Skip to main content

Design

జేఎన్‌టీయూ అనంతపూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. యాప్ డవలప్‌మెంట్‌లో కెరీర్ కోరుకుంటున్నాను. యాప్ డవలపర్‌గా మారేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం ఎలాగో తెలపండి?
+
ప్రస్తుతం చదివిన డొమైన్‌తో సంబంధం లేకుండా.. అన్ని రకాల కోర్సులు పూర్తిచేసిన వారికి చక్కటి ఉపాధి కల్పిస్తున్న విభాగం.. మొబైల్ యాప్ డెవలప్‌మెంట్. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్స్ వినియోగం.. మొబైల్ గేమ్స్‌కు యువత ఆదరణతోపాటు.. యాప్ ఆధారిత సేవలవైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న నేపథ్యంలో యాప్ డెవలపర్స్‌కు మంచి డిమాండ్ నెలకొంది. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్సులు, శిక్షణ ద్వారానే యాప్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలు సొంతమవుతాయి. ముఖ్యంగా యాప్ డెవలప్‌మెంట్ విభాగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటే.. సీ, సీ++, ఆబ్జెక్టివ్ సి వంటి కంప్యూటర్ లాంగ్వేజ్‌ల ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎంతో ముఖ్యం.
  • ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు యాప్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్ సైతం యాప్ డెవలప్‌మెంట్‌పై శిక్షణనిస్తున్నాయి. ఉడెమీ, ఎడ్యురేక, ఎడెక్స్ తదితర ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్స్‌లో సైతం ఆన్‌లైన్ విధానంలో మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా గూగుల్, ఒరాకిల్ సంస్థలు అందిస్తున్న సర్టిఫికేషన్ కోర్సులు కూడా పూర్తి చేయొచ్చు. వీటిని పూర్తి చేసుకుంటే మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
  • ఈ రంగంలో రాణించేందుకు.. సాంకేతిక నైపుణ్యాలతోపాటు క్రియేటివిటీ, అడాప్టబిలిటీ స్కిల్స్ కూడా ఉండాలి. అప్పుడే వినియోగదారుల అవసరాలు, మార్కెట్‌లో నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా యాప్స్‌ను డెవలప్ చేసే నైపుణ్యం లభిస్తుంది.
  • నైపుణ్యాలున్న అభ్యర్థులకు నెలకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందుతోంది. స్వయం ఉపాధి కోణంలోనూ యాప్ డెవలపర్స్‌కు అవకాశాలు విస్తృతం. సొంతంగా యాప్‌ను డెవలప్ చేసే ముందు దానికి సంబంధించి మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగడం ఎంతో అవసరం. ఫ్రీలాన్సింగ్ విధానంలో పనిచేస్తూ ఆదాయం పొందే అవకాశం ఉంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) అందిస్తున్న బ్యాచిలర్ కోర్సుల వివరాలు తెలియజేయండి?
+
  • బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (వ్యవధి నాలుగేళ్లు): ఇది ఎన్‌ఐడీ అహ్మదాబాద్ క్యాంపస్‌లో అందుబాటులో ఉంది.
  • స్పెషలైజేషన్లు-సీట్లు: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్ (15); ఎగ్జిబిషన్ డిజైన్ (10); ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ (10); గ్రాఫిక్ డిజైన్ (15); సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్ (10); ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ (10); ప్రొడక్ట్ డిజైన్ (15); టెక్స్‌టైల్ డిజైన్ (15).
  • గాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (జీడీపీడీ): ఈ కోర్సు ఎన్‌ఐడీ-కురుక్షేత్ర, ఎన్‌ఐడీ-విజయవాడ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉంది. కాల వ్యవధి నాలుగేళ్లు. కోర్సులో ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్; టెక్స్‌టైల్ అండ్ అపెరల్ డిజైన్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
  • సైన్స్/కామర్స్/ఆర్ట్స్/ఏదైనా విభాగంలో హయ్యర్ సెకండరీ (10+2) అర్హతతో కోర్సులో ప్రవేశించొచ్చు. డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ)లో చూపిన ప్రతిభ ఆధారంగా కోర్సుకు అర్హులను ఎంపిక చేస్తారు.
  • డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ): పరీక్ష రెండు దశల్లో ప్రిలిమ్స్, మెయిన్స్‌గా జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని, విశ్లేషణ సామర్థ్యాన్ని, ఊహా శక్తిని, సృజనాత్మకతను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. పరీక్ష 100 పాయింట్లకు జరుగుతుంది. మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
  • పిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. ఇందులో డ్రాయింగ్/స్కెచింగ్, మోడల్ మేకింగ్‌కు సంబంధించి ప్రశ్నలుంటాయి. ఈ దశకు 100 మార్కులు కేటాయించారు. మూడు గంటల వ్యవధిలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.nid.edu
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) అందిస్తున్న బ్యాచిలర్ కోర్సుల వివరాలు తెలియజేయండి?
+
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (వ్యవధి నాలుగేళ్లు): ఇది ఎన్‌ఐడీ అహ్మదాబాద్ క్యాంపస్‌లో అందుబాటులో ఉంది.
స్పెషలైజేషన్లు-సీట్లు: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్ (15); ఎగ్జిబిషన్ డిజైన్ (10); ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ (10); గ్రాఫిక్ డిజైన్ (15); సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్ (10); ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ (10); ప్రొడక్ట్ డిజైన్ (15); టెక్స్‌టైల్ డిజైన్ (15).
గాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (జీడీపీడీ): ఈ కోర్సు ఎన్‌ఐడీ-కురుక్షేత్ర, ఎన్‌ఐడీ-విజయవాడ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉంది. కాల వ్యవధి నాలుగేళ్లు. కోర్సులో ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్; టెక్స్‌టైల్ అండ్ అపెరల్ డిజైన్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
సైన్స్/కామర్స్/ఆర్ట్స్/ఏదైనా విభాగంలో హయ్యర్ సెకండరీ (10+2) అర్హతతో కోర్సులో ప్రవేశించొచ్చు. డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ)లో చూపిన ప్రతిభ ఆధారంగా కోర్సుకు అర్హులను ఎంపిక చేస్తారు.
డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ): పరీక్ష రెండు దశల్లో ప్రిలిమ్స్, మెయిన్స్‌గా జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని, విశ్లేషణ సామర్థ్యాన్ని, ఊహా శక్తిని, సృజనాత్మకతను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. పరీక్ష 100 పాయింట్లకు జరుగుతుంది. మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
పిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. ఇందులో డ్రాయింగ్/స్కెచింగ్, మోడల్ మేకింగ్‌కు సంబంధించి ప్రశ్నలుంటాయి. ఈ దశకు 100 మార్కులు కేటాయించారు. మూడు గంటల వ్యవధిలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.nid.edu
జెమాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • గుంటూరులోని సూర్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ.. వివిధ జెమాలజీ కోర్సుల్లో సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. అన్ని ప్రోగ్రామ్స్‌కు 20 రోజుల వ్యవధి ఉంటుంది. జెమ్ ఐడెంటిఫికేషన్, డెమైండ్ గ్రేడింగ్ అండ్ ప్రైసింగ్, కలర్డ్ స్టోన్ గ్రేడింగ్ అండ్ ప్రైసింగ్, సింథటిక్స్ అండ్ ట్రీటెడ్ జెం ఐడెంటిఫికేషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల ద్వారా ఇప్పటికే ఈ విభాగంలో ఉన్నవారికి ఉపయోగపడతాయి. కొత్తగా జెమాలజీ నేర్చుకోవాలనుకునేవారికి అవగాహన ఏర్పడుతుంది.
    వెబ్‌సైట్:  www.suryadiamonds.com
  • హైదరాబాద్‌లోని దక్కన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెం అండ్ జివెలరీ.. జెమాలజీలో మూడు నెలల కోర్సును అందిస్తోంది. క్రిస్టలోగ్రఫి, ఫిజికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్, ఆర్గానిక్ జెమ్స్, సింథటిక్ జెమ్స్, మైనింగ్ వంటివి కోర్సులో భాగంగా నేర్పిస్తారు.
    వెబ్‌సైట్:  www.digj.in
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
ఫ్యాషన్ డిజైనింగ్.. చాలా విస్తృతమైన సబ్జెక్టు. ఇందులో గార్మెంట్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్ లాంటి వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది యువతకు మంచి ఉపాధి వేదికగా మారడంతో ఎక్కువమంది దీనివైపు ఆకర్షితులవుతున్నారు.
  • హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్‌లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందులో టెక్స్‌టైల్ డిజైన్, ఆక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ అండ్ కమ్యూనికేషన్ లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థ అపారెల్ ప్రొడక్షన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. ఈ సంస్థ మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌ను కూడా అందిస్తోంది.
    వెబ్‌సైట్: www.nift.ac.in

  • హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో టెక్స్‌టైల్ డిజైనింగ్ ఒక సబ్జెక్టుగా ఆరు నెలల డిప్లొమా కోర్సును అందిస్తోంది.
    అర్హత: పదో తరగతి
    వెబ్‌సైట్: www.iiftindia.net

  • హైదరాబాద్‌లోని అపారెల్ ట్రెయినింగ్ అండ్ డిజైన్ సెంటర్.. ఒకేడాది అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీల్లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ఈ రెండు సబ్జెక్టుల్లో రెండేళ్ల అసోసియేట్ డిగ్రీలను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ సంస్థ అడ్వాన్స్‌డ్ ప్యాటర్న్ మేకింగ్‌లో డిప్లొమా కోర్సును అందిస్తోంది. ఇది వొకేషనల్ కోర్సులకు శిక్షణనిచ్చే సంస్థ.
    అర్హత: పదో తరగతి/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్: www.atdcindia.co.in
బీఎస్సీలో విజువల్ కమ్యూనికేషన్స్ చేయాలంటే ఎలా ?
+
విజువల్ కమ్యూనికేషన్‌లో ఇన్ఫర్మేషన్ డిజైన్, టైపోగ్రఫీ, పబ్లికేషన్ అండ్ బుక్ డిజైన్, కార్పోరేట్ ఐడెంటిటీ అండ్ బ్రాండింగ్, మాస్ కమ్యూనికేషన్ థియరీ, ఇలస్ట్రేషన్ అండ్ ఎగ్జిబిషన్ డిజైన్ అంశాల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది.
  • హైదరాబాద్‌లోని జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్‌ను అందిస్తోంది. ఇది డ్యూయెల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్.
    వెబ్‌సైట్: www.zica.org

  • కట్టన్ కులత్తూర్ ఎస్‌ఆర్‌ఎమ్ యూనివర్సిటీ, చెన్నైలోని లయోలా కాలేజీలు బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
    అర్హత:
    60 శాతం ఉత్తీర్ణతతో ఇంటర్
    ఎంపిక: ప్రవేశపరీక్షలో కనబరిచిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
    వెబ్‌సైట్: www.srmuniv.ac.in    
    www.loyolacollege.edu

  • అన్నామలైనగర్‌లోని అన్నామలై యూనివర్సిటీ, చెన్నైలోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలు బీఎస్సీలో విజువల్ కమ్యూనికేషన్‌ను దూరవిద్యా విధానంలో అందిస్తున్నాయి.
    అర్హత: ఇంటర్
    వెబ్‌సైట్:
    https://annamalaiuniversity.ac.in
    www.stpetersuniversity.org
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలను తెలపండి?
+
అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) పలు డిజైన్ స్పెషలైజేషన్‌లను డిప్లొమా, పీజీ డిప్లొమా రూపంలో అందిస్తోంది. వాటిలో ప్రధానమైనవి
  1. గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డిజైన్: ఇది నాలుగేళ్ల కోర్సు. ఇందులో ప్రొడక్ట్ డిజైన్, ఫర్నీచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, సెరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ అండ్ టెక్స్‌టైల్ డిజైన్‌లు స్పెషలైజేషన్లుగా ఉన్నాయి.
    అర్హత: 10 +2
  2. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజైన్: ఇది రెండున్నరేళ్ల కోర్సు. ఇందులో ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమోబైల్ డిజైన్., టాయ్ అండ్ గేమ్ డిజైన్, ఫోటోగ్రఫీ డిజైన్, అపారెల్ డిజైన్, లైఫ్ స్టైల్ యాక్సెసరీ డిజైన్, న్యూ మీడియా డిజైన్ అండ్ స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లుగా ఉంటాయి.
    అర్హత: డిగ్రీ (డిజైన్ స్పెషలైజేషన్).
