Skip to main content

Computer related

హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, డెవాప్స్ కోర్సుల వివరాలు తెలియజేయండి?
+
హెచ్‌టీఎంఎల్:
నేటి డిజిటల్ యుగంలో సమాచారం మునివేళ్లపై లభిస్తోంది. ప్రతిదీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది. వెబ్ పేజీలను డెవలప్ చేయడంలో హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్ (హెచ్‌టీఎంఎల్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కాకున్నా.. వెబ్ అప్లికేషన్లను సృష్టించడంలో మొదటి నుంచి హెచ్‌టీఎంఎల్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిపై పట్టుసాధించడం ద్వారా వెబ్ డిజైనర్‌గా, వెబ్ డెవలపర్‌గా రాణించొచ్చు. కంప్యూటర్ బేసిక్స్ తెలిసి వెబ్‌డిజైన్ వైపు వెళ్లాలనుకునే వారు హెచ్‌టీఎంఎల్ నేర్చుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.w3schools.com/html

సీఎస్‌ఎస్:
హెచ్‌టీఎంఎల్ వెబ్‌పేజీలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కాస్కేడింగ్ స్టైల్ షీట్ (సీఎస్‌ఎస్) ఉపయోగిస్తారు. వెబ్‌పేజీలో కలర్స్, ఫాంట్, టెక్ట్స్, ఇమేజ్, లింక్స్, టేబుల్స్, బార్డర్స్, మార్జిన్స్, ఔట్‌లైన్స్, డెమైన్షన్స్, స్క్రోల్‌బార్, పొజిషినింగ్, యానిమేషన్స్.. మొదలైన ఎన్నో ఫీచర్లు సీఎస్‌ఎస్ సొంతం. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లను డిజైనింగ్, డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించే ఇతర సాఫ్ట్‌వేర్‌లలోనూ ఉపయోగిస్తారు. యాంగులర్ జేఎస్, పీహెచ్‌పీ టెక్నాలజీలపై పనిచేసే క్రమంలో హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లు కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కోర్సులను అన్ని మూక్స్ ప్రొవైడర్లు ఆఫర్ చేస్తున్నారు. యూట్యూబ్‌లోనూ ఎంతో సమాచారం అందుబాటులో ఉంది.
వెబ్‌సైట్: https://www.w3schools.com/html

