గ్రోత్ అండ్ డెవలప్మెంట్ (వృద్ధి - అభివృద్ది)
1. బెంజిమన్ హిగ్గిన్స్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఏ అంశం గురించి పేర్కొన్నారు?
ఎ) సామాజిక ద్వంద్వత్వం
బి) సాంకేతిక ద్వంద్వత్వం
సి) అల్పస్థాయి సమతౌల్య స్తంభన
డి) వస్తుమార్పిడి విధానం
- View Answer
- సమాధానం: బి
2. ఆధునిక అభివృద్ధిలో సాంకేతిక ప్రగతి ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నవారు?
ఎ) కుజ్నట్స్
బి) హరాడ్ - డోమార్
సి) మాధుర్
డి) షుంపీటర్
- View Answer
- సమాధానం: ఎ
3. రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం స్వయం సమృద్ధి సాధించిన దశగా దేన్ని భావించవచ్చు?
ఎ) అధిక వినియోగ దశ
బి) ప్లవన దశ
సి) ప్లవన దశకు ముందున్న పరిస్థితి
డి) పరిపక్వ దశకు గమనం
- View Answer
- సమాధానం: డి
4. కార్ల్ మార్క్స్ కింది వాటిలో దేనికి ప్రాముఖ్యం ఇచ్చారు?
ఎ) మూలధన ఉత్పత్తి నిష్పత్తి
బి) పొదుపు - మూలధన నిష్పత్తి
సి) ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ కాపిటల్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
5. రోస్టో రచించిన "The stages of Economic Growth" గ్రంథాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు?
ఎ) కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో
బి) నాన్ కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో
సి) మూలధన సంచయనం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
6. ప్రపంచంలో అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిణామాలను మొదటగా వివరించింది?
ఎ) డాల్టన్
బి) థామస్ మాల్దస్
సి) రాబిన్సన్
డి) డ్యూసెన్బరి
- View Answer
- సమాధానం: బి
7. 2013-14లో దేశంలో స్థూల దేశీయ పొదుపు రేటు ఎంత?
ఎ) జీడీపీలో 30.6 శాతం
బి) జీడీపీలో 32 శాతం
సి) జీడీపీలో 33 శాతం
డి) జీడీపీలో 34 శాతం
- View Answer
- సమాధానం: ఎ
8. "The problems of Industrialization in Eastern & South Eastern European Nations" గ్రంథకర్త?
ఎ) కార్ల్ మార్క్స్
బి) రాగ్నర్నర్క్స్
సి) రొసెన్స్టిన్ రోడాన్
డి) థామస్ మన్రో
- View Answer
- సమాధానం: సి
9. రాగ్నర్నర్క్స్ సిద్ధాంతం ప్రకారం డిమాండ్ కోణంలో విష వలయాన్ని చేధించడానికి పేద దేశాల్లో వేటికి డిమాండ్ పెరగాలి?
ఎ) పెట్టుబడి
బి) పొదుపు
సి) ఆదాయం
డి) వస్తువులు, సేవలు
- View Answer
- సమాధానం: డి
10. 2016-17లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచ బ్యాంకు ఎంత శాతంగా అంచనా వేసింది?
ఎ) 7.7
బి) 7.8
సి) 7.9
డి) 8.0
- View Answer
- సమాధానం: బి
11. మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు?
ఎ) ఆల్ఫ్రెడ్ సవి
బి) మార్షల్
సి) ఫిషర్
డి) జాన్ రాబిన్సన్
- View Answer
- సమాధానం: ఎ
12. స్థిర మూల ధనానికి, చర మూలధనానికి మధ్య నిష్పత్తిని తెలిపేది?
ఎ) మూలధన - ఉత్పత్తి నిష్పత్తి
బి) పొదుపు - మూలధన ఉత్పత్తి నిష్పత్తి
సి) ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ కాపిటల్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
13. అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని మొదటగా చెప్పిన శాస్త్రవేత్త?
ఎ) మాల్దస్
బి) ఎడ్వర్డ్ వెస్ట్
సి) రాగ్నర్నర్క్స్
డి) షుంపీటర్
- View Answer
- సమాధానం: బి
14. ‘జనాభా పెరుగుదల సమాజంలో ఆదర్శవంతమైన మార్పునకు సహకరిస్తుంది’ అని పేర్కొన్నవారు?
