లోకాయుక్తకు సిబ్బంది నియామకం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: లోకాయుక్తలో ఉన్న పలు ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ మేరకు లోకాయుక్తలోని రిటైర్డ్ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. లోకాయుక్త రిజిస్ట్రార్‌గా సయ్యద్ లతీఫ్ ఉర్ రహమాన్ (రిటైర్డ్ జిల్లా సెషన్ జడ్జి), డిప్యూటీ డెరైక్టర్‌గా వి.ముచప్‌రావు (రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్), డిప్యూటీ డెరైక్టర్ ఇన్వెస్టిగేషన్‌గా బి.జనార్దన్‌రెడ్డి (రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్), డిప్యూటీ డెరైక్టర్ ఇన్వెస్టిగేషన్‌గా ఎండీ తాజొద్దీన్ (రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) ఇన్వెస్టిగేషన్ అధికారిగా మాథ్యూ కోషై (రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్)లను నియమించింది.
Published date : 07 Jan 2020 02:13PM