పొరుగు దౌత్యం.. పొందు లాభం
Sakshi Education
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చేపట్టిన పర్యటన వ్యూహాత్మకంగా కీలకమైంది. ఈ సౌహార్థ్రయాత్ర ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత పెంచడంలో ఓ ముందడుగనే చెప్పాలి. భారత్‌కు ఇరుగు పొరుగు ప్రపంచంతో సంబంధాల్ని సుసంపన్నం చేసుకోవడానికి స్నేహహస్తం అందుకోవడానికి ప్రధాని పరితపిస్తున్న తీరు ప్రశంసనీయం. ఓవైపు హిందూ మహాసముద్ర ప్రాంతంలో తిష్టవేసిన చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి దక్షిణాసియాలో భారత్‌కున్న ప్రాధాన్యాన్ని మరింత ఇనుమడింపజేయడంలో తనదైన దౌత్య పాటవాన్ని ప్రదర్శించడంలో ప్రధాని అనుసరిస్తున్న తీరు అమోఘం.
భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలైన శ్రీలంక, సీషెల్స్, మారిషస్ పర్యటన వెనుక ఉన్న ఉద్దేశం ప్రత్యేకించి హిందూ మహాసముద్ర ప్రాంతంపై మారీటైమ్ పవర్ పునరుద్ధరణకే అని భావించొచ్చు. సీషెల్స్, మారిషస్ దేశాల్లో ఇందిరాగాంధీ అనంతరం పర్యటించిన ప్రధాని మోదీ మాత్రమే. 1987లో ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ శ్రీలంకలో పర్యటించగా, ఆ తర్వాత కాలంలో అక్కడ పర్యటించిన ప్రధాని కూడా మోదీయే. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సైనిక కార్యకలాపాల విస్తరణతో పాటు ఆర్థిక సంబంధాల్ని మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలతో చైనా గ డచిన దశాబ్ద కాలంలో ఆర్థిక సంబంధాల్ని మెరుగుపరచుకొంది. 2013 లో శ్రీలంక, మారిషస్ దేశాలకు సంబంధించి భారత్ తర్వా త రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా నిలిచింది. దశాబ్దానికి ముందు శ్రీలంక వాణిజ్యంలో చైనా వాటా 3 శాతం కాగా ప్రస్తుతం అది 11 శాతానికి చేరింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు పెద్ద పొరుగు దేశం శ్రీలంక. గత పదేళ్ల కాలంలో మహీందా రాజపక్సే హయాంలో చైనా వైపే మొగ్గు చూపింది. ఇప్పుడు మైత్రిపాల సిరిసేన నాయకత్వంలో ఆ దేశం భారత్‌తో స్నేహహస్తాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. సముద్ర జలాల భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకారానికి ఉవ్విళ్లూరుతోంది.
