Skip to main content

Teaching

డీఎస్సీ-ఎస్‌జీటీ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు ఎలా సిద్ధం కావాలి?
+
మెథడాలజీకి సంబంధించిన అంశాలు చదువుతున్నప్పుడు అర్థమైనట్లే ఉంటాయి. తీరా పరీక్షలో సమాధానాలు గుర్తించేటప్పుడు గందరగోళం తలెత్తుతుంది. ఇచ్చిన అన్ని ఆప్షన్లు కచ్చితమైనవేనన్న భావన కలుగుతుంది. అందువల్ల చదువుతున్నప్పుడు విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
  • సాంఘిక శాస్త్రం-స్వభావం-పరిధి, చరిత్ర, అభివృద్ధిలో సాంఘికశాస్త్రం ఎప్పుడు ఆవిర్భవించింది? మనదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? వివిధ కమిటీలు, నిర్వచనాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. లేదంటే సాంఘికశాస్త్రం-సామాజికశాస్త్రాలతో గల సంబంధాలు, పోలికలపై తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిపైనా దృష్టిసారించాలి.
  • సాంఘిక శాస్త్ర ఆశయాలు-లక్ష్యాలు-విలువల విభాగంలో ఆశయాలు/ఉద్దేశాలు, లక్ష్యాలు-స్పష్టీకరణల నుంచి ప్రశ్నలు వస్తాయి. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు, అభిరుచి, ప్రశంస, వైఖరి లక్ష్యాల్లోని స్పష్టీకరణలపై తప్పనిసరిగా పట్టు సాధించాలి.
  • విద్యార్థులకు జ్ఞానాత్మక, గుణాత్మక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ఉపయోగించే పరికరాలను బోధనోపకరణాలు అంటారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉపయోగించే గ్రాఫిక్స్ ఉపకరణాలు, ప్రదర్శనా బల్లలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య-శ్రవణ ఉపకరణాలు, ప్రక్షేపిత ఉపకరణాలు, త్రిమితీయ ఉపకరణాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఏ అంశాల బోధనకు ఏ ఉపకరణాలు బాగా ఉపయోగపడతాయనే దాన్ని తెలుసుకోవాలి.
  • విద్యార్థి అభ్యసనం ద్వారా సాధించిన ప్రగతిని శాస్త్రీయంగా తెలియజేసేందుకు, ఉపాధ్యాయుడు బోధనా విజయాన్ని తెలుసుకునేందుకు మూల్యాంకనం ఉపయోగపడుతుంది. అభ్యర్థులు మూల్యాంకనంలోని అంశాలు, సోపానాలు, రకాలను తెలుసుకోవాలి. సాంఘికశాస్త్ర పాఠ్యప్రణాళిక, పాఠ్యపుస్తకం, సోషల్ లేబొరేటరీలు, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు తదితర అంశాలపై దృష్టిసారించాలి.

ఏపీ టెట్ పేపర్-1కు ఎలా సిద్ధమవాలి?
+
  • టీఆర్‌టీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగ సాధనలో టెట్ స్కోర్ కీలకపాత్ర పోషిస్తుంది. శిశు వికాసం-పెడగాజీలో శిశు వికాసం, అభ్యసనం, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వ వికాసం తదితర అంశాలు ముఖ్యమైనవి. టీచింగ్ ఆప్టిట్యూడ్, విద్యా దృక్పథాలపైనా దృష్టిసారించాలి.
  • తెలుగులో ప్రాచీన, ఆధునిక, జానపద తెలుగు సాహిత్యం; పదజాలం, భాషాంశాలు ముఖ్యమైనవి. ఇంగ్లిష్‌లో టెన్సెస్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్; వొకాబ్యులరీ, కాంప్రెహెన్షన్ తదితర అంశాలను అధ్యయనం చేయాలి. గ్రామర్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
  • మ్యాథమెటిక్స్‌కు సంబంధించి సంఖ్యా వ్యవస్థ, జ్యామితి, బీజగణితం తదితర అంశాలు ముఖ్యమైనవి. ప్రాక్టీస్ ద్వారా మ్యాథ్స్‌లోని అంశాలపై పట్టు సాధించొచ్చు.
  • ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌లో భాగంగా వృక్షాలు, జంతువులు; ఆవాసం, శక్తి వనరులు; గాలి, నీరు; మానవ శరీరం తదితర అంశాలను అప్లికేషన్ దృక్పథంతో అధ్యయనం చేయాలి.
  • డీఈడీ పాఠ్యపుస్తకాల్లోని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయడం ద్వారా అనువర్తిత ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించొచ్చు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉమ్మడి మెథడాలజీ పాఠ్యాంశాలను గుర్తించి, వాటిపై పట్టు సాధించాలి.

