సులువుగానే సీజీఎల్ టైర్ -1 పరీక్ష!
Sakshi Education
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) ఎగ్జామినేషన్ 2016 టైర్-1 పరీక్షలు ఆగస్టు 27 నుంచి ప్రారంభమయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే ఈ పరీక్షలు సెప్టెంబర్ 11 వరకు కొనసాగనున్నాయి. కమిషన్ ఈ నోటిఫికేఫన్ నుంచి పరీక్ష విధానంలో పలు కీలక మార్పులు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన పరీక్ష విధానంలో ప్రశ్నల సంఖ్యను 200 నుంచి 100 కుదించారు. సమయాన్ని రెండు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గించారు. టైర్ -1, 2లతో పాటు అదనంగా డిస్క్రిప్టివ్ విధానంలో టైర్- 3 ప్రవేశపెట్టారు. అన్నింటి కంటే ముఖ్యంగా మాల్ ప్రాక్టీస్‌ని నిరోధించాలనే గట్టి నిర్ణయంతో పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడం లాంటి కీలక మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రశ్నల క్లిష్టత స్థాయి, ఆన్‌లైన్ పరీక్షపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొని ఉంది. అయితే గత ఐదు రోజులుగా జరుగుతున్న ఆన్‌లైన్ పరీక్షల శైలిని గమనిస్తే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రశ్నలు సులువుగానే ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ కావడంతో సర్వర్ నెమ్మదిగా పనిచేయడం వల్ల కొంచెం సమయం వృథా అవుతుందంటున్నారు. సెప్టెంబర్ 11 వరకు పరీక్షలు కొనసాగుతుండటంతో సీజీఎల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉపయోగపడేలా విభాగాల వారీగా వివిధ అంశాల నుంచి వచ్చే ప్రశ్నల వివరాలు..
టైర్ - 1 పరీక్ష విధానం
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
ఈ విభాగంలో వెర్బల్, నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తున్నాయి. ప్రశ్నలు సులువుగా, ఒక మోస్తరు క్లిష్టంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. దీనిలో సిరీస్ (నంబర్/ ఆల్ఫా న్యూమరిక్) విభాగం నుంచి అత్యధికంగా 7 నుంచి 9 ప్రశ్నలు వస్తున్నాయి. అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాయిజమ్, మాట్రిక్స్, దిశలు, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ (వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్ - డీకోడింగ్ అంశాలు, తదితర టాపిక్స్‌లపైన ప్రశ్నలు అడిగారు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, శాతాలు విభాగాల నుంచి 4 -5 ప్రశ్నలు; త్రికోణమితి (1 -2), ఆల్జీబ్రా (2-4), జామెట్రీ (3-5), డేటా ఇంటర్‌ప్రిటేషన్ (3-5), టైం అండ్ వర్క్ (1-2), టైం అండ్ డిస్టెన్స్ (2-3) నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్
ఇందులో ముఖ్యంగా వొకాబులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామర్‌కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారు. సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్/ఫ్రేజెస్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూషన్ విభాగాల నుంచి దాదాపు 11 ప్రశ్నలు, రీడింగ్ కాంప్రెహెన్షన్ (5), సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ (3), స్పెల్లింగ్ మిస్టేక్ (1), ఫిల్లర్స్ మీద (3) ప్రశ్నలు అడుగుతున్నారు.
జనరల్ అవేర్‌నెస్
ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాల నుంచి 5 ప్రశ్నలు వస్తున్నాయి. జనరల్ సైన్స్ నుంచి (4-7) ప్రశ్నలు, ఎకనామిక్స్ (3), హిస్టరీ (4-5), జాగ్రఫీ (2-3), పాలిటీ (3 -4) ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ విభాగంలో ఇప్పటి వరకు వచ్చిన కొన్ని ప్రశ్నలు.. స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ ఎవరు? ఆమ్ల వర్షానికి కారకాలు? అత్యధిక అక్షరాస్యత గల రాష్ర్టం? ఫిఫా కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? కాకోరి కుట్ర జరిగిన సంవత్సరం? లోక్‌సభ మొదటి మహిళా స్పీకర్? పులిట్జర్ అవార్డును ఏ రంగంలో వారికి ప్రదానం చేస్తారు? వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ 2016 ఉమెన్స్ సింగిల్స్ విజేత? లాంటి ప్రశ్నలు ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో వచ్చాయి.
