అయస్కాంతత్వం, విద్యుత్ టాపిక్‌లను ఏవిధంగా అధ్యయనం చేయాలి?
కె.సునంద, అనకాపల్లి.
Question
అయస్కాంతత్వం, విద్యుత్ టాపిక్‌లను ఏవిధంగా అధ్యయనం చేయాలి?
భౌతిక శాస్త్రంలో అయస్కాంతత్వం, విద్యుత్ అనేవి ముఖ్యమైన అంశాలు. విద్యుత్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ పరికరాలు - వాటి సంకేతాలు - ప్రమాణాలు లాంటి అంశాలపై దృష్టి సారించాలి. విద్యుత్ దాని ఫలితాలను కూడా క్షుణ్నంగా చదవాలి. అయస్కాంతాలు - రకాలు, అయస్కాంతీకరణ జరిగే విధానం తదితర అంశాలపై పట్టు సాధించాలి.