సీషెల్స్‌లో మోదీ పర్యటన
ఆఫ్రికా ప్రాంతానికి చెందిన సీషెల్స్‌కు మెడగాస్కర్, మారిషస్, టాంజానియాలు సముద్ర ప్రాంత దేశాలు. ఈ దేశం యునెటైడ్ కింగ్డమ్ నుంచి 29 జూన్ 1976న స్వాతం త్య్రం పొంది సర్వసత్తాక రాజ్యంగా వెలిసింది. 150 దీవులు కలిగిన సీషెల్స్‌కు రాజధాని విక్టోరియా. 2012 అంచనాల ప్రకారం సీషెల్స్ జనాభా 92వేలు. 2014 అంచనాల ప్రకారం జీడీపీ 2.76 బిలియన్ డాలర్లు కాగా తలసరి ఆదాయం 30 వేల డాలర్లు. సీషెల్స్ అధికార భాషలు ఫ్రెంచ్, ఇంగ్లిష్, సీషెలియస్ క్రియోల్ (ఫ్రెంచ్ ఆధారితమైన ఈ భాషను క్రియోల్ లేదా సెసెల్వా అని కూడా అంటారు). ఈ దేశాన్ని అధిక మానవాభివృద్ధి రేటు కలిగిన దేశాల్లో ఒకటిగా యూఎన్డీపీ పేర్కొంది. 2013లో యూఎన్డీపీ మానవాభివృద్ధి సూచీ విలువ 0.756. సీషెల్స్ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ పర్యాటక రంగమే. 15 శాతం శ్రామిక శక్తికి పర్యాటక రంగం ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. నిర్మాణ, బ్యాంకింగ్, రవాణా, ఇతర కార్యకలాపాల్లో ఉపాధి కూడా పర్యాటక రంగంతో ముడిపడి ఉంది. 491 కిలోమీటర్ల సముద్ర తీరం సీషెల్స్ సొంతం. ఉపాధి, స్థూల రాబడి పరంగా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పర్యాటకంతో పాటు మత్స్య గ్రహణం (ఫిషింగ్), కొబ్బరి, వెనీలా ప్రాసెసింగ్, పీచు పరిశ్రమ, పడవల నిర్మాణం, ముద్రణ (ప్రింటింగ్), ఫర్నీచర్ ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు. స్వీట్ పొటాటో, అరటి, పౌల్ట్రీ ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. జీడీపీలో సేవారంగం వాటా 66.4 శాతం, పరిశ్రమల వాటా 30.4 శాతం, వ్యవసాయ రంగం వాటా 3.2 శాతం.
2015 మార్చి 10,11 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్‌లో పర్యటించారు. సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షులు జేమ్స్ మైఖేల్ మోదీకి స్వాగతం పలికారు. భద్రతకు సంబంధించిన సహకారాన్ని పటిష్ట పరిచే చర్యలో భాగంగా ఇరుదేశాలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అవి 1. కోపరేషన్ ఇన్ హైడ్రోగ్రఫీ, 2. కోపరేషన్ ఇన్ రెన్యువబుల్ ఎనర్జీ, 3. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి సంబంధించిన సహకారం, 4. కోపరేషన్ ఇన్ ఎలక్ట్రానిక్ నావిగేషనల్ చార్ట్స్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ భద్రతతో పాటు ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తీర ప్రాంత నిఘా రాడార్ ప్రాజెక్ట్ (కోస్టల్ సర్వైవలెన్స్ రాడార్ ప్రాజెక్టు)ను ప్రారంభించారు. సముద్ర తీర రక్షణ సామర్థ్యాల్ని పెంచడానికి సీషెల్స్‌కు భారత్ డార్నియల్ ఎయిర్ క్రాఫ్ట్ (Dornier aircraft) ను బహుకరించింది. వాతావరణ మార్పులను చక్కదిద్దడంలో ఇరు దేశాలు సంయుక్తంగా ముందడుగు వేసేందుకు నిర్ణయించాయి.
మారిషస్ పర్యటన
మారిషస్ విస్తీర్ణం 2040 చదరపు కిలోమీటర్లు. పరిమాణం లో ప్రపంచంలో 180వ స్థానం. 1968 స్వాతంత్య్రానంత రం అల్పాదాయ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థగా మారిషస్ అవతరించింది. పర్యాటకం, వస్త్ర పరిశ్రమ(టెక్స్టైల్స్), పంచదార, ఆర్థిక సేవలు (ఫైనాన్షియల్ సర్వీసులు) ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనవి.
ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న మారిషస్‌కు మెడగాస్కర్, మయోతీ, కామెరూస్, సీషెల్స్, మొజాంబిక్, మలావిలు ఇరుగు పొరుగు దేశాలు. 2015లో మారిషస్ ఎగుమతుల్లో యునెటైడ్ కింగ్డమ్ వాటా 40.08 శాతం. ఫ్రాన్స్ వాటా 16.40 శాతం, అమెరికా 7.66 శాతం కాగా భారత్ వాటా 0.48శాతం. మారిషస్ దిగుమతుల్లో మాత్రం 35.16 శాతం తో మనదే ప్రథమ స్థానం. 2014 అంచనాల ప్రకారం మారిషస్ జనాభా 1.261 మిలియన్లు. 2015 అంచనాల ప్రకారం జీడీపీ 23.322 బిలియన్ డాలర్లు. తలసరి ఆదాయం 17,716 డాలర్లు.
