Skip to main content

Famous Scientist Interaction: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్విట్జర్లాండ్‌లోని బ్రూక్‌ హెవెన్‌ ల్యాబ్‌లో పార్టికల్‌ ఫిజిసిస్ట్‌గా పనిచేస్తున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త కైర్లీ భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మంగళవారం ఆన్‌లైన్‌లో సంభాషించారు.
Famous Scientist Interaction with Students
Famous Scientist Interaction with Students

ఈ సందర్భంగా ఫిజికల్‌ సైన్స్‌, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక సంక్లిష్టమైన ప్రశ్నలకు ఆమె పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ విశ్వంలో ఏలియన్స్‌ మనుగడ, విశ్వం ఎప్పుడు ఆవిర్భవించింది... ఎప్పుడు అంతరించబోతుందో... మార్స్‌ గ్రహంపై మానవుడు నివసించడం సాధ్యమేనా ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు వివరణాత్మకంగా తెలియజేశారు.

Vocational Skill Centres in Schools: స్కూల్‌ కాంప్లెక్స్‌లు.. వృత్తి నైపుణ్య కేంద్రాలు

ఆమె ప్రస్తుతం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చుస్తున్న అట్లాస్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో కీలక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆమె ఇప్పటికే ఖగోళ, భౌతిక శాస్త్రాలకు సంబంధించిన ఎన్నో అంతు చిక్కని అంశాల పై ఉపన్యాసాలు చేశారు. ఐలవరం హైస్కూల్‌ ఆంగ్లోపాధ్యాయులు పచ్చారు హరికృష్ణ నాసాలోని శాస్త్రవేత్తగా పనిచేసిన జిమ్‌ ఆడమ్స్‌ ద్వారా ఆమెను ఆన్‌లైన్‌లో కలసి తమ విద్యార్థులతో సంభాషించాలని కోరగా అందుకు అంగీకరించారు. ప్రధానోపాధ్యాయులు మాచర్ల మోహనరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Published date : 25 Jul 2023 03:37PM

Photo Stories