ఎ) కార్లమార్క్స్
బి) డ్యూసెన్బరి
సి) గౌతమ్ మాధుర్
డి) మాల్దస్
- View Answer
- సమాధానం: ఎ
15.బలహీన Spread effects గురించి వివరించినవారెవరు?
ఎ) హరాడ్
బి) ఫీల్డ్‌మన్
సి) గున్నార్ మిర్ధాల్
డి) ఎడ్వర్డ్ వెస్ట్
- View Answer
- సమాధానం: సి
16. వనరులతో పోలిస్తే తక్కువ పెట్టుబడులు ఉన్న దేశాలను అల్పాభివృద్ధి దేశాలుగా అభిప్రాయపడినవారు?
ఎ) ఫీల్డ్‌మన్
బి) హెబర్లర్
సి) మార్షల్
డి) రాగ్నర్నర్క్స్
- View Answer
- సమాధానం: డి
17. కమ్యూనిజం, సోషలిజం ఆధారిత దేశాలను ఏ దేశాలుగా వర్ణించవచ్చు?
ఎ) మొదటి ప్రపంచ దేశాలు
బి) రెండో ప్రపంచ దేశాలు
సి) మూడో ప్రపంచ దేశాలు
డి) నాలుగో ప్రపంచ దేశాలు
- View Answer
- సమాధానం: బి
18. అంతర్జాతీయ వాణిజ్యం అల్పాభివృద్ధి దేశాల పారిశ్రామికీకరణకు అవరోధమని భావించింది?
ఎ) గున్నార్ మిర్దాల్
బి) హర్షమన్
సి) డాల్టన్
డి) హెబర్లర్
- View Answer
- సమాధానం: ఎ
19. విద్యా ప్రమాణాలు, శ్రామిక నైపుణ్యం పెరిగితే మూలధన - ఉత్పత్తి నిష్పత్తి?
ఎ) పెరుగుతుంది
బి) స్థిరంగా ఉంటుంది
సి) తగ్గుతుంది
డి) పెరుగుదలలో పెరుగుదల రేటు ఎక్కువ
- View Answer
- సమాధానం: సి
20. మార్కెట్ విస్తృతికి అవసరమైన ముఖ్య కారకం ఏది?
ఎ) శ్రమ
బి) మూలధనం
సి) వ్యవస్థాపన
డి) తక్కువ సాంకేతిక ప్రగతి
- View Answer
- సమాధానం: బి
21. ద్వి అంతర నమూనాను ప్రతిపాదించింది?
ఎ) చినరీ
బి) కార్ల్ మార్క్స్
సి) మహలనోబిస్
డి) ఫీల్డ్‌మన్
- View Answer
- సమాధానం: ఎ
22. ‘శ్రమ విభజన ప్రత్యేకీకరణను పెంపొందిస్తుంది’ అని పేర్కొన్నవారు?
ఎ) కార్ల్ మార్క్స్
బి) ఆడమ్ స్మిత్
సి) మహలనోబిస్
డి) గౌతమ్ మాధుర్
- View Answer
- సమాధానం: బి
23. 2013-14లో స్థూల దేశీయ పొదుపులో ప్రభుత్వ రంగం వాటా ఎంత?
ఎ) జీడీపీలో 1%
బి) జీడీపీలో 1.3%
సి) జీడీపీలో 1.5%
డి) జీడీపీలో 1.6%
- View Answer
- సమాధానం: డి
24. అంతర్జాతీయ వాణిజ్యం వెనుకబడిన దేశాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నది?
ఎ) మార్షల్
బి) హెబర్లర్
సి) రాగ్నర్నర్క్స్
డి) గౌతమ్ మాధుర్
- View Answer
- సమాధానం: బి
25. Incremental Capital - Output Ratio (ICOR)ను ఎలా రాబట్టవచ్చు?
ఎ) (పొదుపులో మార్పు) ÷ (పెట్టుబడిలో మార్పు)
బి) (మూలధనంలో మార్పు)÷ (ఉత్పత్తిలో మార్పు)
సి) (పెట్టుబడిలో మార్పు)÷ (శ్రమలో మార్పు)
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
26. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికి ప్రధాన పాత్ర పోషించిన కారకం ఏది?