అయస్కాంతత్వం, విద్యుత్ టాపిక్‌లను ఏవిధంగా అధ్యయనం చేయాలి?
+
భౌతిక శాస్త్రంలో అయస్కాంతత్వం, విద్యుత్ అనేవి ముఖ్యమైన అంశాలు. విద్యుత్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ పరికరాలు - వాటి సంకేతాలు - ప్రమాణాలు లాంటి అంశాలపై దృష్టి సారించాలి. విద్యుత్ దాని ఫలితాలను కూడా క్షుణ్నంగా చదవాలి. అయస్కాంతాలు - రకాలు, అయస్కాంతీకరణ జరిగే విధానం తదితర అంశాలపై పట్టు సాధించాలి.

రసాయన శాస్త్రంలో ‘నీరు, దాని సంఘటిత మూలకాలు’ చాప్టర్‌ను ఎలా అధ్యయనం చేయాలి?
+
గత డీఎస్సీ ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే ఈ అధ్యాయం నుంచి కనీసం 1-2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. రసాయన శాస్త్రంలోని పెద్ద యూనిట్లలో ఇది ఒకటి. దీని నుంచి నీటి కాఠిన్యత, ఆక్సిజన్ తయారీ ధర్మాలు, నూనెల హైడ్రోజనీకరణం వంటి అంశాలు, నత్రజని.. అమ్మోనియా.. HNO3.. అమ్మోనియం లవణాలు.. తయారీ ధర్మాలు, నత్రజని స్థాపన, నైట్రేట్‌ల నిర్ధారణ పరీక్షలపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ యూనిట్‌లో ఫార్ములాలను బాగా అధ్యయనం చేస్తే అధిక మార్కులు పొందొచ్చు.

ఆమ్లాలు- క్షారాలు- లవణాలు పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
+
గత నాలుగు సంవత్సరాల (2003, 2006, 2008, 2012) ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఆమ్లాలు- క్షారాలు - లవణాల పాఠ్యాంశం నుంచి సగటున 1- 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ అధ్యాయంలో ఆమ్ల ధర్మాలు, క్షార ధర్మాలు, ఆమ్ల-క్షార సిద్ధాంతాలు, ఆమ్ల - క్షార సూచికలు, నీటి అయానిక లబ్దం, ్కఏ విలువలు - సమస్యలు, తటస్థీకరణం, తటస్థీకరణోష్ణం మొదలైన అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఈ అధ్యాయాన్ని కూడా ఇంటర్మీడియట్ వరకు అనుసంధానం చేసుకుంటూ చదవాలి.

ప్రస్తుతం ప్రకటించిన స్కూల్ అసిస్టెంట్ (గణితం) సిలబస్‌లో ‘గణితం మెథడాలజీ’కు ఎన్ని మార్కులు కేటాయించారు? ఎలా ప్రిపేర్ కావాలి?
+
ప్రస్తుతం ప్రకటించిన స్కూల్ అసిస్టెంట్ (గణితం) సిలబస్‌లో గణితం సబ్జెక్టుకు మొత్తం 70 మార్కులు కేటాయించారు. గణితం కంటెంట్, గణితం మెథడాలజీ నుంచి 70 ప్రశ్నలు ఇస్తారు. ప్రత్యేకంగా ‘మెథడాలజీ’కి మార్కులు కేటాయించలేదు. అయినప్పటికీ సుమారు 18 నుంచి 24 ప్రశ్నలు ‘గణితం మెథడాలజీ’ నుంచి అడిగే అవకాశం ఉంది. తెలుగు అకాడమీ పుస్తకాలను చదివితే ఈ సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడం ద్వారా మెథడాలజీ ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు.

