పేదరికం, నిరుద్యోగిత
1. ఎన్.ఎస్.ఎస్.ఒ. 68వ రౌండ్ గణాంకాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ తర్వాత అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) బిహార్
బి) ఒడిశా
సి) జార్ఖండ్
డి) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
2. ప్రణాళికా సంఘం పేదరికాన్ని గణించడానికి కింది వాటిలో దేన్ని ప్రామాణిక పద్ధతిగా గుర్తించింది?
ఎ) యూనిఫాం రిఫరెన్స్ పీరియడ్
బి) మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్
సి) మాడిఫైడ్ మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: బి
3. పేదరికాన్ని లెక్కించడానికి తలసరి వినియోగ వ్యయం రోజుకు 1.90 డాలర్లుగా ప్రపంచ బ్యాంకు దేని ఆధారంగా నిర్ణయించింది?
ఎ) కొనుగోలు శక్తిసామ్యం
బి) ప్రజల జీవన ప్రమాణం
సి) పేదరిక స్థాయి
డి) పేదరిక అంతరం
- View Answer
- సమాధానం: ఎ
4. పేదరికాన్ని గణించడానికి ఎన్.ఎస్.ఎస్.ఒ. 68వ రౌండ్ గణాంకాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగాన్ని నెలకు ఎంత మొత్తంగా పరిగణనలోకి తీసుకుంది?
ఎ) రూ. 750
బి) రూ. 790
సి) రూ. 805
డి) రూ. 816
- View Answer
- సమాధానం: డి
5. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది?
ఎ) సురేష్ టెండూల్కర్
బి) ఎన్.సి. సక్సేనా
సి) రంగరాజన్
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
6. 2011-12 గణాంకాల ప్రకారం ఏ మతానికి చెందిన వారిలో పేదరికం ఎక్కువ శాతం ఉంది?
ఎ) ముస్లింలు
బి) క్రైస్తవులు
సి) జైనులు
డి) బౌద్ధులు
- View Answer
- సమాధానం: డి
7. 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగి, పనిచేసే సామర్థ్యం, కోరిక ఉండి, మార్కెట్లో లభించే వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని ఏమని పిలుస్తారు?
ఎ) ప్రధాన శ్రామికులు
బి) పనిలో పాలు పంచుకునే రేటు
సి) శ్రామిక శక్తి
డి) నిరుద్యోగులు
- View Answer
- సమాధానం: సి
8. ఒక సంవత్సర కాలంలో 183 రోజులు, అంతకంటే ఎక్కువ పనిదినాలు పొందుతున్న శ్రామిక శక్తిని ఏమంటారు?
ఎ) ప్రధాన శ్రామికులు
బి) ఉపాంత శ్రామికులు
సి) నిరుద్యోగం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
9. పట్టణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి ప్రభుత్వం 2010 మే 1న ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది?
ఎ) ఎన్.సి. సక్సేనా
బి) ఎస్.ఆర్. హసీమ్
సి) రంగరాజన్
డి) వై.వి.రెడ్డి
- View Answer
- సమాధానం: బి
10.ఒక దేశ ఆర్థిక ప్రగతి, ప్రజల వినియోగ స్థాయిని సూచించే కొలమానం ఏది?
ఎ) తలసరి ఆదాయం
బి) నామమాత్ర ఆదాయం
సి) ఆర్థిక అసమానతలు
డి) సంపద అసమానతలు
- View Answer
- సమాధానం: ఎ
11. భారతదేశంలో అంత్యోదయ అన్నయోజన కార్యక్రమం ప్రారంభించడానికి అమర్త్యసేన్ ప్రతిపాదించిన ఏ భావన కారణమైంది?
ఎ) ఆర్థిక అసమానతలు
బి) పేదవారిలోనే అతి పేదవారు
సి) సంపద అసమానతలు
డి) సప్లయ్ వైపు అర్థశాస్త్రం
- View Answer
- సమాధానం: బి
12. 2011 సాంఘిక - ఆర్థిక కుల గణాంకాల ప్రకారం దేశంలో వ్యవసాయదారులు ఎంత శాతం ఉన్నారు?
ఎ) 25.1
బి) 27.1
సి) 30.1
డి) 31.3
- View Answer
- సమాధానం: సి
13. ఒక వ్యక్తి పనిచేయడానికి ఇష్టపడి, పనికోసం ప్రయత్నించి ఏడాది కాలం ఖాళీగా ఉండే స్థితిని ఏ విధమైన నిరుద్యోగంగా పేర్కొంటారు?
