దృక్పథం మారితేనే సత్ఫలితాలు
Sakshi Education
‘ప్రస్తుతం మేనేజ్మెంట్ విద్యలో ప్రధానంగా ఎదురవుతున్న సమస్య విద్యార్థుల దృక్పథం. కేవలం జాబ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సులో చేరి ఆ తర్వాత అకడమిక్‌గా సరిగా రాణించలేకపోతున్నారు. అందుకే మేనేజ్మెంట్ కోర్సును ఎంచుకునేముందు తమ ఆసక్తులను సంపూర్ణంగా తెలుసుకోవాలి’ అంటున్నారు ఐఐఎం-ఇండోర్ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ ఎన్.గణేశ్ కుమార్. ఆయన ఐఐఎం-అహ్మదాబాద్‌లో ఫెలోషిప్ పూర్తి చేసి టీఏ పాయ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, శాంట్స్ఫీల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (సింగపూర్), ఐఐఎం ఇండోర్లలో ప్రొఫెసర్‌గా ఇరవై ఏళ్ల అనుభవం గడించారు. క్యాట్ తర్వాత దశలో దృష్టి పెట్టాల్సిన అంశాలు, ఐఐఎంలు గమనిస్తున్న లోపాలు, మేనేజ్మెంట్ విద్యలో అవసరమైన మార్పులపై ప్రొఫెసర్ గణేశ్ కుమార్‌తో ఇంటర్వ్యూ..
తుది దశలో విజయం సాధించాలంటే
క్యాట్ ఉత్తీర్ణుల్లో పలు అకడమిక్ నేపథ్యాలు గల విద్యార్థులుంటారు. ఐఐఎంల ఎంపిక కమిటీలు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వారి డొమైన్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సదరు స్పెషలైజేషన్‌లో అప్లికేషన్ స్కిల్స్ సంబంధిత పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. ప్రస్తుతం ఐఐఎంలలో తదుపరి ప్రవేశ ప్రక్రియకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకుంటే అవకాశాలు మరింత మెరుగవుతాయి. క్యాట్‌లో మంచి అద్భుతమైన పర్సంటైల్ సాధించిన విద్యార్థులు కూడా ఫైనల్ సెలక్షన్స్‌లో విజయం సాధించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణాలు.. మేనేజ్మెంట్ కోర్సుకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఐఐఎంలలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో క్యాట్‌లో విజయం కోసం విపరీతంగా కృషి చేయడం, పర్యవసానంగా తమ కోర్ సబ్జెక్ట్‌లను నిర్లక్ష్యం చేయడం. ఇలాంటి అభ్యర్థులే ఇంటర్వ్యూలో నిరుత్సాహానికి గురవుతున్నారు.
డైవర్సిటీ ఫలితాలు అందాలంటే
ఐఐఎంలు అన్ని అకడమిక్, జండర్ డైవర్సిటీలకు ప్రత్యేక వెయిటేజీలు ఇస్తున్నాయి. ఫైనల్ సెలక్షన్స్‌లో పాల్గొనేందుకు అన్ని నేపథ్యాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాయి. కానీ సమస్య అంతా విద్యార్థుల దృక్పథంతోనే. మన దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంజనీరింగ్ అంటే ఎనలేని క్రేజ్ నెలకొంది. ఇదే కారణంగా మెజారిటీ విద్యార్థులు బ్యాచిలర్స్ డిగ్రీలో ఇంజనీరింగ్ కోర్సులనే అభ్యసిస్తున్నారు. దాంతో సహజంగానే క్యాట్‌కు హాజరయ్యే, ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే విద్యార్థులు తమ దృక్పథాన్ని మార్చుకుని ఇంజనీరింగ్ అనే ఆలోచనకే పరిమితం కాకుండా మిగతా కోర్సులవైపు దృష్టి సారిస్తే ఐఐఎంలలోనూ డైవర్సిటీ ఫలితాలు ప్రతిబింబిస్తాయి. ఇదే ఉద్దేశంతో ఐఐఎం-ఇండోర్ 10+2 అర్హతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. మొదటి మూడేళ్లు సోషల్ సెన్సైస్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు అన్ని రకాల కోర్సులు అభ్యసించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్లు పూర్తిగా మేనేజ్మెంట్ సబ్జెక్ట్‌లుంటాయి. ఇలాంటి కోర్సుల ఫలితంగా విద్యార్థులకు మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. జండర్ డైవర్సిటీ విషయంలో మాత్రం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఐఐఎంలో దాదాపు 25 నుంచి 35 శాతం మంది మహిళలు కూడా ఆయా కోర్సులు అభ్యసిస్తున్నారు.
