ఏపీ టెట్ పేపర్-1కు ఎలా సిద్ధమవాలి?
Question
ఏపీ టెట్ పేపర్-1కు ఎలా సిద్ధమవాలి?
- టీఆర్‌టీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగ సాధనలో టెట్ స్కోర్ కీలకపాత్ర పోషిస్తుంది. శిశు వికాసం-పెడగాజీలో శిశు వికాసం, అభ్యసనం, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వ వికాసం తదితర అంశాలు ముఖ్యమైనవి. టీచింగ్ ఆప్టిట్యూడ్, విద్యా దృక్పథాలపైనా దృష్టిసారించాలి.
- తెలుగులో ప్రాచీన, ఆధునిక, జానపద తెలుగు సాహిత్యం; పదజాలం, భాషాంశాలు ముఖ్యమైనవి. ఇంగ్లిష్‌లో టెన్సెస్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్; వొకాబ్యులరీ, కాంప్రెహెన్షన్ తదితర అంశాలను అధ్యయనం చేయాలి. గ్రామర్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
- మ్యాథమెటిక్స్‌కు సంబంధించి సంఖ్యా వ్యవస్థ, జ్యామితి, బీజగణితం తదితర అంశాలు ముఖ్యమైనవి. ప్రాక్టీస్ ద్వారా మ్యాథ్స్‌లోని అంశాలపై పట్టు సాధించొచ్చు.
- ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో భాగంగా వృక్షాలు, జంతువులు; ఆవాసం, శక్తి వనరులు; గాలి, నీరు; మానవ శరీరం తదితర అంశాలను అప్లికేషన్ దృక్పథంతో అధ్యయనం చేయాలి.
- డీఈడీ పాఠ్యపుస్తకాల్లోని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయడం ద్వారా అనువర్తిత ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించొచ్చు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉమ్మడి మెథడాలజీ పాఠ్యాంశాలను గుర్తించి, వాటిపై పట్టు సాధించాలి.