    పై రెండింటిలో ప్రవేశానికి రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
    కోర్సు పూర్తయిన తర్వాత స్పెషలైజేషన్ ఆధారంగా మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఇంటీరియర్ డిజైనింగ్, అడ్వర్టైజింగ్, ఐటీ రంగాల్లో ఉద్యోగం సంపాదించవచ్చు.

    వెబ్‌సైట్: www.nid.edu
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సు గురించి వివరించండి?
+
మనలోని సృజనకు పదును పెట్టే కోర్సు ఇది. కోర్సులోని స్పషలైజేషన్ ఆధారంగా మాన్యుఫ్యాక్చరింగ్, ఆటో మోబైల్స్, కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, టెక్స్‌టైల్ తదితర రంగాల్లో విస్తృత అవకాశాలు ఉంటాయి.

  • ఐఐటీ -గువహతి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్‌ను ఆఫర్ చేస్తోంది. సెన్సైస్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, ఇంజనీరింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్, డిజైన్ స్టూడియో, ఫండమెంటల్స్ ఆఫ్ ఎర్గానామిక్స్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, ఆర్ట్ డిజైన్, సొసైటీ, న్యూ మీడియా స్టడీస్ ప్రధాన సబ్జెక్టులు.
    అర్హత:
    10+2. ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
    వెబ్‌సైట్:  www.iitg.ac.in
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్, నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజైన్‌ను ఆఫర్ చేస్తోంది. యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూ నికేషన్, ఫర్నీచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్‌లో స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. అలాగే ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ పేరుతో 18 స్పెషలైజేషన్లు గల రెండున్నరేళ్ల పీజీని కూడా నడిపిస్తోంది.
    అర్హత:
    10+2. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
    వెబ్‌సైట్: www.nid.edu
  • హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, ఫ్యాషన్ అండ్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ అండ్ నిట్‌వేర్ డిజైన్ తదితర ప్రత్యేక కోర్సులను నడిపిస్తోంది. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌ను కూడా ఈ సంస్థ అందిస్తోంది.
    వెబ్‌సైట్:
      www.nift.ac.in
హైదరాబాద్‌లో ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్సును ఆఫర్‌ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
హంస్టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ ఇంటిరీయర్‌ డిజైన్‌- డిప్లొమా ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్సును ఆఫర్‌ చేస్తుంది. వ్యవధి-రెండేళ్లు. అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత. డిప్లొ మాను ఎస్‌ఎన్‌డీటీ యూనివర్సిటీ, ముంబై ప్రదానం చేస్తుంది. సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ వ్యవధి-ఏడాది, అర్హత: 10+2 ఉత్తీర్ణత. స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రై నింగ్‌ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది. డిప్లొమా ఇన్‌ ఇంటిరియర్‌ డిజైన్‌ వ్యవధి-ఏడాది. సజనాత్మకత ఉండి ఆసక్తి ఉన్న ఏవరైనా దీనికి అర్హులే. డిప్లొమాను హంస్టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రదా నం చేస్తుంది. వెబ్‌సైట్‌: www.hamstech.com
లకోటియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌, ఆబిడ్స్‌ డిప్లొమా ఇన్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సును ఆఫర్‌ చేస్తుంది. వ్యవధి: మూడేళ్లు. అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత. ఏడాది, 6 నెలల ప్రోగామ్‌లను కూడా అందిస్తోంది. వివరాలకు www.aliad.in చూడొచ్చు.
మన రాష్ట్రంలో ‘నిఫ్ట్‌’ కాకుండా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులను ఆఫర్‌ చేసే సంస్థల గురించి వివరించండి?
+
న్యూ ఏజ్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌, సికింద్రాబాద్‌- ఫ్యాషన్‌ డిజైనింగ్‌, క్లాతింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.
వెబ్‌సైట్‌ : www.dnads.net
ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ - ఏడాది కాలవ్యవధి గల ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వొకేషనల్‌ కోర్సును అందిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్‌ : www.nifd.net
డీఎఫ్‌(టెక్‌) కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి?
