Engineering Services
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో చేరాలన్నది నా లక్ష్యం. ఈ కోర్సులో ఉత్తీర్ణులయ్యాక ఉద్యోగంలో భాగంగా ఎలాంటి విధులు ఉంటాయి. ఈ కోర్సుతో ఉన్నత విద్యావకాశాలు, కోర్సు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
ఏరోస్పేస్ ఇంజనీర్లు ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ల డిజైన్, డెవలప్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, టెస్టింగ్, రీసెర్చ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్.. ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌ల కలయిగా ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ భూ వాతావరణంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన అంశాల గురించి పేర్కొంటే.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ భూ వాతావరణానికి వెలుపల ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన విషయాలను వివరిస్తుంది.
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఐఐటీలు జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తుంటే... ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు స్వీయ ప్రవేశ విధానాన్ని అమలుచేస్తున్నాయి.
గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సు: బీటెక్.. డ్యూయల్ డిగ్రీ (బ్యాచిలర్+మాస్టర్స్)
ఉన్నత విద్య :
ఎంటెక్ (స్పెషలైజేషన్ కోర్సులు), పీహెచ్‌డీ పోగ్రామ్స్.
ఇన్‌స్టిట్యూట్స్:

- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఖరగ్‌పూర్.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, షిబ్‌పూర్, పశ్చిమ బెంగాల్.
నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. కోర్సు తీరు, ఉన్నత విద్యావకాశాలు, కోర్సు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలియజేయండి?
+
పౌర, రక్షణ అవసరాలకు ఉపయోగించే ఎయిర్‌క్రాఫ్టుల డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ తదితరాలను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా విద్యార్థులు నేర్చుకుంటారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఫిజిక్స్, మ్యాథ్స్‌లను అడ్వాన్స్‌డ్ స్థాయిలో అధ్యయనం చేస్తారు.
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2 ఉత్తీర్ణత.
గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు: బీటెక్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్/బీఈ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్.
ఉన్నత విద్య: ఎంటెక్/ఎంఈ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్.
ఇన్‌స్టిట్యూట్‌లు:

- ఎంటెక్/ఎంఈ ఇన్ ఏవియానిక్స్.
ఇన్‌స్టిట్యూట్‌లు:
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్.
- మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్.
- హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, చెన్నై.
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, బెంగళూరు.
- మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫర్మేషన్, టెక్నాలజీ(ఐఐఏఈఐటీ), పుణె.
- సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్(సీఐఐఏఈ), డెహ్రాడూన్.
- ఇండియన్ అకాడమీ ఆఫ్ ఏరోనాటికల్ టెక్నాలజీ, లక్నో.
రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలియజేయండి?
+
ప్రస్తుతం ఒకవైపు ఇంధన అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ)పై అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ తదితర అంశాలు బోధిస్తారు. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫర్మ్స్, ఎన్‌జీవో, ఇంధనానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు ఉంటాయి.
రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
- యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎన ర్జీ అండ్ స్టడీస్-డెహ్రాడూన్
కోర్సు: ఎంటెక్ (పవర్ సిస్టమ్స్).
వెబ్‌సైట్: www.upes.ac.in
- అమిటీ యూనివర్సిటీ-నోయిడా
కోర్సు: ఎంటెక్ (సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ).
వెబ్‌సైట్: www.amity.edu
- మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-భోపాల్.
కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ).
వెబ్‌సైట్: www.manit.ac.in
నానోటెక్నాలజీలో ఎంటెక్ అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి
+
ఉత్తరాఖండ్‌లో రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. నానోటెక్నాలజీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత: బీఈ/బీటెక్
ప్రవేశం: గేట్ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.
వెబ్‌సైట్: www.iitr.ac.in
కేరళలో కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. నానోటెక్నాలజీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత: మెకానికల్/ఆటోమొబైల్/ మెటీరియల్ సైన్స్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/ మెకట్రానిక్స్/ మెటలర్జికల్/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్.
