2020లో టాప్ పాపులర్ ట్విట్స్ ఇవే..!
Sakshi Education
సోషల్ మీడియాలో బాగా గుర్తింపు పొందిన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఈ ఏడాది ముగుస్తున్న సందర్బంగా బాగా పాపులర్ అయిన ట్విట్ల జాబితాని విడుదల చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్వీటల్లో టాప్–10 వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ(7వ స్థానం) చోటు దక్కించుకున్నారు. భారతీయ–అమెరికన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడిన కమలా హారిస్ ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచారు. కన్సూ్యమర్ కమ్యూనికేషన్ గ్లోబల్ హెడ్ ట్రేసీ మెక్‌గ్రా రాసిన బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ఈ సంవత్సరం రాజకీయ మార్పులకు బహిరంగంగా మద్దతు తెలపడానికి, ప్రపంచ నేతల నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసేందుకు నెటిజన్లు తమ వేదికను ఉపయోగించుకున్నారని ట్విటర్ తెలిపింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు గురించి 700 మిలియన్లకు పైగా ట్వీట్లు చేసారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్వీటల్లో..
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్వీటల్లో టాప్–10 వ్యక్తుల జాబితాలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ , అమెరికాలో శ్వేతజాతీ పోలీసుల కర్కశత్వానికి బలైపోయిన జార్జిఫ్లాయిడ్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది జనవరిలో మతిచెందిన అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కోబె బ్రైంట్ నాలుగో స్థానంలో నిలిచారు. అలాగే, బరాక్ ఒబామా ఐదో స్థానంలో నిలవగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడో స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన కమలా హారిస్ పదో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది ఉపయోగించిన, బాగా పాపులర్ అయిన హ్యాష్‌ట్యాగ్ #COVID19 ప్రపంచవ్యాప్తంగా 68 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు, ఇందులో 1.56 మిలియన్ల మంది వైరస్ తో చనిపోయారు. అలాగే #StayHome అనే హ్యాష్‌ట్యాగ్ 3వ స్థానంలో నిలిచింది. అమెరికాలో శ్వేతజాతీ పోలీసుల కర్కశత్వానికి జార్జిఫ్లాయిడ్ చనిపోయినప్పుడు ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్ # బ్లాక్ లైవ్స్‌మాటర్ అనే హ్యాష్‌ట్యాగ్ 2వ స్థానంలో ఉంది. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా నిరసనలను తెలియజేయడానికి ఈ ట్యాగ్ ని ఉపయోగించారు. ఇకపోతే.. భారత్‌లో తమిళ హీరో విజయ్ తన అభిమానులతో తీసుకున్న సెల్ఫీ ఎక్కువసార్లు రీట్వీట్ అయి రికార్డు సృష్టించింది. దాదాపు 1,45,000 కంటే ఎక్కువసార్లు రీట్వీట్ అయింది.

Published date : 09 Dec 2020 06:59PM