బీఎన్ వైఎస్ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు: కాళోజీ వర్సిటీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీఎన్ వైఎస్ కోర్సులో స్పాట్ అడ్మిషన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మార్చి 30న బీఎన్ వైఎస్ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. అదనపు మాప్‌అప్ నోటిఫికేషన్ అనంతరం నేచురోపతి కోర్సులో మిగిలిపోయిన సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని ఉస్మానియా క్యాంపస్‌లోని పీజీఆర్‌సీడీఈలో ఈ నెల 30న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సంబంధిత ధ్రువ పత్రాలతో హాజరు కావాలని వివరించింది.
Published date : 26 Mar 2021 03:32PM