ఎ) మూలధన సంచయనం
బి) జనాభా పెరుగుదల
సి) సహజ వనరుల లభ్యత
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
27. మాల్దస్ జనాభా సిద్ధాంతం ప్రకారం జనాభా వృద్ధిరేటును తగ్గించేది?
ఎ) ప్రకృతి
బి) తక్కువ ఉపాధి
సి) తక్కువ ఆదాయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం:ఎ
28. "Towards A dynamic Economics" గ్రంథకర్త?
ఎ) డోమార్
బి) హరాడ్
సి) రాబిన్సన్
డి) ఫీల్డ్‌మన్
- View Answer
- సమాధానం: బి
29. ట్రికిల్ డౌన్ వ్యూహాన్ని ప్రతిపాదించింది?
ఎ) ఫీల్డ్‌మన్
బి) రాబిన్సన్
సి) షుంపీటర్
డి) మహలనోబిస్
- View Answer
- సమాధానం: ఎ
30. అల్పాభివృద్ధి దేశాలను ప్రపంచ మురికి వాడలుగా పేర్కొన్నవారు?
ఎ) మార్షల్
బి) ఆడమ్‌స్మిత్
సి) రాబిన్సన్
డి) కైరన్క్రాస్
- View Answer
- సమాధానం: డి
31. ‘అదృశ్య హస్తం’ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినవారు?
ఎ) మార్షల్
బి) రాగ్నర్నర్క్స్
సి) ఆడమ్ స్మిత్
డి) మీడ్
- View Answer
- సమాధానం: సి
32. అల్ప స్థాయి సమతౌల్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా కాలం చిక్కుకొని ఉన్నాయని పేర్కొన్నవారు?
ఎ) నెల్సన్
బి) లూయిస్
సి) డాల్టన్
డి) జె.బి. సీ
- View Answer
- సమాధానం: ఎ
33. అల్పాదాయం అనేది అల్పాభివృద్ధి దేశాల్లో విష వలయాలకు కారణమవుతోందని పేర్కొన్నవారు?
ఎ) డాల్టన్
బి) రాబిన్సన్
సి) రాగ్నర్నర్క్స్
డి) హెబర్లర్
- View Answer
- సమాధానం: సి
34. వెనుకబడ్డ దేశాల్లో అమల్లో ఉన్న సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులు ఆయా దేశాల ఆర్థికాభివృద్ధికి నిరోధకాలుగా ఉంటాయి. వీటిని ఏమంటారు?
ఎ) సాంకేతిక పూర్వక నిరోధకాలు
బి) వ్యవస్థాపూర్వక నిరోధకాలు
సి) మార్కెట్ సంపూర్ణతలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
35. ఆసియా దేశాల్లో ఉద్యమత్వం లోపించడానికి మూలధన కొరత లేదా ముడి సరకుల కొరత కారణం కాదని పేర్కొన్నది ఎవరు?
ఎ) గున్నార్ మిర్దాల్
బి) ఆడమ్ స్మిత్
సి) జె.బి. సీ
డి) హెబర్లర్
- View Answer
- సమాధానం: ఎ
36. అధిక స్థాయి తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన జనాభా స్థాయిని అభిలషణీయ జనాభాగా పేర్కొన్నవారు?
ఎ) కార్ల్ మార్క్స్, జె.బి. సీ
బి) మార్షల్, ఆడమ్ స్మిత్
సి) డాల్టన్, ఎడ్విన్ కానన్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
37. ‘పొదుపును ప్రోత్సహించడం ద్వారా లభించే మూలధనాన్ని గుర్తించిన రంగాల్లో పెట్టుబడులుగా మార్చాలి’ అనేది ఏ రకమైన వృద్ధి వ్యూహం?
ఎ) ప్లవన దశ
బి) సంతులిత
సి) అసంతులిత
డి) పరిపక్వ దశకు గమనం
- View Answer
- సమాధానం: సి
38. "Rate of Growth and Employment" గ్రంథకర్త?
ఎ) హరాడ్
బి) డోమార్
సి) రాబిన్సన్
డి) రాగ్నర్నర్క్స్
- View Answer
- సమాధానం: బి
39. మహలనోబిస్ నాలుగు రంగాల నమూనా ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది?