డెవాప్స్ (Devops):
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్, ప్రొడక్ట్ రిలీజ్, డిప్లాయ్, ఆపరేషన్, మానిటర్... ఇలా వివిధ దశలు ఉంటాయి. సాఫ్ట్‌వేర్ సంస్థలు కొన్ని ‘మోడల్స్’ ప్రకారం మొత్తం ప్రక్రియను పూర్తిచేస్తాయి. దీనికోసం వాటర్‌ఫాల్ మోడల్, ఏజైల్ మోడల్స్ లాంటి వాటిని సంస్థలు అనుసరిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఆయా ‘మోడల్స్’లోని కొన్ని ప్రతికూలతలు సంస్థలకు సవాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు డెవలప్ మెంట్ చేసిన కోడ్‌ను డిప్లాయ్ చేయడానికి పట్టే సమయం ఎక్కువగా ఉంటుంది. అలానే ఆపరేషన్స్ కూడా సంతృప్తిగాకరం లేకపోవడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్స్ సమర్థంగా లేకపోవడం తదితర కారణాలతో సరికొత్త మోడల్ ఆవశక్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే ‘డెవాప్స్(Devops)’ మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో డెవలపర్స్, ఆపరేషన్స్ విభాగాల సభ్యులు కలిసి ‘ఉత్పాదకత’ పెంచేందుకు కృషిచేస్తారు. అంటే.. ఏ ఒక్క ఉద్యోగి పని ఒకదశలోనే ఆగిపోకుండా ఒక జట్టుగా సాఫ్ట్‌వేర్ డెలివరీ, మెయింటెన్స్ వరకు కలిసి పనిచేస్తారు. డెవలపర్స్, సిస్టమ్ అడ్మిన్స్, టెస్టర్స్.. మొదలైన వారందరూ డెవాప్స్ ఇంజనీర్లుగా కలిసి పనిచేస్తారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు కావాల్సిన రిక్వైర్‌మెంట్స్, టెస్టింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్‌మెంట్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, మానిటరింగ్, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వరకూ... ఎండ్ టు ఎండ్ బాధ్యత అందరిపైనా ఉంటుంది. ఇదొక సైక్లింగ్ ప్రక్రియ.
  • గత సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్‌లో ఉన్న సవాళ్లను అధిగమించడానికి డెవాప్స్‌లో చాలా టూల్స్ ఉన్నాయి. వీటిద్వారా కంటిన్యూయస్ డెవలప్‌మెంట్, కంటిన్యూయస్ టెస్టింగ్, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్, కంటిన్యూయస్ మానిటరింగ్ చేయడానికి వీలుంటుంది. డెవాప్స్‌కు జాబ్ మార్కెట్ సానుకూలంగా ఉంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఆటోమేషన్‌వైపు వెళుతుంటే.. డెవాప్స్‌పై అవకాశాలు మెరుగవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. డెవాప్స్‌లో పలు దశల్లో ఉపయోగించే టూల్స్‌లో GIT, JENKINS, SELENIUM, DOCKER, PUPPET, CHEF, ANSIBLE, NAGIOS, ELK STACK, SPLUNK మొదలైన డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఇంటిగ్రేషన్, డిప్లాయ్‌మెంట్, మానిటరింగ్ టూల్స్‌కు డిమాండ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
  • డెవాప్స్‌పై వెళ్లాలంటే గతంలో ఐటీ రంగంలో పనిచేసిన అనుభవం ఉంటే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు ప్రాజెక్టుల్లో పనిచేసిన వారైతేనే రియల్ టైం పని అనుభవంతో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోడింగ్, నెట్‌వర్కింగ్ తెలిసిన వారికి ఇది నప్పుతుంది. టూల్స్‌లో ఒక్కొక్కటి వేర్వేరు స్టేజీల్లో ఉపయుక్తంగా ఉంటాయి. ఉదాహరణకు స్ల్పంక్ టూల్ డేటా క్రోడీకరణకు సంబంధించిన టూల్‌గా చెప్పొచ్చు. ఆయా టూల్స్ నేర్చుకోవడానికి వాటి పేరు మీదనే వెబ్‌సైట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్: https://www.edureka.co
ఉద్యోగ నియామక పరీక్షలను ఆన్‌లైన్లో విజయవంతంగా రాయాలంటే సన్నద్ధత ఎలా ఉండాలి?
+
  • ఆన్‌లైన్ పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. తొలుత ఆయా పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా పరీక్షలు రాయాలి. మొత్తం సిలబస్ చదవడం పూర్తయ్యాక గ్రాండ్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి.
  • ఆన్‌లైన్ మాక్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా పరీక్ష విధానానికి అలవాటుపడటంతోపాటు టైం మేనేజ్‌మెంట్ అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. ప్రిపరేషన్ పరంగా బలాలు-బలహీనతలు తెలుస్తాయి.
  • ఆన్‌లైన్ మాక్ పరీక్ష రాసిన తర్వాత పేపర్, ‘కీ’ని డౌన్‌లోడ్ చేసుకొని సమీక్షిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే సంబంధిత సబ్జెక్టు నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌ల వల్ల అభ్యర్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకొని, తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు.
  • వాస్తవ ఆన్‌లైన్ పరీక్ష రాసేముందు సిస్టమ్‌కు సంబంధించి ఎలాంటి టెక్నికల్ సమస్యలున్నా వెంటనే పరీక్ష కేంద్రం సమన్వయకర్త దృష్టికి తీసుకెళ్లాలి.
  • చాలా ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లు రాశాం కాబట్టి, మళ్లీ వాస్తవ పరీక్ష సమయంలో నిబంధనలు (Instructions) చదవనవసరం లేదన్న భావనతో కొందరు నేరుగా పరీక్ష రాయడం ప్రారంభిస్తారు. ఇది సరికాదు. తప్పనిసరిగా ముందు నిబంధనలన్నీ చదవాలి. తొలుత బాగా తెలిసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుర్తించాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, ఒత్తిడికి తావులేకుండా మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలియజేయండి?
+