ప్రవేశం: గేట్‌లో ర్యాంకు/ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
వెబ్‌సైట్: www.nitc.ac.in
హర్యానాలో కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. నానోటెక్నాలజీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత: ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/ బయోటెక్నాలజీ/ నానోసైన్స్‌లో ఎంఎస్సీ లేదా బయోటెక్నాలజీ/ ఇంజనీరింగ్ ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్.
ప్రవేశం: గేట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.nitkkr.ac.in

పర్సనాలిటీ టెస్ట్ (ఓరల్ ఇంటర్వ్యూ) ఏవిధంగా ఉంటుంది?
+
రాత పరీక్షలో ఫలితాన్ని అనుసరించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, మానసిక, శారీరక దృఢత్వం, వ్యక్తిగత వినయ విధేయతలు, భాధ్యతల పట్ల ఆసక్తి, నీతి, నిజాయితీలను పరిశీలిస్తారు. M.E/M.Tech అభ్యర్థులను వారి స్పెషలైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశముంది. సబ్జెక్టు పరమైన ప్రశ్నలు, వర్త మాన అంశాలపై అవగాహన ఉందో లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. B.Tech/M.Tech, project కు సంబంధించిన విషయాలు కూడా ప్రిపేర్ అవడం మంచిది. ఉద్యోగం చేస్తుంటే... దానికి సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంది.
ప్రిపరేషన్ ఎలా ఉండాలి?
+
ప్రామాణిక గ్రంథాలను ఎంచుకోవాలి. ప్రముఖ అంతర్జాతీయ రచయితలు, ఐఐటీ ప్రొఫెసర్లు రాసిన పుస్తకాలు చదివి, ప్రాక్టీస్ చేయడం ఎంతైనా మంచిది. గత ప్రశ్నాపత్రాలు, సిలబస్‌కు అనుగుణంగా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీ సెస్ పరీక్షల ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా ప్రశ్నించవచ్చో తెలుస్తుంది. ఐఐటీలు నిర్వహించే గేట్ పరీక్షా పత్రాలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమేణా సబ్జెక్టుపై పట్టు పెంచుకుంటూ.. పరీక్షలో వచ్చే అవకాశమున్న ప్రశ్నలను విశ్లేషించుకునే నేర్పు అలవరచుకుంటే విజయం తథ్యం. ప్రతిరోజూ కనీసం ఒక గంట జనరల్ ఎబిలిటీ టెస్ట్‌కు కేటాయించాలి. ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో కొన్ని సులభమైన, కొన్ని క్లిష్టమైన సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి మనిషికి ఒక విలక్షణమైన జీవన సరళి ఉంటుంది. కొన్నిసమయూల్లో Higher Energy Levels... మరికొన్ని సమయూల్లో Lower Energy Levels ఉంటాయి. కఠినమైన సబ్జెక్టులను Higher Energy Levels ఉండే సమయంలో చదవాలి. దాంతోపాటు ముఖ్యమైన టాపిక్స్‌ను స్నేహితులతో చర్చిస్తే చాలా మంచిది. సందేహాలుంటే.. సీనియర్లు, అధ్యాపకుల సలహా, సహకారాలు తీసుకోవాలి.
కనీస క్వాలిఫైయింగ్ మార్కులు అవసరమా?
+
కనీస క్వాలిఫైయింగ్ మార్కులు అవసరమే. ఎందుకంటే ఏదైనా ఒకటి లేదా అన్ని ప్రశ్నాపత్రాల్లో కనీస క్వాలిఫైయింగ్ మార్కులు నిర్దేశించే విచక్షణాధికారం (discretion) కమిషన్‌కు ఉంటుంది. కాబట్టి, అభ్యర్థులు అన్ని పేపర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ మంది అభ్యర్థులు జనరల్ ఎబిలిటీ పేపర్‌ను సీరియస్‌గా తీసుకోరు. ఇది సముచితం కాదు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తెలుగు మీడియం అభ్యర్థులు ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రాలైన పేపర్-1, 2,3లలో కనీస క్వాలిఫైయింగ్ మార్కులు వస్తేనే... కన్వెన్షనల్ జవాబు పత్రాలు(4,5 ) దిద్దుతారు.
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో నెగిటివ్ మార్కింగ్ ఉందా?