పరమాణు నిర్మాణం అనే అధ్యాయాన్ని ఎలా అధ్యయనం చేయాలో తెలపండి?
+
రసాయన శాస్త్రంలో అతి ముఖ్యమైన అధ్యాయాల్లో పరమాణు నిర్మాణం ఒకటి. డీఎస్సీ -2012 ప్రశ్నపత్రాన్ని పరిశీలించినట్లయితే ఈ చాప్టర్ ప్రాముఖ్యత తెలుస్తుంది. డీఎస్సీ-2012లో ఈ పాఠంపై ఆరు ప్రశ్నలు అడిగారు. పరమాణు నిర్మాణం భౌతిక శాస్త్రంతో కూడా అనుబంధం కలిగి ఉంటుంది. భౌతిక శాస్త్రంలో ఈ అధ్యాయం ఆధునిక భౌతిక శాస్త్రం అనే పేరుతో ఉంటుంది. ఈ చాప్టర్‌లో శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, పరమాణు నమూనాలు - శాస్త్రవేత్తలు, భౌతిక స్థిరాంక విలువలు, సమీకరణాలు, ఆర్బిటాళ్లు - ఆకృతులు, క్వాంటం సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసాలు - నియమాలు, పరమాణు ధర్మాలు - ప్రమాణాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. వీటన్నింటిని వరుస క్రమంలో ఒక పట్టికలా రూపొందించుకుని చదువుకోవాలి. గత ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల శైలిని పరిశీలించాలి.

రసాయన శాస్త్రంలో సంకేతాలు - సాంకేతికాలు - సమీకరణాలు పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
+
రసాయన శాస్త్రానికి మూలం - సంకేతాలు, సాంకేతికాలు, సమీకరణాలు అనే అధ్యాయం. దీని నుంచి ప్రతి డీఎస్సీలో ఒకటి నుంచి రెండు బిట్లు వస్తున్నాయి. రసాయన శాస్త్రంలో ప్రతి పాఠ్యాంశం చదివేటప్పుడు ఈ అధ్యాయం గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. ఈ పాఠ్యాంశంలో సంకేతాలు, లాటిన్ పేర్లు, అణువులు - సాంకేతికాలు, అయాన్‌లు - సాంకేతికాలు, రసాయన సమీకరణం - దాని తుల్య సమీకరణం, సమీకరణాల ఆధారంగా - క్రియాజనక - క్రియాజన్యాల భారాల గణన, రసాయన సమీకరణంలో ఉపయోగించే గుర్తులు, శాస్త్రవేత్తలు మొదలైన అంశాలపై దృష్టి సారించాలి.

గణితం కంటెంట్‌కు పాత పాఠ్యపుస్తకాలు చదవాలా? కొత్త టెక్ట్స్‌బుక్ ప్రిపేర్ కావాలా?
+
గణితానికి సంబంధించి ప్రకటించిన సిలబస్‌లోని అంశాలను పరిశీలించినట్లయితే అన్ని పాఠ్యాంశాలు పాత పాఠ్యపుస్తకాలకు చెందినవి. డీఎస్సీ నోటిఫికేషన్‌లో పాత టెక్ట్స్‌బుక్స్, కొత్త టెక్ట్స్‌బుక్స్ అని ప్రత్యేకంగా పేర్కొనలేదు. కాబట్టి సిలబస్‌లో ఇచ్చిన పాఠ్యాంశాలు ఏ పాఠ్యపుస్తకాల్లో లభ్యమైనా వాటిని ప్రిపేర్ కావడం మంచిది. సిలబస్‌లో ప్రకటించిన పాఠ్యాంశాలు కొత్త టెక్ట్స్‌బుక్స్‌లో కూడా వివరంగా ఉన్నాయి. వీలైతే రెండూ ప్రిపేర్ కావడం మంచిది.

