసుకోవాలని కోరారు. గత ఏప్రిల్ 25నే ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా, కరోనా రెండో దశ కారణంగా వాయిదా పడింది.
Published date : 02 Aug 2021 03:16PM