+
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. కేటాయించిన మార్కుల్లో.. ప్రతి తప్పు జవాబుకు 1/3 వంతు పెనాల్టీ ఉంటుంది. ప్రతి ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రంలో 120 ప్రశ్నలకు 200 మార్కులు. అంటే.. ప్రతి ఆబ్జెక్టివ్ ప్రశ్నకున్న వెయిటేజీ 5/ 3 మార్కులు. ప్రతి తప్పు జవాబుకు మార్కుల కోత ఉంటుంది. అభ్యర్థులు కొన్నిప్రశ్నలకు ‘ఎలిమినేషన్’ విధానంలో జవాబులు రాబట్టవచ్చు. ఏదైనా ప్రశ్నకు ఎలాంటి క్లూ దొరక్క, జవాబు తట్టకుంటే.. అలాంటి వాటిని వదిలేయడమే మంచిది.
కన్వెన్షనల్ పేపర్స్ ఏవిధంగా ఉంటాయి?
+
పేపర్ -4, 5 పూర్తిగా కన్వెన్షనల్ పేపర్స్. ప్రతి పేపర్లో సాధారణంగా 7 నుంచి 8 ప్రశ్నలుంటాయి. 5 లేదా 6 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. (ఎన్ని ప్రశ్నలకు సమాధానం అనేది ఇంజనీరింగ్ సబ్జెక్టును బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థి సూచనలు జాగ్రత్తగా చదవాలి) వీటికి జవాబు రాయడానికి క్యాలిక్యులేటర్లు అనుమతిస్తారు. డెరివేషన్స్, ప్రాక్టికల్ అప్లికేషన్లకు సంబంధించిన న్యూమరికల్ ప్రశ్నలు, కొంతవరకు థియరీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేశాం అని కాదు? ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాం? అనేదే ముఖ్యం. మధ్యంతర స్టెప్స్‌తోపాటు, అంతిమ సమాధానం కూడా అత్యంత కీలకం. కన్వెన్షనల్ పేపర్లలో చేతి రాత కూడా ముఖ్యమే! ఎందుకంటే... చేతిరాత సరిగా లేకుంటే దాదాపు 5 శాతం మార్కులు తగ్గిస్తారు. సరైన పదాల పొందిక, స్పష్టమైన ఎఫెక్టివ్ భావ వ్యక్తీకరణ ద్వారా మంచి మార్కులు పొందవచ్చు. సాధారణంగా SI units మాత్రమే ప్రశ్నల్లో ఇస్తారు. అవసరమైతే స్టాండర్డ్ టేబుల్స్, గ్రాఫ్ షీట్స్, చార్ట్స్ వంటివి అందజేస్తారు.
పేపర్-2, 3 ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుంది?
+
పేపర్-2,3 ఈ రెండూ ఇంజనీరింగ్ సబ్జెక్టుకు సంబంధించినవి. ప్రతి ప్రశ్నా పత్రంలో 120 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. పరీక్షల్లో క్యాలిక్యులేటర్లు అనుమతించరు, కాబట్టి మరీ కష్టమైన న్యూమరికల్ ప్రశ్నలు ఇచ్చే అవకాశం లేదు. వీటిల్లో సంబంధిత సబ్జెక్టుల్లో ప్రాథమిక, మౌలిక అంశాలకు సంబంధించినవి - 40 శాతం; అప్లికేషన్స్‌కు సంబంధించినవి - 40 శాతం; ఫార్ములాలు, వాస్తవ విషయాలకు సంబంధించినవి - 15 శాతం; Assertion, రీజనింగ్ - 5 శాతం మ్యాచింగ్ ప్రశ్నలు లేదా సరైన లేదా సరికాని వాక్యాలు వంటి ప్రశ్నల ద్వారా... సబ్జెక్టుపై అభ్యర్థి పట్టును, విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
రాత పరీక్ష ప్యాట్రన్ ఏంటి?
+
రాత పరీక్ష కోసం కేటారుుంచిన మెుత్తం మార్కులు:1000. మొత్తం ఐదు పేపర్లుగా ఉంటుంది. అవి..
