1 నుంచి 9వ తరగతి వరకు అందరూ పాస్: కేసీఆర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ప్రకటించిన సెలవులు కొనసాగుతుండటం, ఫలి తంగా వార్షిక పరీక్షలను ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేకపోవడంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా పాసైనట్లేనని ప్రకటించారు. ‘‘ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డిటెన్షన్ విధానం లేదు కాబట్టి విద్యార్థులంతా పాస్ అయినట్లే ప్రకటిస్తున్నాం. ఇతర రాష్ట్రాల తరహాలో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులకు బెంబేలు, చింత అవసరం లేదు’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే మధ్యలో ఆగిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై మాత్రం మరికొన్ని రోజులు ఆగి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Published date : 13 Apr 2020 03:24PM