రసాయన శాస్త్రంలో ‘నీరు, దాని సంఘటిత మూలకాలు’ చాప్టర్‌ను ఎలా అధ్యయనం చేయాలి?
ఎన్. హిమబిందు, నూజివీడు.
Question
రసాయన శాస్త్రంలో ‘నీరు, దాని సంఘటిత మూలకాలు’ చాప్టర్‌ను ఎలా అధ్యయనం చేయాలి?
గత డీఎస్సీ ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే ఈ అధ్యాయం నుంచి కనీసం 1-2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. రసాయన శాస్త్రంలోని పెద్ద యూనిట్లలో ఇది ఒకటి. దీని నుంచి నీటి కాఠిన్యత, ఆక్సిజన్ తయారీ ధర్మాలు, నూనెల హైడ్రోజనీకరణం వంటి అంశాలు, నత్రజని.. అమ్మోనియా.. HNO3.. అమ్మోనియం లవణాలు.. తయారీ ధర్మాలు, నత్రజని స్థాపన, నైట్రేట్‌ల నిర్ధారణ పరీక్షలపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ యూనిట్‌లో ఫార్ములాలను బాగా అధ్యయనం చేస్తే అధిక మార్కులు పొందొచ్చు.