ఎ) దైనందిన నిరుద్యోగిత
బి) వారం వారీ స్థితి నిరుద్యోగిత
సి) బాహ్య లేదా సాధారణ నిరుద్యోగిత
డి) అల్ప ఉద్యోగిత
- View Answer
- సమాధానం: సి
14. భారతదేశంలోని నిరుద్యోగం ప్రాథమికంగా ఏ రకమైంది?
ఎ) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
బి) పరిమాణాత్మక నిరుద్యోగిత
సి) చక్రీయ నిరుద్యోగిత
డి) ఘర్షిత నిరుద్యోగిత
- View Answer
- సమాధానం: బి
15. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లక్ష్యం ఏమిటి?
ఎ) నీటిపారుదల వినియోగం
బి) గ్రామీణ ఉపాధి
సి) గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కల్పన
డి) గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ
- View Answer
- సమాధానం: ఎ
16. ‘ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడం’ ఏ పథకం లక్ష్యం?
ఎ) క్రాష్ స్కీం ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్
బి) దుర్భిక్ష పీడిత ప్రాంతాల కార్యక్రమం
సి) సామాజిక అభివృద్ధి కార్యక్రమం
డి) 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం
- View Answer
- సమాధానం:సి
17. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి తక్కువ పరిమాణంలో రుణం, పొదుపు, విత్తపరమైన సేవలను కల్పించే విధానం?
ఎ) సూక్ష్మ విత్తం
బి) ప్రాధాన్య రంగ పరపతి
సి) రికరింగ్ డిపాజిట్ పథకం
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
18.భారత్‌లో మొదటిసారిగా కులాల వారీగా జనగణన ఎప్పుడు నిర్వహించారు?
ఎ) 1881
బి) 1891
సి) 1921
డి) 1931
- View Answer
- సమాధానం: డి
19. గ్రీన్ జీడీపీ కొలమానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఏది?
ఎ) ఇండియా
బి) చైనా
సి) బ్రిటన్
డి) కెనడా
- View Answer
- సమాధానం: బి
20. అర్థశాస్త్రం అంతిమ లక్ష్యం సంక్షేమమే కావాలని ప్రకటించిన ఆర్థికవేత్త?
ఎ) పాల్క్రూగ్మన్
బి) రఘురామ్ రాజన్
సి) అమర్త్యసేన్
డి) డి.ఆర్. గాడ్గిల్
- View Answer
- సమాధానం: సి
21. 2011 సాంఘిక - ఆర్థిక కుల గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం కుటుంబాల్లో వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఎంత శాతం?
ఎ) 56
బి) 57
సి) 58
డి) 59
- View Answer
- సమాధానం:ఎ
22. వ్యాపార కార్యకలాపాలు మందగించడం వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు?
ఎ) ప్రచ్ఛన్న నిరుద్యోగం
బి) రుతుసంబంధ నిరుద్యోగం
సి) సాంకేతికపరమైన నిరుద్యోగం
డి) చక్రీయ నిరుద్యోగం
- View Answer
- సమాధానం: డి
23. 1960-61లో సగటు తలసరి వినియోగం రోజుకు 2250 కేలరీలుగా పరిగణనలోకి తీసుకొని పేదరిక రేఖ దిగువన ఉన్న ప్రజల సంఖ్యను అంచనా వేసింది ఎవరు?
ఎ) మిన్హాస్
బి) పీడీ ఓజా
సి) అహ్లూవాలియా
డి) బర్దన్
- View Answer
- సమాధానం: బి
24.కింద పేర్కొన్న ఏ చర్య పేదరిక సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది?
ఎ) సరళీకరణ, జీడీపీ వృద్ధికి బదులుగా పేదల అనుకూల వృద్ధి వ్యూహానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం
బి) వ్యవసాయ వృద్ధి రేటు పెంపు
సి) అసంఘటిత రంగంలో ఉత్పాదక, ఉపాధి నాణ్యత పెంపు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం:డి
25. ఎన్డీఏ ప్రభుత్వం ‘పది మిలియన్ ఉపాధి అవకాశాల లక్ష్యం’ దిశగా ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రూప్ అధ్యక్షులు ఎవరు?
ఎ) ఎస్.పి. గుప్తా
బి) రంగరాజన్
సి) డి. సుబ్బారావు
డి) వై.వి. రెడ్డి
- View Answer
- సమాధానం: ఎ
26. 1972-73లో ఉపాధి హామీ పథకాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం?