కంప్యూటర్‌ డిజైన్, మెయింటెనెన్స్‌ అధ్యయనాన్ని కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌గా చెప్పొచ్చు. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఆపరేటింగ్‌ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, పీసీల కాన్ఫిగరేషన్, కంప్యూటర్‌ అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్, ట్రబుల్‌ షూటింగ్‌ టెక్నిక్‌లపై పూర్తి అవగాహన అవసరం.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తున్న సంస్థలు..
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/పీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గేట్‌/పీజీసెట్‌ ద్వారా 72 శాతం విద్యార్థులను, స్పాన్సర్డ్‌ కేటగిరీ కింద 28 శాతం మంది విద్యార్థులను తీసుకుంటారు.
వెబ్‌సైట్‌: https://sit.jntuh.ac.in/
 
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.andhrauniversity.info
తమిళనాడులోని కలసలింగం యూనివర్సిటీ.. నెట్‌వర్క్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ అస్యూరెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగంలో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది.
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా.
వెబ్‌సైట్‌: www.kalasalingam.ac.in

కోయంబత్తూర్‌లోని అమృత స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌.. కంప్యుటేషనల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌లో ఎంటెక్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోంది.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్‌ లేదా 60 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌/ఫిజిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌లలో ఎంఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష/గేట్‌/జీడీ/పీఐలలో మార్కుల ఆధారంగా.
వెబ్‌సైట్‌: www.amrita.edu

కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ కోర్సు అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
     (ఐఐఐటీ) కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్‌లో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత:
    బీటెక్/ఎంసీఏ లేదా సైన్స్/మ్యాథమెటిక్స్‌లో పీజీ.
    ప్రవేశం: ఐఐఐటీ నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. 
    వెబ్‌సైట్: www.iiit.ac.in
  • కోయంబత్తూర్‌లోని భారతీయార్ యూనివర్సిటీ.. కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్‌లో ఎంఏ అందిస్తోంది.
    అర్హత: ఆర్ట్స్/సైన్స్‌లో డిగ్రీ.
    వెబ్‌సైట్: www.bu.ac.in
ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో పీజీ అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ వీఎల్‌ఎస్‌ఐలో ఎంఈ అందిస్తోంది.
    అర్హత:
    సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.uceou.edu
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. ఎంబెడెడ్ సిస్టమ్స్ సబ్జెక్టుగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్‌ను అందిస్తోంది.
    అర్హత:
    సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్/ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in/engg/
  • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ..ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో స్పెషలైజేషన్స్‌తో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత:
    సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్/ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.jntuh.ac.in/new/
  • హైదరాబాద్‌లోని ఐఐఐటీ.. వీఎల్‌ఎస్‌ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 68 క్రెడిట్ పాయింట్స్‌తో ఈసీఈతో బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(పీజీఈఈ)లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.iiit.ac.in
ఎథికల్ హ్యాకింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • సెక్యూరిటీ సిస్టమ్స్‌లోని లూప్‌హోల్స్‌ను గుర్తిస్తూ, నెట్‌వర్క్‌ను సురక్షితంగా ఉంచటాన్ని ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో నేర్చుకుంటారు.
  • హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.. సర్టిఫైడ్ ప్రొఫెషనల్ హ్యాకర్ శిక్షణ అందిస్తుంది.
    వెబ్‌సైట్:
      www.iisecurity.in
  • అంకిత్ ఫాడియా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్: ఇది ఒక ఆన్‌లైన్ కోర్సు. దీన్ని రిలయెన్స్ వరల్డ్ ఔట్‌లెట్స్ ద్వారా అందిస్తున్నారు.
    వెబ్‌సైట్:  www.ankitfadia.in
  • హైదరాబాద్‌లోని హ్యాకర్ స్కూల్.. ఎథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్, క్రిప్టోగ్రఫీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ వంటి కోర్సులను అందిస్తోంది. ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఈ కోర్సు నేర్చుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులు కూడా దీన్ని అభ్యసించవచ్చు.
    వెబ్‌సైట్:  www.hackerschool.in
  • హైదరాబాద్‌లోని ఎంటర్‌సాఫ్ట్ ల్యాబ్స్.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఈ-కామర్స్ కన్సల్టెంట్స్ నిర్వహించే ఎథికల్ హ్యాకర్స్ టెస్ట్‌కు శిక్షణ అందిస్తుంది.
    వెబ్‌సైట్:
      www.entersoftlabs.com
హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్ల వివరాలు తెలపండి?
+
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. కంప్యూటర్ నెట్‌వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత: బీటెక్/బీఈ
ప్రవేశం: ప్రవేశ పరీక్ష/గేట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్:  www.jntu.ac.in

