43% పాఠశాలల్లో నీరు, సబ్బులు కరువు: ఐక్యరాజ్యసమితి
Sakshi Education
జోహన్నెస్‌బర్గ్: పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని.. కనీసం నీరు, సబ్బులు, హ్యాండ్ వాష్‌వంటివి కరువయ్యాయని ఐక్యరాజ్యసమితి తేల్చి చెప్పింది.
అన్ని దేశాల్లోని పాఠశాలల్లో ఇదే పరిస్థితి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ల నివేదిక వెల్లడించింది. విద్యాలయాల పునఃప్రారంభానికి ఆయా దేశాలు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ నివేదిక రావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా జాగ్రత్తల్లో చేతులు శుభ్రంగా ఉండడం ముఖ్యం. అయితే నీళ్లు, సబ్బు, హ్యాండ్ వ్యాష్ వంటివి ప్రపంచవ్యాప్తంగా 43 శాతం పాఠశాలల్లో లేవని డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్ అధ్యయనంలో వెల్లడయింది. ప్రపంచవ్యాప్తంగా 81.8 కోట్ల మంది విద్యార్థులకు పాఠశాలల్లో కనీసం చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదని, ఇందులో 3వ వంతు మంది ఆఫ్రికాలోనే ఉన్నారని తెలిపింది. ప్రతి మూడింటిలో ఒక పాఠశాలలో నీటి సదుపాయం అంతంతమాత్రమేనని, లేదా పూర్తిగా లేదని పేర్కొంది.
Published date : 14 Aug 2020 12:46PM