Skip to main content

TSRTC : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌... ఈ రూట్ల‌లో స్పెష‌ల్ బ‌స్‌

TSRTC
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌... ఈ రూట్ల‌లో స్పెష‌ల్ బ‌స్‌

ఐటీ ఉద్యోగులకు శుభవార్త. నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్‌ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా గాజులరామారం నుంచి వేవ్ రాక్ కు ప్రత్యేక బస్సును TSRTC ఏర్పాటు చేసింది. ఈ బస్సు ఉదయం 08:40 గంటలకు గాజులరామారం నుంచి బయలుదేరుతుంది.

ఇవీ చ‌ద‌వండి: ఆగ‌స్ట్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే...

మహాదేవ్ పురం, ఎన్టీఆర్ గార్డెన్, ఎల్లమ్మ బండ, KPHB, JNTU, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి క్రాస్ రోడ్, విప్రో జంక్షన్ మీదుగా వేవ్ రాక్ కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 6:10 గంటలకు అక్కడి నుంచి తిరుగుపయనమవుతుంది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కోరారు. 

ఇవీ చ‌ద‌వండి: ఆ 20 వర్సిటీలు నకిలీవి.. నకిలీ వర్సిటీలు ఇవే

Published date : 03 Aug 2023 02:58PM

Photo Stories