ఎ) బిహార్
బి) గుజరాత్
సి) మహారాష్ట్ర
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
27. 1989 ఏప్రిల్ 28న ‘జవహర్ రోజ్‌గార్ యోజన’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినవారు?
ఎ) ఇందిరాగాంధీ
బి) రాజీవ్‌గాంధీ
సి) ప్రణబ్ ముఖర్జీ
డి) వి.పి. సింగ్
- View Answer
- సమాధానం: బి
28. పేదరికం అంటే ...?
ఎ) నిరుద్యోగిత
బి) నిరక్షరాస్యత
సి) ఎంచుకునే స్వాతంత్య్రం లేకపోవడం
డి) ప్రాథమిక అవసరాల అందుబాటు లోపించడం
- View Answer
- సమాధానం: డి
29. కేంద్ర ప్రభుత్వం పేదరిక అంచనాల కోసం 1989లో నియమించిన కమిటీ ఏది?
ఎ) సురేష్ టెండూల్కర్ కమిటీ
బి) లక్డావాలా కమిటీ
సి) రంగరాజన్ కమిటీ
డి) హసీమ్ కమిటీ
- View Answer
- సమాధానం: బి
30. పేదరిక తీవ్రతను గణించడానికి ఉపకరించే సూచీ ఏది?
ఎ) పేదరిక అంతరం
బి) జీవన ప్రమాణం
సి) తలసరి ఆదాయం
డి) వ్యయార్హ ఆదాయం
- View Answer
- సమాధానం: ఎ
31. 2004-05లో ఒడిశా తర్వాత అధిక పేదరికం నమోదైన రాష్ట్రం ఏది?
ఎ) ఛత్తీస్‌గఢ్
బి) మధ్యప్రదేశ్
సి) బిహార్
డి) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
32. సురేష్ టెండూల్కర్ పేదరిక కొలమాన పద్ధతిని సమీక్షించడానికి ప్రణాళికా సంఘం 2012 మే 23న ఎవరి అధ్యక్షతన నిపుణుల గ్రూపును ఏర్పాటు చేసింది?
ఎ) రంగరాజన్
బి) హసీమ్
సి) రఘురామ్‌రాజన్
డి) సక్సేనా
- View Answer
- సమాధానం: ఎ
33. 2011-12లో రంగరాజన్ పేదరిక కొలమాన పద్ధతి ప్రకారం అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రాలు వరసగా?
ఎ) హిమాచల్ ప్రదేశ్, గోవా, లక్షదీవులు, అండమాన్ నికోబార్
బి) అండమాన్ నికోబార్, గోవా, లక్షదీవులు, హిమాచల్ ప్రదేశ్
సి) లక్షదీవులు, గోవా, అండమాన్ నికోబార్, హిమాచల్ ప్రదేశ్
డి) గోవా, లక్షదీవులు, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్
- View Answer
- సమాధానం: బి
34. ఎన్.ఎస్.ఎస్.ఒ. 68వ రౌండ్ (2011-12) గణాంకాల ప్రకారం అత్యల్ప పేదరిక రేటు నమోదైన రాష్ట్రాలు వరస క్రమంలో?
ఎ) కేరళ, గోవా, అండమాన్ నికోబార్, లక్షదీవులు
బి) గోవా, లక్షదీవులు, అంమాన్ నికోబార్, కేరళ
సి) లక్షదీవులు, అండమాన్ నికోబార్, గోవా, కేరళ
డి) అండమాన్ నికోబార్, లక్షదీవులు, గోవా, కేరళ
- View Answer
- సమాధానం: డి
35. భారత్‌లో పేదరికం, నిరుద్యోగం అంచనాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేది?
ఎ) జాతీయ అభివృద్ధి మండలి
బి) ప్రణాళికా సంఘం
సి) ఆర్థిక సంఘం
డి) కేంద్ర ప్రభుత్వం
- View Answer
- సమాధానం: బి
36. 1977లో నియమించిన ఏ కమిటీ పేదరిక అంచనాకు గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణాల్లో 2100 కేలరీల ఆహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సిఫారసు చేసింది?
ఎ) వై.కె. అలఘ్
బి) హసీమ్
సి) సక్సేనా
డి) లక్డావాలా
- View Answer
- సమాధానం: ఎ
37. ఐక్యరాజ్య సమితి 1997లో పేదరికాన్ని అంచనా వేయడానికి దేన్ని కొలమానంగా తీసుకుంది?
ఎ) మానవాభివృద్ధి సూచీ
బి) లింగ సంబంధిత అసమానతల సూచీ
సి) లింగ సంబంధిత అభివృద్ధి సూచీ
డి) మానవ పేదరిక సూచీ
- View Answer
- సమాధానం:డి
38.పేదల సంఖ్యను కింది వాటిలో దేని ఆధారంగా నిర్ణయిస్తారు?
