Skip to main content

ఎస్‌ఎస్‌సీ - జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1,000 గ్రూప్-బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోస్టుల వివరాలు, పరీక్షా విధానంపై ఫోకస్..
ఉద్యోగాల వివరాలు:
  • సెంట్రల్ వాటర్ కమిషన్ (సివిల్, మెకానికల్): వయసు 32 ఏళ్లకు మించకూడదు.
    విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ.

  • సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్‌మెంట్ (సివిల్): వయసు 32 ఏళ్లకు మించకూడదు.
    విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.

  • సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్‌మెంట్(ఎలక్ట్రికల్): వయసు 32 ఏళ్లకు మించకూడదు.
    విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (సివిల్): వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
    విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/తత్సమానం.

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (ఎలక్ట్రికల్): వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
    విద్యార్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/తత్సమానం.

  • మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (సివిల్): వయసు 30 ఏళ్లకు మించకూడదు.
    విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రెండేళ్ల పని అనుభవం.

  • మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎలక్ట్రికల్, మెకానికల్): వయసు 30 ఏళ్లకు మించకూడదు.
    విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం.

  • మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ విభాగాలు): వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
    విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్వేయర్స్ నిర్వహించే బిల్డింగ్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ సబ్‌డివిజనల్-II ఇంటర్మీడియెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
    • గమనిక: అన్ని విభాగాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓబీసీలకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
    • పేస్కేల్: రూ.9,300-34,800. గ్రేడ్ పే: రూ.4,200

పరీక్ష విధానం:
రాత పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఇది మొత్తం 500 మార్కులకు ఉంటుంది. మొదటి దశలో ఉత్తీర్ణత సాధిస్తే రెండో దశ పరీక్షకు అనుమతిస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ (100 మార్కులు)కు అర్హులు.
  • పేపర్-1; రాత పరీక్ష: మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం: రెండుగంటలు. పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
    1. జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్: ఈ పరీక్షను అన్ని విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాలి. ఇది 50 మార్కులకు ఉంటుంది.
    2. జనరల్ అవేర్‌నెస్: ఈ పరీక్షను అన్ని విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాలి. ఇది 50 మార్కులకు ఉంటుంది.
    3. సివిల్/స్ట్రక్చరల్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-ఏ, ఎలక్ట్రికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-బి, మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పార్ట్-సి భాగాలు రాయాలి. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
  • పేపర్-2; రాతపరీక్ష: పేపర్-1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం: రెండు గంటలు. సివిల్/స్ట్రక్చరల్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-ఏ, ఎలక్ట్రికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-బి, మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పార్ట్-సి భాగాలు రాయాలి.
    • దరఖాస్తు రుసుం: రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ముఖ్యతేదీలు:
  • పార్ట్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఆగస్టు7, 2015
  • పార్ట్-2 రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఆగస్టు 10, 2015.
  • పేపర్-1 రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 6, 2015.
  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
  • వెబ్‌సైట్: https://ssconline.nic.in , https://ssconline2.gov.in

ప్రిపరేషన్ ప్రణాళిక
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కోసం బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ తదితర పరీక్షల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అవార్డులు-విజేతలు, క్రీడలు-విజేతలు తదితర అంశాలను చదవాలి. ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆయా బ్రాంచ్‌ల టెక్నికల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.

    ఎలక్ట్రికల్: సర్క్యూట్లలోని బేసిక్ ప్రిన్సిపుల్స్, బేసిక్ ఫార్ములాలు, వాటి యూనిట్లు తదితర అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్ అంశాలపై అవగాహన అవసరం.

    సివిల్ ఇంజనీరింగ్: స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్,సర్వేయింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రిన్సిపుల్స్, ఫార్ములాలు, యూనిట్లపై అవగాహన అవసరం.

    మెకానిక్స్: థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఐసీ ఇంజన్, హీట్ ఇంజన్ వంటి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. వీటికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపుల్స్‌ను అధ్యయనం చేయాలి.
  • ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథ మిక సూత్రాలను ఒకచోట రాసుకొని,రివిజన్ చేస్తుండాలి.
  • సమయపాలనను అలవరచుకోవడం కోసం నమూనా ప్రశ్నపత్రాలను సాధిస్తుండాలి.
  • చదివిన అంశానికి సంబంధించిన ప్రశ్నలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి.

- జి.రమణ, డెరైక్టర్, సాయిమేధ విద్యా సంస్థలు.
Published date : 16 Jul 2015 06:14PM

Photo Stories