ఎ) ట్రికిల్ డౌన్ వ్యూహం
బి) సోలో సిద్ధాంతం
సి) డోమార్ సిద్ధాంతం
డి) అధిక పెట్టుబడుల సిద్ధాంతం
- View Answer
- సమాధానం: ఎ
40. ఆదాయం, డిమాండ్ పెరగడం వల్ల లాభోద్దేశంతో సమకూరే పెట్టుబడి?
ఎ) స్వయం ప్రేరిత పెట్టుబడి
బి) ప్రేరిత పెట్టుబడి
సి) స్థూల పెట్టుబడి
డి) నికర పెట్టుబడి
- View Answer
- సమాధానం: బి
41. ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ పోటీ, స్వేచ్ఛా వ్యాపారం, వేతన సరళత ఉండాలని పేర్కొన్నవారు?
ఎ) కీన్స్
బి) పాల్క్రూగ్మన్
సి) ఫ్రీడ్మన్
డి) సాంప్రదాయ ఆర్థికవేత్తలు
- View Answer
- సమాధానం: డి
42. ‘అభివృద్ధి లక్ష్యం అభిలషణీయ స్వర్ణయుగాన్ని సాధించడం’ అని పేర్కొన్నవారు?
ఎ) గౌతం మాధుర్
బి) ఆడమ్ స్మిత్
సి) రాబిన్సన్
డి) జె.బి. సీ
- View Answer
- సమాధానం:ఎ
43. ‘ఆర్థికాభివృద్ధి నిత్యం కొనసాగే అంతులేని ప్రక్రియ’ అని పేర్కొన్నవారెవరు?
ఎ) మార్షల్
బి) పాల్క్రూగ్మన్
సి) హెగల్
డి) డాల్టన్
- View Answer
- సమాధానం: సి
44. ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఒక స్థాయి నుంచి పై స్థాయికి కదలడాన్ని ఆర్థికాభివృద్ధిగా అభివర్ణించినవారు?
ఎ) షుంపీటర్
బి) గున్నార్ మిర్దాల్
సి) కీన్స్
డి) డ్యూసెన్బరి
- View Answer
- సమాధానం: బి
45. ‘ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో శ్రమ సాంద్రత పద్ధతులు, ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత మూలధన సాంద్రత పద్ధతులు ఉపయోగించాలి’ అని పేర్కొన్నవారు?
ఎ) ఐక్యరాజ్య సమితి నిపుణులు
బి) ప్రపంచ బ్యాంకు
సి) IMF
డి) WTO
- View Answer
- సమాధానం: ఎ
46. చిరకాలంలో వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదలను ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నది?
ఎ) డాల్టన్
బి) కానన్
సి) హెగల్
డి) ఆచార్య ఎల్లిస్
- View Answer
- సమాధానం: డి
47. భారీ పరిశ్రమలు స్థాపించడం వల్ల దశల వారీగా వాటి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చి ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని చెప్పినవారు?
ఎ) ఆడమ్‌స్మిత్
బి) ఫీల్డ్‌మన్
సి) డాల్టన్
డి) హెగల్
- View Answer
- సమాధానం: బి
48. "Business cycles, Capitalism, Socialism and Democracy" గ్రంథకర్త?
ఎ) షుంపీటర్
బి) కానన్
సి) హెగల్
డి) ఎల్లిస్
- View Answer
- సమాధానం: ఎ
49. పొదుపు, పెట్టుబడుల మధ్య అంతరాన్ని పూరించడానికి అల్పాభివృద్ధి దేశాలు సాధారణంగా ఏ సాధనాన్ని ఉపయోగిస్తాయి?
ఎ) పన్నుల రేటు పెంచడం
బి) లోటు బడ్జెట్
సి) విదేశీ సహాయం
డి) అంతర్గత రుణాలు
- View Answer
- సమాధానం: బి
50. "An Operational Research Approach to Indian Planning of 4 sector model" పుస్తక రచయిత?
ఎ) ఆడమ్ స్మిత్
బి) కార్ల్ మార్క్స్
సి) మహలనోబిస్
డి) మార్షల్
- View Answer
- సమాధానం: సి