సంప్రదాయ విధానాలకు స్వస్తి పలకాలి
ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో బోధన పరంగా సంప్రదాయ విధానాలకు స్వస్తి పలకాల్సిన అవసరముంది. విద్యార్థులను భాగస్వాములను చేసే పార్టిసిపెంట్-సెంట్రిక్ విధానంలో బోధన సాగాలి. అప్పుడే విద్యార్థులకు కొత్త విషయాలు, వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. అదేవిధంగా విద్యార్థులు కూడా అభ్యసన కోణంలో తమ వైఖరి మార్చుకోవాలి. చాలా మంది విద్యార్థులు బి-స్కూల్ ప్రవేశం పొందడమంటే జాబ్ సొంతమైనట్లే అని భావిస్తారు. కానీ రెండేళ్ల కోర్సు వ్యవధిలో వారు ఎన్నో అంశాల్లో రాణిస్తే కానీ వారి లక్ష్యం చేరుకోలేరు. కేస్ స్టడీస్, నాలెడ్జ్ అప్‌గ్రేడ్ చేసుకోవడం, లేబొరేటరీలను విస్తృతంగా వినియోగించుకోవడం వంటి స్వీయ అభ్యసన విధానాలు పాటించాలి.
గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో వెనుకంజకు కారణాలు
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐఐఎంలు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో మాత్రం వెనుకంజలో నిలవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయా సర్వేల మెథడాలజీ. అంతేకాకుండా హార్వర్డ్ బిజినెస్ స్కూల్, స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లతో పోల్చుకుంటే ఐఐఎంలు స్థాపన పరంగా ఇటీవలే ఏర్పాటైనవి. ఉదాహరణకు స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ స్కూల్స్‌కు వందేళ్ల చరిత్ర ఉంటే ఐఐఎం-ఇండోర్ ఏర్పాటై ఇప్పటికి 15 సంవత్సరాలు మాత్రమే. ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటై అన్ని విధాలుగా అత్యున్నత ప్రమాణాలు పొందాలంటే ఎంతో సమయం పడుతుంది. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ఐఐఎంలు లేవనో లేదా వెనుకంజలో ఉన్నాయనో భావించేముందు ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి.
కొత్త ఐఐఎంలు.. ఆహ్వానించదగిన పరిణామం
ఐఐఎంలను విస్తరించే క్రమంలో తాజాగా కొత్తగా మరిన్ని క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామం. దీనివల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి మార్గం సుగమం అవుతుంది. ఇదే సమయంలో.. గుర్తించాల్సిన అంశం.. కొత్త ఐఐఎంలు ఏర్పాటైన వెంటనే అద్భుత ఫలితాలు ఆశించకూడదు.
ఐఐఎం ఫైనల్ ఫేజ్ ఔత్సాహికులకు సలహా
క్యాట్ పరీక్ష రాసి ఫైనల్ ఫేజ్ దిశగా ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులు ముందుగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోని తమ సబ్జెక్ట్ స్పెషలైజేషన్స్‌పై దృష్టి పెట్టాలి. అదే విధంగా
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లో, ఇతర రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు
నిజాయతీకి ప్రాధాన్యమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెస్సింగ్సరికాదు. క్యాట్‌లో విజయం సాధించలేని విద్యార్థులు నిరుత్సాహానికి గురవక్కర్లేదు. క్యాట్‌తోపాటు మరెన్నో మార్గాలు, మరెన్నో నాణ్యమైన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. మేనేజ్మెంట్ నిష్ణాతుల్లో ఎందరో ఐఐఎంయేతర ఇన్‌స్టిట్యూట్‌ల్లో చదివినవారున్నారు. కాబట్టి ప్రస్తుత మేనేజ్మెంట్ కోర్సుల ఔత్సాహికులు కేవలం క్యాట్‌కు పరిమితం కాకుండా విస్తృత అవకాశాలపై అవగాహన పొందితే కచ్చితంగా లక్ష్యం చేరుకుంటారు.

Published date : 02 Dec 2014 11:33AM