పేపర్-1 ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉండే జనరల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం రెండు పేపర్లకు 200 మార్కులు కేటాయించారు. పార్ట్-ఎ : జనరల్ స్టడీస్ (100 మార్కులు); పార్ట్-బి :
జనరల్ స్టడీస్ (100 మార్కులు).
పేపర్-2,3 ఇవి కూడా ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్(లేదా) ఎలక్ట్రికల్ (లేదా) మెకానికల్ (లేదా)సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి పేపర్‌కు 120
ప్రశ్నలు 200 మార్కులు.
పేపర్ -4,5 ఇవి కన్వెన్షనల్ పద్ధతిలో ఉంటాయి. పైన పేర్కొన్న ఏదేని ఒక ఇంజనీరింగ్ విభాగంలో ప్రతి
పేపర్‌కు 200 మార్కులు.
పేపర్-1లో ఏయే అంశాలపై ప్రశ్నలు ఉంటాయి?
పేపర్-1 (జనరల్ ఎబిలిటీ టెస్ట్ విశ్లేషణ): జనరల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు ఉంటారుు... పార్ట్-‘ఎ’ను ఇంగ్లిష్‌లో కనీస ప్రావీణ్యం ఉందో లేదో పరీక్షించేందుకు ఉద్దేశించారు. దీనికి సంబంధించి 60 ప్రశ్నలుంటాయి. వీటికి 100 మార్కులు. సాధారణంగా సమాన పదాలు, వ్యతిరేక పదాలు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, స్పాటింగ్ ఎరర్స్,్ర కాంప్రహెన్షన్ ప్యాసేజెస్.. వంటి ప్రశ్నలుంటాయి. పార్ట్-‘బి’లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి 60 ప్రశ్నలుంటాయి. వీటికి 100 మార్కులు. భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిపాలనా శాస్త్రం, కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలు వస్తారుు. సింహభాగం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్‌తో మిళితమై ఉంటాయి. కార్పొరేట్ గవర్నెన్స్, ఎలక్షన్ కమిషన్, వరల్డ్ బ్యాంక్, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, తదితర అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడగొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యాధులు, టీకాలు, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనల నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ప్రశ్నల సరళిని తెలుసుకోవాలంటే... గత పదేళ్ల ప్రశ్న పత్రాలు క్షణ్నంగా పరిశీలించాలి. ప్రతిరోజూ హిందూ వంటి ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలు చదువుతూ... ముఖ్యమైన పరిణామాలకు సంబంధించి నోట్స్ తయారు చేసుకోవాలి. పరీక్ష తేదీ నాటికి ముందు సంవత్సర కాలంలోని పరిణామాలను తేదీల వారీగా తెలుసుకోవడం మంచిది.

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంపిక ఎగ్జామ్ ఏవిధంగా ఉంటుంది? వయోపరిమితి ఉందా?
+
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కోసం ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. అవి.. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ). వయోపరిమితి నిబంధన కూడా ఉంది. ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వివరాలకోసం www.upsc.gov.in
వివరాలకోసం www.upsc.gov.in
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు కావల్సిన అర్హతలు?
+
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌కుకు హాజరుకావాలంటే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మెకానికల్) లేదా తత్సమానం. ఇంజనీరింగ్, లేదా తత్సమాన పరీక్ష ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు హాజరుకావచ్చు. ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సుల్లో వైర్‌లెస్ కమ్యూ నికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్ లేదా రేడియో ఇంజనీరింగ్ సబ్జెక్టులను కలిగి ఉన్నవారు కూడా కొన్ని పోస్టులకు అర్హులు.
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విశేషాలను వివరించండి?
+
కేంద్రప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ల నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిఏటా నిర్వహించే పరీక్షే.. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్. దీని ద్వారా రైల్వేస్, సెంట్రల్ వాటర్, సెంట్రల్ ఇంజనీరింగ్, మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్రప్రభుత్వ విభాగాల్లో .. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ వంటి గ్రూప్-ఏ ఉద్యోగాల భర్తీ చేస్తారు. ప్రతి ఏడాది జనవరిలో సంబంధిత నోటిఫికేషన్ వెలువడుతుంది.
వివరాలకోసం www.upsc.gov.in
వివరాలకోసం www.upsc.gov.in