సీహెచ్‌ఎస్‌ఎల్‌లో సక్సెస్‌కు మార్గాలు
Sakshi Education
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్‌డ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్‌ఎస్‌ఎల్) ఎగ్జామినేషన్-2017 ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 3,259 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఇంటర్ అర్హతతో ఆకర్షణీయ వేతనం, సుస్థిర కెరీర్, ఉన్నత స్థానాలకు చేరుకునే వీలు కల్పించే ఈ నోటిఫికేషన్ నిరుద్యోగులకు సువర్ణావకాశం. ఈ నేపథ్యంలో టయర్ 1 పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్..
ఎంపిక విధానం...
ఈ కొలువుల ఎంపికలో మూడంచెల విధానం అమల్లో ఉంది. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీన్ని టయర్-1గా పేర్కొంటారు. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధిస్తే తర్వాతి దశకి అర్హత లభిస్తుంది. రెండో దశ (టయర్-2) డిస్క్రిప్టివ్ పరీక్ష. దీన్ని గంట వ్యవధిలో నిర్వహిస్తారు. ఇది పెన్, పేపర్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. చివరి, మూడో దశ (టయర్-3) టైపింగ్ టెస్ట్/స్కిల్ టెస్ట్. ఇది అర్హత పరీక్ష మాత్రమే. టయర్-1, టయర్-2లో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.
టైర్-1 ప్రిపరేషన్ ప్రణాళిక...
ఇంగ్లిష్ (50 మార్కులు)
రెండు పరీక్షల్లోనూ (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌లో) ఇంగ్లిష్ సబ్జెక్టు ఉంది. దీనికి ప్రిపరేషన్ భిన్నంగా ఉండాలి. సబ్జెక్టును ఆబ్జెక్టివ్ విధానంలోనే కాకుండా డిస్క్రిప్టివ్ అప్రోచ్‌లోనూ నేర్చుకోవాలి. డిస్క్రిప్టివ్ విధానంలో ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ ఆంగ్లంలో రాయాలి. అందువల్ల ప్రాథమిక కాన్సెప్టులను బాగా అర్థం చేసుకోవాలి. గ్రామర్‌పై పట్టు సాధించాలి. ఈ నైపుణ్యాలను సాధిస్తే స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, డెరైక్ట్/ఇన్‌డెరైక్ట్ స్పీచ్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్ తదితర విభాగాల్లో రాణించవచ్చు. ఇంగ్లిష్‌లో పట్టు సాధించేందుకు ఆంగ్ల పత్రికలను నిత్యం చదవాలి. కొత్త పదాలు నేర్చుకోవాలి.
జనరల్ ఇంటెలిజెన్‌స (50 మార్కులు)
ఇది అభ్యర్థులు పూర్తిస్థాయి మార్కులు పొందే అవకాశం ఉన్న విభాగం. ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్ అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ప్రశ్నలు సులువుగా ఉండే అవకాశం ఎక్కువ. ఇందులో సిరీస్ (నంబర్/ఆల్ఫా న్యూమరిక్) విభాగం, అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాయిజమ్, మ్యాట్రిక్స్, దిశలు, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ (వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్, డీకోడింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వీటికోసం ఒక ప్రామాణిక పుస్తకం తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తక్కువ సమయంలో ప్రిపరేషన్ పూర్తి చేయడంతో పాటు కచ్చితంగా స్కోరు చేసుకునే సెక్షన్ ఇది.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు)
ఇందులో సింపుల్ ఇంట్రస్ట్, కంపౌండ్ ఇంట్రస్ట్, లాభ నష్టాలు, శాతాలు, త్రికోణమితి, ఆల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. మ్యాథమెటిక్స్‌లో సర్కిల్స్, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్ తదితర అంశాలు చాలా కీలకం. వీటి నుంచే దాదాపు సగం ప్రశ్నలు వస్తుంటాయి. వీటిలో స్కోరు కోసం తొలుత బేసిక్స్‌పై దృష్టిసారించాలి. ఈ సెక్షన్‌లో స్కోరు చేయడానికి ఏకైక మార్గం ప్రాక్టీస్.
జనరల్ అవేర్‌నెస్ (50 మార్కులు)
ఈ విభాగంలో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. బాగా ప్రిపేరైతే 10 నిమిషాల్లోపే ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు. ఈ సెక్షన్‌లో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకు స్టేట్ సిలబస్ పుస్తకాలు చదివితే కరెంట్ అఫైర్స్ మినహా ఇతర ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు.
మాక్ టెస్టులు ముఖ్యం...
సీహెచ్‌ఎస్‌ఎల్ ప్రకటనలో పోస్టులు తక్కువగా ఉన్నా తుది ఫలితాలు వెలువడే నాటికి వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పరీక్షకు ఇంకా 100 రోజులకు పైగా సమయం ఉంది. అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేరై మాక్ టెస్టులకు హాజరవుతూ వాటి ఫలితాలను సమీక్షించుకోవాలి. గంట వ్యవధిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించేలా సిద్ధమవ్వాలి. మ్యాథ్స్‌లో షార్ట్ కట్స్, ఎలిమినేషన్ మెథడ్స్‌తో జవాబులను వేగంగా, కచ్చితంగా గుర్తించవచ్చు. ఇక టయర్-2లో స్కోరు చేయడానికి ఇప్పటినుంచే జనరల్ స్టడీస్, సోషల్, ఎకనామికల్ ఇష్యూస్‌ను ప్రత్యేక దృష్టితో అర్థం చేసుకుంటూ చదవాలి.
- రవి గార్లపాటి, డెరైక్టర్, ఐ రైజ్ అకాడమీ, హైదరాబాద్.

Published date : 23 Nov 2017 02:46PM