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత: బీటెక్/బీఈ
ప్రవేశం: ఏయూసీటీఈలో ర్యాంకులో, గేట్ స్కోర్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్:  www.andhrauniversity.info

తమిళనాడులోని కలాసలింగం యూనివర్సిటీ.. నెట్‌వర్క్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అస్యూరెన్స్ అండ్ సెక్యూరిటీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత: ఈఈఈ/ఈసీఈ/ఈఐ/ఐసీ/ఐటీ/సీఎస్‌ఈ/ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌లలో బీటెక్/బీఈ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్:  www.kalasalingam.ac.in

కోయంబత్తూర్‌లోని అమృతా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని అమృతా విశ్వ విద్యాపీఠం యూనివర్సిటీ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ నెట్‌వర్కింగ్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత:
కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్రాం చ్‌లో బీటెక్/బీఈ లేదా కనీసం 70 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్‌లలో ఎంఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష/గేట్‌లో ఉత్తీర్ణతతోపాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
వెబ్‌సైట్:  www.amrita.edu
ఎథికల్ హ్యాకింగ్ కోర్సు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్, నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, హ్యాకింగ్‌లో వాడే టెక్నిక్స్ అండ్ టూల్స్ గురించి చదువుతారు. ఈ కోర్సులు చేసిన వారు నెట్‌వర్క్ సెక్యూరిటీ సిస్టమ్‌లో ఉన్న లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపిస్తారు.

ఈ కోర్సును అందిస్తున్న పలు సంస్థల వివరాలు:
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.. సర్టిఫైడ్ ప్రొఫెషనల్ హ్యాకర్ కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్:  www.iisecurity.in
సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ కోర్సును ఆన్‌లైన్‌లో రిలయన్స్ ఔట్‌లెట్స్ ద్వారా అంకిత్ ఫడియా అందిస్తున్నారు.
వెబ్‌సైట్:  www.ankitfadia.in
హైదరాబాద్‌లోని హ్యాకర్ స్కూల్.. ఎథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ కోర్సులను అందిస్తోంది.
అర్హత: కంప్యూటర్ సైన్స్/ఇతర ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్స్ అర్హులు.
వెబ్‌సైట్:  www.hackerschool.in
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఈ-కామర్స్ కన్సల్టెంట్స్ నిర్వహించే పరీక్ష రాయడం ద్వారా ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో సర్టిఫికేషన్ వస్తుంది. దీని కోసం హైదరాబాద్‌లోని ఎంటర్ సాఫ్ట్ ల్యాబ్స్ శిక్షణ అందిస్తుంది.
వెబ్‌సైట్:  www.entersoftlabs.com
కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లు, ఉపాధి అవకాశాలేమిటో వివరించండి?
+
కంప్యూటర్ డిజైన్, మెయింటెనెన్స్ అధ్యయనమే కంప్యూటర్ నెట్‌వర్కింగ్. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, పీసీల కాన్ఫిగరేషన్, కంప్యూటర్ అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్, ట్రబుల్ షూటింగ్ టెక్నిక్‌లపై పూర్తి అవగాహన అవసరం.

