Skip to main content

గడచిన ఐదేళ్లలోనో అడ్మిషన్స్.. నేడు రాష్ట్రంలో పారా మెడికల్ అభ్యర్థుల కొరత!

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో పారా మెడికల్ అభ్యర్థుల కొరత వేధిస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పారా మెడికల్ కోర్సులు చేసిన అభ్యర్థుల సేవలు వినియోగించుకుందామంటే రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో సరిగా అడ్మిషన్లు జరగని కారణంగా వీరికి కొరత ఏర్పడింది. పారా మెడికల్ కోర్సుల ప్రాధాన్యతను గుర్తించి 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పారా మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లో బోర్డును నిర్వీర్యం చేసి అడ్మిషన్లు కూడా నిర్వహించలేదు.

సాంకేతిక కారణాలను సాకుగా చూపి..
రాష్ట్రంలో మొత్తం 433 ప్రైవేట్ పారా మెడికల్, 8 ప్రభుత్వ పారా మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
ప్రైవేట్ కాలేజీల్లో 49 వేలకు పైగా సీట్లుండగా, ప్రభుత్వ కాలేజీల్లో 861 సీట్లున్నాయి. 2015 నుంచి సాంకేతిక సమస్యలను సాకుగా చూపి మొత్తం అడ్మిషన్లు ఆపేశారు. 2014-19 మధ్య కాలంలో సుమారు లక్షన్నర మంది అభ్యర్థులు కోర్సు పూర్తి చేయాల్సి ఉండగా.. అభ్యర్థుల సంఖ్య వందల్లో కూడా లేదు. 2017లో ప్రైవేట్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. అడ్మిషన్లు చేసుకోవచ్చని కోర్టు ఆదేశాలిచ్చినా అప్పటి సర్కారు పట్టించుకోలేదు.

గత ప్రభుత్వ తీరు వల్లే..
గత ప్రభుత్వ హ యాంలో పారా మెడికల్ బోర్డు నిర్వీర్యమైం ది. కాలేజీల్లో మౌలిక వసతులను పరీక్షించి అనుమతులు ఇవ్వాల ని అడిగినా ఇవ్వలేదు.
- బీఎం రత్నం, అధ్యక్షుడు, నవ్యాంధ్ర పారా మెడికల్ కాలేజీల యాజమాన్యాల సంఘం

Published date : 17 Aug 2020 01:10PM

Photo Stories