ప్రధాని మోదీ మారిషస్ సందర్శనలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.
శ్రీలంక పర్యటన
వాయువ్య దిశలో భారత్, ఈశాన్యంలో మాల్దీవులతో శ్రీలంక తీర సరిహద్దు కలిగి ఉంది. ఈ దేశ వైశాల్యం 65,610 చదరపు కిలోమీటర్లు. పరిమాణంలో ప్రపంచ దేశాలలో 122వ స్థానం. 2014 అంచనాల ప్రకారం జీడీపీ 142.719 బిలియన్ డాలర్లు. తలసరి ఆదాయం 7046 డాలర్లు. 2013లో మానవాభివృద్ధి సూచీ విలువ 0.750. సిలోన్ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగం వాటా 85 శాతం. జీడీపీలో సేవారంగం వాటా 60 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28 శాతం. వ్యవసాయ రంగం వాటా 12 శాతం. 2013లో శ్రీలంక ఎగుమతుల్లో అమెరికా వాటా 27.10 శాతం, తర్వాత స్థానాల్లో యునెటైడ్ కింగ్డమ్, ఇటలీ,భారత్‌లు ఉన్నాయి. దిగుమతుల విషయంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మన దేశమే. 2013లో లంక మొత్తం దిగుమతుల్లో భారత్ వాటా 23.89 శాతం. తర్వాత వరుసలో సింగపూర్, ఇరాన్, చైనాలు నిలిచాయి.మోదీ లంక పర్యటన నేపథ్యంలో ఇరు దేశాలు వీసా, కస్టమ్స్, యువత సంక్షేమం, రవీంద్రనాధ్ ఠాగూర్ మెమోరియల్ ఏర్పాటు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రాం తీయ ప్రాధాన్యత, ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలపై మోదీ లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో చర్చలు జరిపారు.
శ్రీలంక పునర్నిర్మాణానికి భారత్ చేయూత
శ్రీలంక ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో మోదీ ప్రసంగం
సిలోన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. శ్రీలంకలో పెట్టుబడులకు భారత్‌ను సహజ వనరుగా అభివర్ణించారు. శాంతి, సముద్ర జలాల భద్రత నెలకొనడానికి శ్రీలంక నాయకత్వానికి భారత్ భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. హిందూ మహాసముద్రం 21వ శతాబ్దపు భవిష్యత్‌ను నిర్ణయించగలదని, మోదీ అభిలషించారు. శ్రీలంక పౌరులకు వీసా సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన ప్రకటించారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ పెంపుతో తగిన చర్యలు చేపట్టవచ్చన్నారు. అభివృద్ధి భాగస్వామ్యాన్ని రెండు దేశాలు కొనసాగిస్తాయని ఆకాంక్షించారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలు రెండు దేశాల సరిహద్దుల మధ్య స్వేచ్ఛగా ప్రవహించాలన్నారు. భారత్ భవిష్యత్ పట్ల తాను ఎలాంటి కలలు గంటున్నానో పొరుగు దేశాల విషయంలోనూ అదే ధోరణితో ఉన్నానని భాష్యం పలికారు.