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలు:
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ,
స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. ప్రవేశ పరీక్ష/గేట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఇందులో ప్రవేశం ఉంటుంది.
వెబ్‌సైట్: jntu.ac.in

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో ఎం టెక్ కోర్సును అందిస్తోంది. ఏయూసీటీఈ ర్యాంకు /గేట్ స్కోర్ ఆధారంగా ఇందులో ప్రవేశం ఉంటుంది.
వెబ్‌సైట్:  www.andhrauniversity.info

తమిళనాడులోని కలసలింగం యూనివర్సిటీ.. నెట్‌వర్క్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ అస్యూరెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత: ఈఈఈ/ఈసీఈ/ఈఐ/ఐసీ/ఐటీ/సీఎస్‌ఈ/ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/బీటెక్
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా.
వెబ్‌సైట్:  www.kalasalingam.ac.in

కోయంబత్తూర్‌లోని అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, అమృత విశ్వ విద్యాపీఠం యూనివర్సిటీ
కోర్సు: కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ అండ్ నెట్‌వర్కింగ్‌లో ఎంటెక్
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదేని బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ లేదా 70 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ /ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్‌లలో ఎంఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష/గేట్/జీడీ/పీఐలలో మార్కుల ఆధారంగా.
వెబ్‌సైట్:  www.amrita.edu
సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
+
ఇంటర్నెట్, కంప్యూటర్ల వినియోగంలో అనుసంధానం చేసిన నెట్‌వర్క్‌కు సంబంధించిన లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడమే ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ టూల్స్, టెక్నిక్స్ ఉపయోగించి నెట్‌వర్క్, అప్లికేషన్స్, వెబ్‌సైట్స్ తదితరాల నెట్‌వర్క్‌కు చెందిన సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను సురక్షితంగా ఉంచేందుకు కావల్సిన వ్యూహాలను ఎథికల్ హ్యాకర్స్ రూపొందిస్తారు. కోర్సులో భాగంగా నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, ఆర్కిటెక్చర్, నెట్‌వర్కింగ్‌టూల్స్, టెక్నిక్స్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అంశాలను బోధిస్తారు. ఎథికల్ హ్యాకింగ్ కోర్సును పలు యూనివర్సిటీలు పీజీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు..

  • ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- హైదరాబాద్
    కోర్సు:
    ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)
    వివరాలకు:  www.iiit.ac.in
  • జేఎన్‌టీయూ-హైదరాబాద్
    కోర్సు:
    ఎంటెక్ (కంప్యూటర్ నెట్‌వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)
    వివరాలకు:  www.jntuh.ac.in
  • ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
    కోర్సు:
    ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్)
    వివరాలకు:  www.andhrauniversity.edu.in
ఈ యూనివర్సిటీలు గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తాయి.
బీఎస్సీ (మ్యాథ్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) చదువుతున్నాను. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ఆఫర్‌ చేసే జాబ్‌ ఓరియంటెడ్‌ కంప్యూటర్‌ కోర్సులు ఏవైనా ఉంటే వివరించండి?
+
‘ఇగ్నో’ రెండేళ్ల కాలవ్యవధితో అందించే ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌ ప్రధానాంశంగా మ్యాథమెటిక్స్‌) కోర్సు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తారుు. మ్యాథమెటిక్స్‌ పట్ల ఆసక్తితోపాటు,  మ్యాథమెటిక్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆశించే అభ్యర్థులు ఈ కోర్సు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ కోర్సులో ప్రధానంగా కంప్యూటర్‌ రంగంలో ఎదురయ్యే మ్యాథమెటికల్‌ ప్రాబ్లమ్స్‌ గురించి వివరిస్తారు. కోర్సు నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. మెుదటి, మూడు సెమిస్టర్లు జనవరి-జూన్‌ మధ్య, రెండు, నాలుగు సెమిస్టర్లు జూలై-డిసెంబర్‌ మధ్య నిర్వహిస్తారు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. ఈ ప్రోగ్రాంలో 64 క్రెడిట్స్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్‌ కోర్సులకు 34, ఎలక్టివ్‌ కోర్సులకు 26, ప్రాజెక్ట్‌వర్క్‌కు 4 క్రెడిట్స్‌ ఉంటారుు. కోర్‌ కోర్సులు - మ్యాథమెటికల్‌ నాలెడ్జ్‌, టెక్నిక్స్‌, వివిధ అప్లికేషన్స్‌లో ఉపయోగించే అవసరమైన విషయూల గురించి ఉంటుంది. మెుదటి, రెండో సెమిస్టర్లలో వీటిని చదవాల్సి ఉంటుంది. మూడు, నాలుగో సెమిస్టర్లలో వచ్చే క్లిష్లమైన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి వీలుగా కోర్‌ కోర్సులను రూపొందించారు. ఇందులో ఆల్జీబ్రా, ఫంక్షనల్‌ అనాలసిస్‌, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా స్ట్రక్చర్స్‌, లీనియర్‌ ఆల్జీబ్రా, రియల్‌ అనాలసిస్‌, కాంప్లెక్స్‌ అనాలసిస్‌, డిఫెరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, న్యూమరికల్‌ సొల్యూషన్స్‌ ఉంటారుు.
ఎలక్టివ్‌ కోర్సులు - కంప్యూటర్‌ సైన్స్‌లో మ్యాథమెటిక్స్‌ అప్లికేషన్స్‌ నేర్చుకునేందుకు వీలుగా ఈ అంశాలు ఉంటారుు. కోడింగ్‌ థియరీ, క్రిప్టోగ్రాఫీ, సాఫ్ట్‌ కంప్యూటింగ్‌ అండ్‌ అప్లికేషన్స్‌, గ్రాఫ్‌ థియరీ, డిజైన్‌ అండ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ అల్గారిథమ్స్‌, ప్యాటర్స్‌ రిగ్నిషన్స్‌ అండ్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వంటి  అంశాలు వివరిస్తారు.
ప్రాజెక్ట్‌వర్క్‌ - ప్రతి అభ్యర్థి కచ్చితంగా ప్రాజెక్ట్‌వర్క్‌ను పూర్తి చేయాలి. అభ్యర్థికి సబ్జెక్టుకు సంబంధించిన ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ అందించడం, సంస్థలు, పరిశ్రమల పట్ల అవగాహన కల్పించడం ఇందులో ఉంటాయి.
ప్రాక్టికల్స్‌ - నిర్దేశించిన కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. కోర్సులో భాగంగా అధిక శాతం కంప్యూటర్‌పైనే ప్రాక్టికల్స్‌ నిర్వహించాలి. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కోర్సు కాకుండా మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ); బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌(బీసీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(బీఐటీ), సర్టిఫికెట్‌ ఇన్‌ కంప్యూటింగ్‌ (సీఐసీ) వంటి జాబ్‌ ఓరియెంటెడ్‌ కంప్యూటర్‌ కోర్సులను ఇగ్నో అందిస్తోంది.
ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌)తో రెండేళ్లు లెక్చరర్‌ అనుభవం ఉంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాలనుకుంటున్నాను. ఏ కంప్యూటర్‌ కోర్సులు చేస్తే బాగుంటుంది?
+
సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ అనాలసిస్‌, డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌, టెస్టింగ్‌, మెయింటెనెన్స్‌ వంటి వివిధ దశల ఆధారంగా జరుగుతుంది. ఏ దశలో నైపుణ్యం సంపాదించాలో ముందు నిర్ణయం తీసుకోవాలి. అలాగే సాఫ్ట్‌వేర్‌ ఆధారిత అంశాలైన నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ వంటివి కూడా ఉన్నాయి. అది మీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. వివిధ కంపెనీలు, వినియోగదారులు కోరిన సాఫ్ట్‌వేర్‌ అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రామింగ్‌ను రూపొందించాల్సి ఉంటుంది. దీనికోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యం అవసరం ఉంటుంది. జావా, విజువల్‌ బేసిక్స్‌, డెవలప్‌మెంట్‌కు జావా, విజువల్‌ బేసిక్స్‌ వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ల నైపుణ్యం అవసరం అవుతుంది. ఒరాకిల్‌, ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌ వంటి డేటాబేస్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్స్‌ నేర్చుకుంటే డేటాబేసెస్‌ అంశం ఎంచుకోవచ్చు. ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానం ఉంటే అదనపు అర్హత. వెబ్‌ ప్రోగామర్‌ కావాలంటే.. ఏఎస్‌పీ, జేఎన్‌పీ, డీహెచ్‌ టీఎంఎల్‌, ఎక్స్‌ఎల్‌ఎల్‌ మొదలైనవి తెలిసి ఉండాలి. ఇతర అంశాలకూ ఈ ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. మార్కెట్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అంశంలో నైపుణ్యం సాధించడం వల్ల సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణించవచ్చు.
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ(ఎన్‌సీఎస్‌టీ) ఆఫర్‌ చేస్తోన్న కోర్సుల వివరాలను తెలపండి?
+
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పరిశోధన అభివృద్ధి విభాగం సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌. దీన్ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీగా కూడా వ్యవహరిస్తారు.
ఈ సంస్థ ఆఫర్‌ చేస్తోన్న కోర్సులు:
పీజీ డిప్లొమా ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ (పీజీడీఎస్‌టీ): గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీలో స్పెషలైజేషన్‌ కోర్సు చేయాలనుకునే వారి కోసం ఈ కోర్సు ఉద్దేశించింది. అల్గారిథమ్స్‌ అండ్‌ డేటా స్ట్రక్చర్స్‌, కంప్యూటర్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, డిజైన్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ వంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వీటిని ముంబై, బెంగళూరు క్యాంపస్‌లు ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ కోర్సును ఆన్‌లైన్‌లోనూ చేసే అవకాశం ఉంది.
పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ:
సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీలో మరిన్ని స్పెషలైజేషన్‌ కోర్సులు చేయాలనుకునే వారి కోసం ఈ కోర్సు ఉద్దేశించింది. కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ గ్రాడ్యుయేట్లు/పీజీడీఎస్‌టీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. ముంబై, బెంగళూరు క్యాంపస్‌లు దీన్ని అందిస్తున్నాయి. మొబైల్‌ అండ్‌ వైర్‌లెస్‌ కంప్యూటింగ్‌, నెట్‌వర్క్‌ ప్రోగ్రామింగ్‌, గ్రిడ్‌ కంప్యూటింగ్‌, హ్యూమన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ అండ్‌ నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు.
మరిన్ని వివరాలకు www.cdacmumbai.in లేదా https://trinetra.ncb.ernet.in చూడొచ్చు.
ఇంటర్‌ పూర్తి చేశాను. 3డీ యూనిమేషన్‌ కోర్సు చేయూలనుకుంటున్నాను. నాకు అర్హత ఉందా? ఈ కోర్సును అందించే సంస్థల గురించి తెలపండి?
+
