Supremecourt: ఏఐబీఈ పరీక్ష నిర్వహణపై తుది నిర్ణయం బీసీఐదే
Sakshi Education
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) పరీక్ష రాసే అవకాశం ఆఖరి సెమిస్టర్ న్యాయ కళాశాల విద్యార్థులకూ కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే తుది ఫలితం.. కళాశాల పరీక్షలో మూడు అంశాల్లో సాధించే ఉత్తీర్ణతపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
అంతేకాదు.. ఏఐబీఈ పరీక్ష నిర్వహణపై తుది నిర్ణయం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)దేనని శుక్రవారం అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో అడ్వొకేట్స్ చట్టం ప్రకారం బీసీఐకి తగిన అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. న్యాయస్థానాల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేయాలంటే ఏఐబీఈ పరీక్ష తప్పనిసరి.
Published date : 11 Feb 2023 05:40PM