పార్లమెంట్లో మోదీ ప్రసంగం
ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సముద్ర జలాల భద్రతలో భారత్, శ్రీలంకల మధ్య సహకారం మరింత పెరగాలి. లంక అభివృద్ధికి తగిన చేయూతను భారత్ అందిస్తుంది. ఉభయ దేశాల భద్రతకు హిందూ మహాసముద్రం కీలకమని, కలిసికట్టుగా పనిచేయడం ద్వారా విశ్వాసపూరిత వాతావరణాన్ని ఏర్పరచవచ్చన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించి సున్నితంగా వ్యవహరిస్తే లక్ష్యాల్ని సాధించడంలో సఫలీకృతులమవుదామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఓడించి సంఘర్షణాత్మక వాతావరణానికి చరమగీతం పాడటంలో లంక విజయవంతమైందని మోదీ కొనియాడారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన ఎన్నికలు మా ర్పు, ఐక్యత, సత్సంబంధాల పునరుద్ధరణను ప్రతిబింబించాయని మోదీ వ్యాఖ్యానించారు. ఐక్యత, సమగ్రత, శాంతి-సామరస్యం అందరికీ అవకాశాలు, గౌరవంతో కూడిన జీవితం పొందే భవిష్యత్తును సాకారం చేసుకునే సామర్థ్యం శ్రీలంకకు ఉందని వ్యాఖ్యానించారు. భారత్ వాణిజ్య వాతావరణం అనుకూలంగా మారుతోందని, ఈ పోటీ ప్రపంచంలో శ్రీలంక ఇతరుల్ని ప్రాధేయపడే పరిస్థితి రాకూడదన్నారు. ఇందుకు ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దోహదపడుతుందని ఆకాంక్షించారు.
సమగ్ర భద్రతే పక్కా భరోసా
మన దేశానికి 7,500 కిలోమీటర్ల విశాల సముద్ర తీరం ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం వాణిజ్యం హిందూ మహాసముద్ర ప్రాంతం ద్వారానే జరుగుతుంది. హిమాలయాల విషయంలో చైనా ప్రస్తుత ధోరణినే అవలంబించినట్లయితే గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ (Gulf of Hormuz), స్ట్రయిట్ ఆఫ్ మలక్కా (Strait of Malacca) మధ్య జరిగే చైనా చమురు రవాణా నివారించడానికి తగిన నావికా దళాన్ని భారత్ అభివృద్ధి పరచుకోవాలి. కొన్నేళ్ల కిందట 152 నేవీ షిప్లున్న భారత్‌లో ప్రస్తుతం ఆ సంఖ్య 142కు తగ్గింది. దేశంలోని నాలుగు రక్షణ నౌకా నిర్మాణ యార్డులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. నిర్దిష్ట ప్రణాళిక, యాజమాన్య నిర్వహణ సక్రమంగా లేదు. వాటిని మరింత మెరుగుపరిచేందుకు పక్కా చర్యలు అవసరం. వీటితో పాటు న్యూక్లియర్ శక్తి ఆధారిత జలాంతర్గాముల సంఖ్యను మరింత పెంచాలి. ఇలా సమగ్ర భద్రతకు పక్కా చర్యలు చేపట్టినప్పుడే ఇరుగు, పొరుగు దేశాల నడుమ మనకంటూ ఓ స్థానం ఉంటుంది.

- ఓషన్ ఎకానమీ (Ocean Economy) రంగంలో పరస్పర అవగాహన ఒప్పందం.
- 2015-18 మధ్య కాలంలో సాంస్కృతిక సహకారానికి (Cultural Co-operation)సంబంధించి ఒప్పందం.
- మారిషస్‌కు చెందిన అగాలెగా ద్వీపం (Agalega Island) అభివృద్ధి ద్వారా అవస్థాపనా రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య సహకారం.
- సంప్రదాయ వైద్య విధానం (Traditional System Of Medicine), హోమియోపతి విషయంలో సహకారం.
- భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతికి భారత్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోపరేషన్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మారిషస్ ఆగ్రో పరిశ్రమ, ఆహార భద్రత మంత్రిత్వ శాఖ మధ్య ప్రోటోకాల్ ఒప్పందం.