డీఎస్సీ పరీక్ష కోసం మానవుడి జీర్ణ వ్యవస్థ పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
+
బయాలజీ కంటెంట్‌లో అవయవ వ్యవస్థలు అనే అంశం చాలా ముఖ్యమైంది. అందులో జీర్ణవ్యవస్థపై గత డీఎస్సీల్లో 2 లేదా 3 ప్రశ్నలు తరచూ ఇస్తుండటం గమనించవచ్చు. జీర్ణక్రియలోని ఎంజైమ్‌లు.. అవి వేటిపై పనిచేస్తాయి? ఆ పదార్థాలను ఏ పదార్థాలుగా మారుస్తాయి? అనే అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. జీర్ణ వ్యవస్థలోని అవయం పేరు - జీర్ణగ్రంథి - స్రవించే స్రావం - అందులోని ఎంజైమ్ - అదస్థ పదార్థం - అంత్య ఉత్పన్నాలు ఈ విధంగా పట్టిక వేసుకొని చదవడం వల్ల ఎంజైమ్‌లకు సంబంధించిన అన్నిటినీ గుర్తుంచుకోవచ్చు. పదో తరగతి వరకు ఉన్న మానవుడి జీర్ణ వ్యవస్థను క్షుణ్నంగా చదివి ఇంటర్‌లోని కుందేలు జీర్ణ వ్యవస్థను పోల్చుకుంటూ ఇంటర్ స్థాయి వరకూ జీర్ణక్రియా విధానాన్ని అధ్యయనం చేయాలి.

స్కూల్ అసిస్టెంట్ (గణితం) సిలబస్‌లోని త్రికోణమితి పాఠ్యాంశాన్ని ఏవిధంగా ప్రిపేర్ కావాలి?
+
స్కూల్ అసిస్టెంట్ (గణితం) సిలబస్‌లో త్రికోణమితి పాఠ్యాంశం ప్రధానమైంది. దీన్ని ఇంటర్ స్థాయి వరకూ ఇచ్చారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే త్రికోణమితి నిష్పత్తులు, సర్వసమీకరణాలు (పదో తరగతి స్థాయి) నుంచిప్రశ్నలు ఎక్కువగా ఇచ్చినట్లు గమనించవచ్చు. ఇంటర్ స్థాయిలోని ఆవర్తనం, త్రికోణమితీయ ప్రమేయాలు, ఎత్తులు - దూరాలు నుంచి ఒక్కో ప్రశ్న అడిగారు. కాబట్టి విద్యార్థులు పదో తరగతి స్థాయి వరకు ఉన్న మౌలికాంశాలు, సమస్యలను పక్కాగా ప్రిపేరైన తర్వాత మిగతా అంశాలపై దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

డీఎస్సీలో మన విశ్వం పాఠ్యాంశం ప్రాధాన్యం ఏమిటి? ఈ పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
+
1995 నుంచి 2012 వరకు జరిగిన డీఎస్సీ ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే 2000 నుంచి 2012 వరకు క్రమం తప్పకుండా సరాసరిన రెండు బిట్లు డీఎస్సీ పరీక్షలో వస్తున్నాయి. ఈ అధ్యాయం 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ‘మనవిశ్వం’ ‘భూమి - చలనాలు’ ‘అంతరిక్షం’ అనే పేర్లతో ఉంది. ఈ పాఠ్యాంశానికి సంబంధించి గ్రహాలు - ఉపగ్రహాలు - కృత్రిమ ఉపగ్రహాలు - ఉల్కలు - తోకచుక్కలు - వ్యోమగాములు - అంతరిక్ష కేంద్రాలు - భూమి చలనాలు - ఖగోళ ప్రమాణాలు - రాశులు - రాశి చక్రాలు అనే భావనలపై ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ అధ్యాయాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నట్లయితే జి.కె. కరెంట్ అఫైర్‌‌సకు కూడా ఉపయోగపడుతుంది. అంతరిక్ష రంగంలో భారతదేశ ప్రస్థానంపై ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది. కాబట్టి భారత్ ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహాలు - విశిష్టత - తేదీలను చదవాలి.