కటాఫ్ మార్కులు 105 నుంచి 120!
టైర్ -1 పరీక్షలో ప్రశ్నల క్లిష్టత స్థాయిని గమనిస్తే ఈసారి కటాఫ్ గతంలో కంటే పెరిగే అవకాశం ఉంది. గతేడాది టైర్ -1 కటాఫ్ మార్కులు జనరల్ అభ్యర్థులకు 102.25, ఓబీసీలకు 89.5, ఎస్సీలకు 80.25, ఎస్టీలకు 74.25. అయితే ఈసారి ప్రశ్నల సంఖ్య తగ్గడంతో కటాఫ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. జనరల్ అభ్యర్థులకు కటాఫ్ 105 నుంచి 120 వరకు ఉండవచ్చని చెబుతున్నారు.
టైర్-1 దాటితేనే తర్వాతి దశకు...
టైర్ - 1లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధిస్తేనే టైర్- 2కు అర్హత సాధిస్తారు. టైర్-2లోనూ ఉత్తీర్ణులైతే టైర్-3 పరీక్ష రాయాల్సి ఉంటుంది. సీజీఎల్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్), వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో అసిస్టెంట్లు (ఇంటెలిజెన్స్ బ్యూరో, విదేశాంగ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్, రైల్వే బోర్డు, ఇతర శాఖల్లో), ఇన్‌స్పెక్టర్ (ఇన్‌కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్స్, ఎగ్జామినర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ఇన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, సబ్ ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నార్కోటిక్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), కాగ్‌లో డివిజినల్ అకౌంటెంట్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్, ఆడిటర్స్ అండ్ అకౌంట్స్ విభాగంలోని పోస్టులు, ట్యాక్స్ ఆసిస్టెంట్లు మొదలైన గ్రూప్ -బి, సి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఏడాది కొత్తగా కాగ్‌కు చెందిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లోని ‘అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్’ పోస్టును కూడా సీజీఎల్ ద్వారానే భర్తీ చేయనున్నారు.
సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ | 25 | 50 |
జనరల్ అవేర్‌నెస్ | 25 | 50 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 25 | 50 |
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ | 25 | 50 |
మొత్తం | 100 | 200 |

గతంలో జరిగిన సీజీఎల్ పరీక్ష తరహాలోనే ఈసారి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ప్రశ్నల సంఖ్య తగ్గినప్పటికీ, ప్రశ్నల క్లిష్టతలో మార్పు లేదు కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టైర్ -1కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు మాక్ టెస్ట్‌లు రాస్తే లాభిస్తుంది. ఇప్పటివరకు చదివిన వాటినే రివిజన్ చేసుకోవాలి. కొత్తగా చదవకూడదు. రివిజన్ చేస్తూ, మాక్ టెస్ట్‌లు రాసి వాటిని విశ్లేషించుకోవాలి. - రవి గార్లపాటి, ఎండీ, ఐ రైజ్ అకాడమీ. |
ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు సులువుగానే అడిగారు. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలకు సంబంధించి అన్ని ప్రశ్నలు సమాధానాలు గుర్తించే విధంగా సులువుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు నాన్ వెర్బల్ రీజనింగ్‌పై కూడా దృష్టి పెట్టాలి. మ్యాథ్స్‌కు సంబంధించి క్లాక్స్, క్యాలెండర్స్ మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 5 ప్రశ్నల వరకు ఇస్తున్నారు. ఈసారి ప్రశ్నల సంఖ్య తగ్గడంతో క్లిష్టత స్థాయి పెరుగుతుందని భావించినప్పటికీ గతంలో వచ్చిన విధంగానే ప్రశ్నలు ఉంటున్నాయి. ఈసారి కటాఫ్ పెరిగే అవకాశం కూడా ఉంది. - వినయ్ కుమార్ రెడ్డి, ఐఏసీఈ డెరైక్టర్. |
Published date : 01 Sep 2016 05:02PM