శ్రీలంక పర్యటన
వాయువ్య దిశలో భారత్, ఈశాన్యంలో మాల్దీవులతో శ్రీలంక తీర సరిహద్దు కలిగి ఉంది. ఈ దేశ వైశాల్యం 65,610 చదరపు కిలోమీటర్లు. పరిమాణంలో ప్రపంచ దేశాలలో 122వ స్థానం. 2014 అంచనాల ప్రకారం జీడీపీ 142.719 బిలియన్ డాలర్లు. తలసరి ఆదాయం 7046 డాలర్లు. 2013లో మానవాభివృద్ధి సూచీ విలువ 0.750. సిలోన్ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగం వాటా 85 శాతం. జీడీపీలో సేవారంగం వాటా 60 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28 శాతం. వ్యవసాయ రంగం వాటా 12 శాతం. 2013లో శ్రీలంక ఎగుమతుల్లో అమెరికా వాటా 27.10 శాతం, తర్వాత స్థానాల్లో యునెటైడ్ కింగ్డమ్, ఇటలీ,భారత్‌లు ఉన్నాయి. దిగుమతుల విషయంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మన దేశమే. 2013లో లంక మొత్తం దిగుమతుల్లో భారత్ వాటా 23.89 శాతం. తర్వాత వరుసలో సింగపూర్, ఇరాన్, చైనాలు నిలిచాయి.మోదీ లంక పర్యటన నేపథ్యంలో ఇరు దేశాలు వీసా, కస్టమ్స్, యువత సంక్షేమం, రవీంద్రనాధ్ ఠాగూర్ మెమోరియల్ ఏర్పాటు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రాం తీయ ప్రాధాన్యత, ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలపై మోదీ లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో చర్చలు జరిపారు.
శ్రీలంక పునర్నిర్మాణానికి భారత్ చేయూత
- శ్రీలంక అంతర్యుద్ధం అనంతరం ఆ దేశ పునర్నిర్మాణంలో భాగంగా తమిళుల కోసం 50 వేల ఇళ్ల నిర్మాణాన్ని భారత్ చేపట్టింది. ఇందులో 27 వేల ఇళ్లను పూర్తి చేసింది.
- శ్రీలంకలో రైల్వే రంగ అభివృద్ధికి 318 మిలియన్ డాలర్ల రుణాన్ని మోదీ ప్రకటించారు. ప్రస్తుతమున్న రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణ, రోలింగ్ స్టాక్ సేకరణకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారు.
- మటారాలోని రుహానా యూనివర్సిటీ రవీంద్రనాద్ ఠాగూర్ ఆడిటోరియం నిర్మాణంతోపాటు -తలైమన్నార్ - మదావచ్చియాళ్ రైలు మార్గం నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని భారత్ అందిస్తోంది.
- ట్రింకోమలి పట్టణాన్ని పెట్రోలియం హబ్‌గా అభివృద్ధి చేయడానికి భారత్ సమ్మతించింది.
- ట్రింకోమలిలో 500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంకల్పించింది.
- శ్రీలంక సైనికులకు శిక్షణ, పెట్టుబడుల విషయంలోనూ భారత్ నుంచి ఆశించిన సాయం ఆ దేశం పొందే వీలుంది.
- ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు నిర్ణయించడం ద్వారా శ్రీలంక విదేశీ వాణిజ్య వృద్ధిలో ప్రగతి కనిపించనుంది. అలాగే తమిళ టైగర్ల ఆందోళన కారణంగా నిలిచిపోయిన సముద్ర మార్గాల పునరుద్ధరణ ద్వారా శ్రీలంక లబ్ధిపొందగలదు.
శ్రీలంక ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో మోదీ ప్రసంగం
సిలోన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. శ్రీలంకలో పెట్టుబడులకు భారత్‌ను సహజ వనరుగా అభివర్ణించారు. శాంతి, సముద్ర జలాల భద్రత నెలకొనడానికి శ్రీలంక నాయకత్వానికి భారత్ భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. హిందూ మహాసముద్రం 21వ శతాబ్దపు భవిష్యత్‌ను నిర్ణయించగలదని, మోదీ అభిలషించారు. శ్రీలంక పౌరులకు వీసా సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన ప్రకటించారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ పెంపుతో తగిన చర్యలు చేపట్టవచ్చన్నారు. అభివృద్ధి భాగస్వామ్యాన్ని రెండు దేశాలు కొనసాగిస్తాయని ఆకాంక్షించారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలు రెండు దేశాల సరిహద్దుల మధ్య స్వేచ్ఛగా ప్రవహించాలన్నారు. భారత్ భవిష్యత్ పట్ల తాను ఎలాంటి కలలు గంటున్నానో పొరుగు దేశాల విషయంలోనూ అదే ధోరణితో ఉన్నానని భాష్యం పలికారు.