డీఎస్సీ-ఎస్‌ఏ పరీక్ష కోసం వ్యాపార గణితం అనే చాప్టర్‌కు ఎలా సిద్ధమవ్వాలో తెలపండి?
+
వ్యాపారగణితం, బీజగణితాలను ఒకే చాప్టర్‌గా సిలబస్‌లో పేర్కొన్నప్పటికీ అవి రెండూ విడివిడిగా అధ్యయనం చేయా ల్సిన విస్తృతమైన విభాగాలు. ముందుగా పాత ఎనిమిదో తరగతి గణిత పాఠ్యపుస్త కంలోని వ్యాపార గణితం అనే పాఠాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. నమూనా ప్రశ్నలను ఉప అంశాలవారీగా ప్రాక్టీస్ చేయాలి. వ్యాపార గణితం అనే శీర్షికలో పేర్కొన్న ఉప అంశాలు నిష్పత్తి- అనుపా తం, ఏక వస్తుమార్గం, డిస్కౌంటు, అంకగ ణిత సగటు, బారువడ్డీ, చక్రవడ్డీ, భాగ స్వామ్యం, కాలం- దూరం, కాలం-పని, గడియారం వంటివి ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నాయి. వీటన్నింటినీ అధ్యయనం చేయాలి. ప్రత్యేకంగా క్యాలెండర్ సమస్యలను వీటితోపాటు ప్రాక్టీస్ చేయాలి. ప్రాథమికంగా వ్యాపార గణితం అనే చాప్టర్ అంక గణితానికి మరొక పేరు. ఎందుకంటే వ్యాపార రంగంలో అంకగణిత పరిక్రియలైన నిష్పత్తి, డిస్కౌంటు, వడ్డీ మొదలైన అనేక అంశాలు మిళితమై ఉంటాయి. వ్యాపార గణితంలోని విజ్ఞానం నిజ జీవితంతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటుంది. మనం ప్రతిరోజూ గణన చేసే అనేక లావాదేవీలకు కావలసిన పరిజ్ఞానానికి సంబంధించిన చాప్టర్ వ్యాపార గణితం. కాబట్టి నేడు బ్యాంకింగ్ లాంటి అనేక పోటీ పరీక్షల్లో ఇచ్చే సమస్యలన్నీ వ్యాపారగణితం చాప్టర్‌లో పేర్కొన్న ఉప అంశాలకు సంబంధించినవే. వ్యాపార గణితం సమస్యలను సులువుగా సాధించ డానికి సంక్షిప్త పద్ధతులను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల సమయం ఆదా అవుతుంది. అదేవిధంగా కాలం-పని, కాలం-వేగం, మొదలైన అంశాలపై ఇచ్చే సమస్యలను shortcut formulas (సంక్షిప్త సూత్రాలు) ద్వారా సాధించాలి. దీని కోసం ప్రత్యేకంగా సాధన చేయాలి.

విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలు పాఠ్యాంశం నుంచి డీఎస్సీలో ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఏ విధంగా ప్రిపేర్ కావాలి?
+
గణితం మెథడ్స్ లో ‘విద్యాలక్ష్యాలు- స్పష్టీకరణాలు’ ముఖ్యమైన పాఠ్యాంశం. దీని నుంచి ఎస్జీటీలో 3 లేదా 4 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవి ఎక్కువగా అప్లికేషన్ పద్ధతిలో ఉంటున్నాయి. విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమవ్వాలి. ప్రశ్నల సరళిని తెలుసుకోవడానికి గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన ‘గణిత బోధన పద్ధతులు’ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది.

డీఎస్సీ పరీక్ష కోసం సాంఘిక శాస్త్రంలోని ‘వ్యవసాయం’ పాఠ్యభాగంలో ఏయే అంశాలు చదవాలి.
+
భారతదేశం వ్యవసాయాధార దేశం. అందువల్ల పంటలు- వాటి కాలాల మీద తరచుగా ప్రశ్నలు అడుగుతారు. వీటిని మ్యాప్ సహాయంతో చదివితే బాగా గుర్తుంటుంది.

