Youngest Magazine Editor: ఎనిమిదేళ్లకే మ్యాగజైన్ ఎడిటర్‌గా రికార్డు సృష్టించిన బాలిక.. ఎవరీ పిడుగు..!

సాధారణంగా వార్తాపత్రికలు లేదా మ్యాగజైన్‌లు బయటకు రావాలంటే చాలా మంది శ్రమ పడతారు, వారికి ఎడిటర్ బాస్‌గా వ్యవహరిస్తారు. ఎడిటర్‌గా పనిచేయాలంటే ఎంతో అనుభవం అవసరం. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఎనిమిదేళ్ల బాలిక మ్యాగజైన్ ఎడిటర్‌గా మారి రికార్డు సృష్టించింది.
ఇట్ గర్ల్ మ్యాగజైన్ ఎడిటర్‌గా..
ఆస్ట్రేలియాకు చెందిన రోక్సాన్ డౌన్స్ ఎనిమిదేళ్ల వయసులోనే 'ఇట్ గర్ల్ మ్యాగజైన్(It Girl Magazine)'కు ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టింది. సాధారణంగా ఆ వయసు పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడతారు, కానీ రోక్సాన్ మాత్రం ఏదైనా కొత్తగా చేయాలని భావించింది. తన వయసు బాలికలు చదువుకోవడానికి ఆసక్తి చూపే ఒక మ్యాగజైన్‌ను రూపొందించాలని నిర్ణయించుకుంది.
మ్యాగజైన్‌లో ఏం రాయాలో, ఎలాంటి అంశాలను చేర్చాలో తెలుసుకోవడానికి రోక్సాన్ చాలా పరిశోధనలు చేసింది. తన వయసు పిల్లలతో రోజంతా కలిసి తిరుగుతూ వారి అభిరుచులు, ఇష్టాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆసక్తులను గమనించింది. వాటి గురించి తన మ్యాగజైన్‌లో వ్యాసాలు రాయడం ప్రారంభించింది.
ప్రసిద్ధి, గుర్తింపు
రోక్సాన్ తన మ్యాగజైన్ కోసం ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ బాగా ప్రాచుర్యం పొందడంతో, ఆ తర్వాత అనేక మంది రచయితలు, టిక్‌టాక్ స్టార్లు, గాయకులు, నటులను ఇంటర్వ్యూలు చేసే స్థాయికి చేరుకుంది. ఈ ఇంటర్వ్యూలను వీడియో రూపంలో యూట్యూబ్‌లో కూడా చూడవచ్చు.
ఒక వైపు మ్యాగజైన్ పనులు చేస్తూనే, రోక్సాన్ తన పాఠశాల చదువును కూడా కొనసాగిస్తోంది. బద్దకంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని, జీవితంలో ఏదైనా సాధించాలనే ఆకాంక్ష అందరిలోనూ ఉండాలని ఆమె చెబుతోంది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)