పార్లమెంట్లో మోదీ ప్రసంగం
ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సముద్ర జలాల భద్రతలో భారత్, శ్రీలంకల మధ్య సహకారం మరింత పెరగాలి. లంక అభివృద్ధికి తగిన చేయూతను భారత్ అందిస్తుంది. ఉభయ దేశాల భద్రతకు హిందూ మహాసముద్రం కీలకమని, కలిసికట్టుగా పనిచేయడం ద్వారా విశ్వాసపూరిత వాతావరణాన్ని ఏర్పరచవచ్చన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించి సున్నితంగా వ్యవహరిస్తే లక్ష్యాల్ని సాధించడంలో సఫలీకృతులమవుదామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఓడించి సంఘర్షణాత్మక వాతావరణానికి చరమగీతం పాడటంలో లంక విజయవంతమైందని మోదీ కొనియాడారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన ఎన్నికలు మా ర్పు, ఐక్యత, సత్సంబంధాల పునరుద్ధరణను ప్రతిబింబించాయని మోదీ వ్యాఖ్యానించారు. ఐక్యత, సమగ్రత, శాంతి-సామరస్యం అందరికీ అవకాశాలు, గౌరవంతో కూడిన జీవితం పొందే భవిష్యత్తును సాకారం చేసుకునే సామర్థ్యం శ్రీలంకకు ఉందని వ్యాఖ్యానించారు. భారత్ వాణిజ్య వాతావరణం అనుకూలంగా మారుతోందని, ఈ పోటీ ప్రపంచంలో శ్రీలంక ఇతరుల్ని ప్రాధేయపడే పరిస్థితి రాకూడదన్నారు. ఇందుకు ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దోహదపడుతుందని ఆకాంక్షించారు.
సమగ్ర భద్రతే పక్కా భరోసా
మన దేశానికి 7,500 కిలోమీటర్ల విశాల సముద్ర తీరం ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం వాణిజ్యం హిందూ మహాసముద్ర ప్రాంతం ద్వారానే జరుగుతుంది. హిమాలయాల విషయంలో చైనా ప్రస్తుత ధోరణినే అవలంబించినట్లయితే గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ (Gulf of Hormuz), స్ట్రయిట్ ఆఫ్ మలక్కా (Strait of Malacca) మధ్య జరిగే చైనా చమురు రవాణా నివారించడానికి తగిన నావికా దళాన్ని భారత్ అభివృద్ధి పరచుకోవాలి. కొన్నేళ్ల కిందట 152 నేవీ షిప్లున్న భారత్‌లో ప్రస్తుతం ఆ సంఖ్య 142కు తగ్గింది. దేశంలోని నాలుగు రక్షణ నౌకా నిర్మాణ యార్డులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. నిర్దిష్ట ప్రణాళిక, యాజమాన్య నిర్వహణ సక్రమంగా లేదు. వాటిని మరింత మెరుగుపరిచేందుకు పక్కా చర్యలు అవసరం. వీటితో పాటు న్యూక్లియర్ శక్తి ఆధారిత జలాంతర్గాముల సంఖ్యను మరింత పెంచాలి. ఇలా సమగ్ర భద్రతకు పక్కా చర్యలు చేపట్టినప్పుడే ఇరుగు, పొరుగు దేశాల నడుమ మనకంటూ ఓ స్థానం ఉంటుంది.
Published date : 26 Mar 2015 06:00PM