ఏయే నేలల్లో ఎలాంటి పంటలు పండు తాయో వాటికి అవసరమైన వర్షపాతంతో సహా అధ్యయనం చేయాలి.వాణిజ్య పంటలు, ఆహార పంటలు, తోట పంటలకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి.

వ్యవసాయ పంటలు, అవి విస్తరించిన నేలలు, భూవిస్తీర్ణం, వాటి ఉత్పాదనను విశ్లేషణాత్మకంగా చదవాలి. నేలలు, భూ విస్తీర్ణాన్ని, వాటి ఉత్పాదనను క్షుణ్నంగా చదివినట్లయితే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సులువుగా సమా దానాన్ని గుర్తించవచ్చు.

వ్యవసాయ విధానానికి అనుబంధంగా ఉండే శ్వేత విప్లవం, నీలి విప్లవం, మత్స్య సంపదకు సంబంధించిన అం శాలను అధ్యయనం చేయాలి.

బయాలజీ మెథడ్స్ విభాగంలో ‘లక్ష్యాలు- స్పష్టీకరణాలు’ పాఠ్యాంశం ప్రాధాన్యం ఏమిటి?
+
బయాలజీ మెథడ్స్ లో ‘లక్ష్యాలు- స్పష్టీకరణాలు’ పాఠ్యాంశానికి ప్రాధాన్యత ఎక్కువ. ఈ చాప్టర్ నుంచి అప్లికేషన్ ఓరియెంటెడ్ విధానంలో ప్రశ్నలు అడుగుతున్నారు. భావనలు అవగాహన చేసుకొని, వాటిని అన్వయించుకొని చదవాలి. జ్ఞానాత్మక రంగం నుంచి అవగాహనపై ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు. భావావేశ రంగానికి చెందిన అభిరుచి. అభినందన, శాస్త్రీయ దృక్పథం అనే లక్ష్యాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. మానసిక చలనాత్మక రంగానికి చెందిన నైపుణ్యాలలో పరిశీలన, సేకరణ, చిత్రలేఖనం, హస్తలాఘవం వంటి అంశాలను అన్వ య పద్ధతిలో చదవాలి.

డీఎస్సీ పరీక్షలో కాంతి పాఠ్య భాగం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి?
+
డీఎస్సీ పరీక్షలో ఈ పాఠ్యాంశం నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. నిజ జీవితంలో వినియోగం, విషయావగాహన, నైపుణ్యాల సాధన పైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. కటకాలు, దర్పణాల్లో తుది, ప్రతిబింబ స్థానాలు, వాటి స్వభావాన్ని గుర్తుంచుకోవాలి. ‘సంపూర్ణాంతర పరావర్తనం’ అనువర్తనాలను బాగా చదవాలి. ప్రాథమిక రంగులు, గౌణ రంగులపై అవగాహన పెంచుకోవాలి.

డీఎస్సీ కోసం కార్బోహైడ్రేట్స్-ప్రోటీన్స్‌ పాఠ్యభాగంలో ఏయే అంశాలు ముఖ్యమైనవి?
+
జీవశాస్త్రంతో సంబంధం ఉన్న రసాయన శాస్త్రం అధ్యాయాల్లో ముఖ్యమైంది కార్బోహైడ్రేట్స్-ప్రోటీన్‌‌స. దీని నుంచి ‘2’ బిట్లు వచ్చే అవకాశం ఉంది. కార్బోహైడ్రేట్స్ వర్గీకరణ, వాటి ప్రాముఖ్యత, గుర్తించే పరీక్షలు, ఫార్ములాలు ఇందులోని ముఖ్యమైన అంశాలు. చక్కెర తయారీ విధానంలోని దశలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఆల్కహాల్ - రకాలు - ఉపయోగాలు - దుష్ఫలితాలపై దృష్టి సారించాలి. అమైనో ఆమ్లాలు - ప్రోటీన్‌‌స అనే అంశాన్ని జీవ శాస్త్రంతో అనుసంధానిస్తూ చదవాలి. ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఎంజైమ్‌లు, కెలోరిఫిక్ విలువలు, అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్స్ ఫార్ములాలను నిశితంగా పరిశీలించాలి.