+
నేడు ఫ్యాషన్‌ టెక్నాలజీ బహుముఖ అవకాశాలకు వేదికగా మారింది. ఆదాయ స్థాయి పెరగడంతోపాటు వివిధ బ్రాండెడ్‌, డిజైనర్‌ దుస్తుల పట్ల ప్రజల్లో డిమాండ్‌ పెరిగింది. దీని కనుగుణంగా ఫ్యాషన్‌ డిజైన ర్ల సంఖ్య పెరగాల్సి ఉంది.
దేశంలో చాలా సంస్థలు ఫ్యాషన్‌ టెక్నాలజీ, డిజైన్లలో వివిధ కోర్సులనందిస్తున్నాయి. వీటిలో చాలా వరకు ప్రైవేటు సంస్థలు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు, పరిశ్రమ అవసరాలకనుగుణంగా కోర్సు తదితర అంశాల వల్ల వీటిలో ఫీజు కూడా అధికంగానే ఉంటుంది.
కాబట్టి కోర్సు, ఆఫర్‌ చేస్తున్న సంస్థను ఎంపిక చేసుకునేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విజయవాడ, నెల్లూరు, కాకినాడ, తిరుపతిలో చాలా సంస్థలు ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులనందిస్తున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు వంటి పట్టణాల్లో కోర్సులు కొంత ఖర్చుతో కూడుకున్నవి.
జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు మాత్రం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లు:
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)
వెబ్‌సైట్‌: www.nift.ac.in
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌
ఐఎన్‌ఐఎఫ్‌డీ క్యాంపస్‌, 3-6-154, 3వ ఫ్లోర్‌
విక్టరీ విజన్‌, హిమాయత్‌నగర్‌-హైదరాబాద్‌.
హమ్‌స్టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ ఇంటిరీయర్‌ డిజైన్‌
వెబ్‌సైట్‌: www.hamstech.com
జ్యుయెలరీ డిజైనర్స్‌కు కెరీర్‌ పరంగా ఎటువంటి అవకాశాలుంటాయి?
+
నగల తయారీ, డిజైన్‌ చేసే సంప్రదాయం అనాదిగా మన దేశంలో ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజుల్లో ఇంటి వద్ద, కుటీర పరిశ్రమల్లో నైపుణ్యం గల పని వారు మాత్రమే నగలను డిజైన్‌ చేసేవారు. కానీ ప్రస్తుతం జ్యుయెలరీ డిజైన్‌ ఒక ప్రొఫెషన్‌గా మారింది. బంగారం, రత్నాలకు సంబంధించి ప్రపంచంలోనే మన దేశానిది అతి పెద్ద మార్కెట్‌ కావడంతోపాటు డిజైనరీ జ్యుయెలరీ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఈ రంగం పలు అవకాశాలకు వేదికగా నిలుస్తోంది.
ఫ్యాషన్‌ డిజైన్‌, జ్యుయెలరీ మ్యానుఫ్యాక్చరర్స్‌, ఎక్స్‌పోర్ట్‌ హౌసెస్‌(ఎగుమతి సంస్థలు)ల్లో జ్యుయెలరీ డిజైనర్లకు విరివిగా అవకాశాలు ఉంటాయి. అర్హత, అనుభవం ఆధారంగా ప్రారంభంలోనే వీరికి రూ.15,000-రూ.25,000 వరకు వేతనాలు లభిస్తాయి. అంతేకాకుండా ఫ్రీలాన్స్‌గా కూడా నగలను డిజైన్‌ చేయవచ్చు.
జ్యుయెలరీ డిజైన్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తోన్న సంస్థలు:
పెర్ల్‌ అకాడెమీ ఆఫ్‌ ఫ్యాషన్‌, ఢిల్లీ జ్యుయెలరీ డిజైనింగ్‌లో నాలుగేళ్ల వ్యవధి గల బీఏ(ఆనర్స్‌) కోర్సును అందిస్తోంది. 50 శాతం మార్కులతో 10+2 పూర్తి చేసిన వారు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.pearlacademy.com
జ్యుయెలరీ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌, నోయిడా జ్యుయెలరీ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా కోర్సు, ఏడాది వ్యవధి గల సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.jdtiindia.com
ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఢిల్లీ జ్యుయెలరీ డిజైనింగ్‌ డిప్లొమాను అందిస్తోంది. 10+2 పూర్తి చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్‌: www.iiftindia.net