ఎ) తలసరి ఆదాయం
బి) దారిద్య్ర రేఖ
సి) ఆదాయ అసమానతలు
డి) ప్రాంతీయ అసమానతలు
- View Answer
- సమాధానం: బి
39. ప్రణాళికా వ్యూహాలు ఆశించిన స్థాయిలో పేదరికాన్ని తగ్గించడానికి సహకరించడం లేదని వివరించింది ఎవరు?
ఎ) మిన్హాస్
బి) దండేకర్
సి) ఓజా
డి) బర్దన్
- View Answer
- సమాధానం: ఎ
40. ఆహార వ్యయం ఆధారంగా పేదరికాన్ని లెక్కించడానికి 1962లో ప్రణాళికా సంఘం ఎవరు సూచించిన కొలమాన పద్ధతిని ఆమోదించింది?
ఎ) బర్దన్
బి) మిన్హాస్
సి) దండేకర్, రధ్
డి) జాతీయ అభివృద్ధి మండలి
- View Answer
- సమాధానం: సి
41. భారతదేశంలో పేదరికాన్ని ఆహారం ప్రాతిపదికగా లెక్కించి గ్రామీణ ప్రాంతాల్లో అధిక పేదరికం ఉన్నట్లు అభిప్రాయపడింది?
ఎ) అలఘ్, దండేకర్, నౌరోజీ
బి) మిన్హాస్, బర్దన్, మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా
సి) సురేష్ టెండూల్కర్, సక్సేనా, హసీమ్
డి) పైవేవీ కాదు
42. ప్రణాళికా సంఘం పేదరిక అంచనాలకు నూతన కొలమాన పద్ధతి సూచించడానికి సురేష్ టెండూల్కర్ అధ్యక్షతన నిపుణుల గ్రూపును ఎప్పుడు ఏర్పాటు చేసింది?
ఎ) డిసెంబర్ 2005
బి) ఫిబ్రవరి 2006
సి) ఏప్రిల్ 2006
డి) డిసెంబర్ 2006
- View Answer
- సమాధానం: ఎ
43. దారిద్య్ర రేఖ, సగటు పేదరిక రేఖ దిగువన ఉన్న జనాభా మధ్య ఉండే వ్యత్యాసం?
ఎ) అధిక జీవన ప్రమాణం
బి) అధిక తలసరి ఆదాయం
సి) పేదరిక అంతరం
డి) అధిక సహజ వనరుల వినియోగం
- View Answer
- సమాధానం: సి
44. 2011 సాంఘిక - ఆర్థిక కుల గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం గ్రామీణ కుటుంబాల సంఖ్య?
ఎ) 17.11 కోట్లు
బి) 17.91 కోట్లు
సి) 18.11 కోట్లు
డి) 18.91 కోట్లు
- View Answer
- సమాధానం: బి
45.శ్రామిక శక్తిలో భాగంగా ఉండి, వాస్తవంగా ఉపాధి పొందే శ్రామిక శక్తిని ఏమంటారు?
ఎ) పనిలో పాలుపంచుకున్న శ్రామికులు
బి) ప్రధాన శ్రామికులు
సి) నిరుద్యోగులు
డి) ఉపాంత శ్రామికులు
- View Answer
- సమాధానం: ఎ
46. ఏ కారణం వల్ల ‘వ్యాపార చక్రాల ప్రభావం భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థల్లో తక్కువ’ అని భావించవచ్చు?
ఎ) సేవల ఆధారిత వ్యవస్థ
బి) తయారీ రంగ ఆధారిత వ్యవస్థ
సి) వ్యవసాయాధారిత వ్యవస్థ
డి) అధిక పెట్టుబడులు
- View Answer
- సమాధానం: సి
47. బ్రిటిష్ పాలనలో భారతదేశ ఆర్థిక దోపిడీని కింది ఏ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు?
ఎ) పావర్టీ ఆఫ్ ఇండియా
బి) డ్రెయిన్ ఆఫ్ వెల్త్
సి) పావర్టీ ఇన్ ఇండియా
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
48.ఎన్.ఎస్.ఎస్.ఒ. సర్వే ప్రకారం 2011-12లో పెద్ద రాష్ట్రాల్లో నిరుద్యోగం తక్కువగా నమోదైన రాష్ట్రం ఏది?
ఎ) గుజరాత్
బి) కేరళ
సి) మధ్యప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: ఎ