డీఎస్సీ పరీక్ష కోసం ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ పాఠ్యభాగంలో ఏయే అంశాలను చదవాలి?
+
2003 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఈ పాఠ్యభాగం నుంచి సగటున 3 ప్రశ్నలు అడిగినట్లు గమనించవచ్చు. దీంట్లో శాస్త్రవేత్తలు, సిద్ధాంతాలు, రచించిన గ్రంథాలు, కనుగొన్న పరికరాలు, బిరుదులు తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సాధారణంగా ఈ చాప్టర్ నుంచి డెరైక్టు ప్రశ్నలు అడుగుతున్నారు. పాశ్చాత్య విద్యా విధానం సంస్కరణ, నవీన విద్యావిధానం రూపకల్పన, పాశ్చాత్య భారతీయ శాస్త్రవేత్తలు, వారు రచించిన గ్రంథాలు మొదలైన అంశాలపై దృష్టి సారించాలి. గ్రీకులు, ఈజిప్షియన్లు, బాబిలేనియన్లు చేసిన కృషి గురించి అవగాహన పెంచుకోవాలి.

స్కూల్ అసిస్టెంట్ (గణితం) మెథడాలజీలో ‘గణితశాస్త్ర చరిత్ర’ పాఠ్యాంశాన్ని ఏ విధంగా చదవాలి?
+
 సిలబస్ను అనుసరించి ప్రాచీన నాగరికతకు చెందిన అరబ్బులు, గ్రీక్లు, ఈజిప్షియన్లు, భారతీయులు గణితంలో చేసిన కృషికి సంబంధించిన వివిధ అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటికోసం తెలుగు అకాడమీ ప్రచురించిన ‘డీఎడ్ గణిత బోధన పద్ధతులు’ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది.  ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్తోపాటు భారతీయేతర శాస్త్రవేత్తలైన పైథాగరస్, యూక్లిడ్, జార్జి కాంటర్ గురించి ప్రత్యేకంగా సిలబస్లో పేర్కొన్నారు. వీరు గణితానికి చేసిన సేవలు, రాసిన గ్రంథాలు, స్థాపించిన పాఠశాలల గురించి వివరంగా నేర్చుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు.

పోటీపరీక్షల్లో ‘విద్యుత్’ నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు?
+
 భౌతిక శాస్త్రంలో ‘విద్యుత్’ పాఠ్యాంశం చాలా విస్తృతమైంది. దీన్ని ప్రణాళికా బద్ధంగా చదవాలి. ముఖ్యంగా విద్యుత్ పొటెన్షియల్, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాలపై సమస్యలను సాధన చేయాలి. కానిస్టేబుల్ పరీక్షల కోసం 6 నుంచి పదోతరగతి వరకు భౌతికశాస్త్ర పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఓమ్ నియమం, నిరోధ నియమాలు, విద్యుదయస్కాంత ఫలితాలు, వాటి అనువర్తనాలు, విద్యుదయస్కాంత ప్రేరణ అనువర్తనాలు ప్రధానమైనవి. ఓమ్ నియమం, లెంజ్ నియమం, ఫ్లెమింగ్ కుడిచేతి నిబంధన, ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన, ఫారడే విద్యుద్విశ్లేషణ తదితర నియమాలను నేర్చుకోవాలి. విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్ వంటి వాటి నిర్మాణం, అవి పనిచేసే విధానంలోని సూత్రాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సూత్రాలను గుర్తుంచుకోవాలి. రాశుల ప్రమాణాలను నేర్చుకోవాలి. ఉదా: కరెంటు- ఆంపియర్;  పొటెన్షియల్ భేదం- వోల్ట్; నిరోధం- ఓమ్; విశిష్ట నిరోధం- ఓమ్.మీటర్; విద్యుత్ సామర్థ్యం- వాట్; విద్యుత్ రసాయన తుల్యాంకం-గ్రామ్ / కూలుంబ్.

