JEE Advanced 2021 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్:దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
JEE Advanced 2021 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
ఈ నెల 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలను ఖరగ్‌పూర్ ఐఐటీ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 50వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను 20వేల మంది విద్యార్థులు రాశారు. రేపట్నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25వరకు రిజిస్ట్రేషన్లు, 27న సీట్లు కేటాయింపు జరపనున్నారు. ఫలితాల కోసం https://jeeadv.ac.in/వెబ్‌సైట్‌లో చూడవచ్చు.