డీఎస్సీ, టెట్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు మెథడాలజీ విభాగంలో మంచి మార్కులు సాధించడానికి ఏవిధంగా చదవాలి?
+
టెట్, డీఎస్సీ, మోడల్ స్కూల్స్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు బోధనా పద్ధతులు సబ్జెక్టును తప్పనిసరి చేశారు. ర్యాంకు సాధనలో ఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ప్రతి మార్కు కీలకమే కాబట్టి అభ్యర్థులు తెలుగు మెథడాలజీపై ప్రత్యేక దృష్టి సారించి చదవాలి. దీంట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఎస్‌జీటీ, గ్రేడ్-2 తెలుగు పండిట్స్ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ‘డీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’; బీఎడ్, టీపీటీ చేసి స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసే వారు ‘బీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. టెట్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలన్నింటిలో తెలుగు మెథడాలజీ సిలబస్‌కు సంబంధించి కింద పేర్కొన్న పాఠ్యాంశాలున్నాయి.
  1. భాష - వివిధ భావనలు
  2. మాతృభాష బోధన - లక్ష్యాలు, స్పష్టీకరణలు
  3. భాషా నైపుణ్యాలు
  4. ప్రణాళికా రచన - పాఠ్య గ్రంథాలు
  5. పాఠ్య బోధన ప్రక్రియలు - ఆధునిక బోధన పద్ధతులు
  6. విద్యా సాంకేతిక శాస్త్రం - సహ పాఠ్య కార్యక్రమాలు
  7. మూల్యాంకనం - పరీక్షలు
తెలుగు మెథడాలజీ అనేది తరగతి గదిలో మాతృభాషా బోధనకు సంబంధించింది. కాబట్టి పద్య, గద్య, వ్యాకరణ, ఉపవాచక బోధనలు, వాటికి సంబంధించిన పాఠ్య పథకం, సోపాన క్రమం, తరగతి గదిలో సందర్భానుసారంగా ప్రదర్శించే బోధనోపకరణాలు, మూల్యాంకనం - పరీక్షల నిర్వహణ మొదలైన అంశాలపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.

తెలుగు పండిట్ ప్రిపరేషన్ ప్రణాళిక గురించి వివరంగా చెబుతారా?
+
మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు అకాడమీ ప్రచురించిన పాఠ్యపుస్తకాల కంటెంట్‌పై సిలబస్ ఉంటుంది. కాబట్టి ముందు ఆ పుస్తకాలను సేకరించాలి. ప్రతి రోజూ అన్ని తరగతుల పుస్తకాలను చదివేలా ప్రణాళిక రచించుకోండి. ముందు సారూప్యత ఉన్న అంశాలతో పట్టిక తయారు చేసుకోండి. ఒక్కో తరగతి నుంచి ఒక పాఠాన్ని పూర్తి చేసి, వెంటనే నోట్సు రాసుకోండి. పరీక్ష నెలరోజులు ఉందనగా మోడల్ పేపర్లను సాధన చేయండి. మంచి ఫలితముంటుంది.

సెకండరీ గ్రేడ్ పోస్టులకు బీఎడ్ వారికి ఈసారి అవకాశముంటుందా?
+
ఎన్‌సీటీఈ ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కేవలం డీఎడ్ వారే అర్హులు. ఇదివరకే సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, పోస్టుల సంఖ్యలో కొంత రిజర్వేషన్ కల్పించవచ్చు. ఒకవేళ ఇది జరిగినా మళ్లీ న్యాయపరంగా చిక్కులు తలెత్తవచ్చు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికే ప్రిపేరవడం మంచిది.

ఏపీలో టెట్, డీఎస్సీ వేర్వేరుగా నిర్వహిస్తారా? ఒక వేళ సిల‌బ‌స్ మారితే..దేన్ని ఎలా చ‌ద‌వాలి ?
+
ఈ రెండు విషయాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ ఇంకా వెలువడలేదు. పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి కొంత స‌మ‌యం వేచి చూడాలి. ఈలోగా పాత సిలబస్ కంటెంట్‌ను చదవండి. ఒకవేళ కొత్త సిలబస్ ప్రకటించినా పాత సిలబస్‌కు అనుబంధంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే మెథడాలజీపై దృష్టి పెట్టండి.