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ యూనిమేషన్‌ ప్రత్యేకాంశంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోంది. 10+2 ఉత్తీర్ణులు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తారు. వెబ్‌సైట్‌ : https://jnafau.ac.in
ఎరీనా యూనిమేషన్‌ అకాడెమీ మల్టీమీడియూ ప్రత్యేకాంశంగా కోర్సును అందిస్తోంది.
(www.arenaanimationacademy.com)
వెబెల్‌ అకాడెమీ ఏడాది కాలవ్యవధి గల 2డీ యూనిమేషన్‌, 3డీ యూనిమేషన్‌ డిప్లొమా కోర్సును ఆఫర్‌ చేస్తోంది.
www.webelindia.com
కలర్‌చిప్స్‌ ఇండియూ, హైదరాబాద్‌ 2డీ అండ్‌ 3డీ ట్రైనింగ్‌  అందిస్తోంది. www.colorchipsindia.com
కాలిబర్‌ ఐటీ సొల్యూషన్స్‌, సికింద్రాబాద్‌ యూనిమేషన్‌లో వివిధ కోర్సులను అందిస్తోంది.
www.caliberitsolutions.com
పదో తరగతి చదివిన నాకు సరైన కంప్యూటర్‌ కోర్సుల గురించి వివరించండి? ఏ కోర్సు చేస్తే మంచిది?
+
కంప్యూటర్‌పై ప్రాథమిక అవగాహన ఏర్పడేందుకు ముందుగా బేసిక్‌ కోర్సుల నుంచి మెుదలు పెట్టండి. ఇక్కడ కంప్యూటర్‌ వినియోగం, ఇంటర్నెట్‌, ఎంఎస్‌ వర్డ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, పవర్‌ పారుుంట్‌ ప్రజెంటేషన్‌ వంటివి నేర్పిస్తారు. దీనివల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్‌, కంపోజర్‌ వంటి చిన్నస్థారుు కంప్యూటర్‌ ఆధారిత ఉద్యోగాలు లభిస్తారుు. అలాగే, కొంత పరిజ్ఞానం ఏర్పడి ఏ కోర్సులు చేస్తే భవిష్యత్తులో బావుంటుందనే విషయం అర్థమవుతుంది. కంప్యూటర్‌ కోర్సులు అందించే ఏ సంస్థల్లోనైనా ఈ కోర్సులు లభిస్తారుు.
డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌, వెబ్‌ డిజైనింగ్‌, ప్రోగ్రామింగ్‌, నెట్‌వర్క్స్‌ సెక్యూరిటీ వంటి కోర్సులు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతారుు. మీ ఆసక్తి, లక్ష్యం మేరకు కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజెస్‌, లాంగ్వేజెస్‌ నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందే వీలుంటుంది. అరుుతే, కంప్యూటర్‌ కోర్సు ఎంపిక విషయంలో ఎవరైనా ఎడ్యుకేషన్‌ కౌన్సిలర్‌ లేదా మంచి కంప్యూటర్‌ సంస్థను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి.
కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేశాను. ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్స్‌ కూడా పూర్తరుుంది. పీజీ స్థారుులో ఏం చదివితే బాగుంటుందో సూచించగలరు.
+
మీకున్న విద్యార్హతల ఆధారంగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ స్థారుులో మీరు చదవగల కోర్సుల వివరాలు.. జేఎన్‌టీయూహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇన్మర్మేషన్‌ టెక్నాలజీ అందించే ఎం.టెక్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ. ప్రవేశ పరీక్షలో ర్యాంకు లేదా ‘గేట్‌’ స్కోర్‌ ప్రామాణికంగా ప్రవేశం లభిస్తుంది. ట్రిపుల్‌ ఐటీ (హైదరాబాద్‌)లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ. ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌లో ఎమ్మెస్సీ సైబర్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కోర్స్‌ చదవొచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ లేదా లేదా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ లేదా మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/ స్టాటి స్టిక్స్‌/ఎలక్ట్రానిక్‌ సైన్స్‌ సబ్జెక్టులు ఐచ్ఛికాంశాలుగా డిగ్రీ ఉతీర్ణత, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులు అర్హులు. వీటితోపాటు ట్రిపుల్‌ఐటీ (అలహాబాద్‌)లో సైబర్‌ లా అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎం.ఎస్‌. కోర్స్‌ చదివే అవకాశం ఉంది. ఈ కోర్స్‌లతోపాటు సి.ఐ.ఎస్‌.సి.ఒ. (సిస్కొ) వంటి అంతర్జాతీయ సర్టిఫికేషన్లను కూడా పొందొచ్చు.
ఉద్యోగ సాధనకు సంబంధించి నెట్‌వర్కింగ్‌ ప్రాధాన్యం ఏమిటి?
+
జాబ్‌ మార్కెట్‌ క్లిష్టంగా ఉన్నపుడు ఉద్యోగాన్వేషణ కష్టంగానే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగాన్వేషణకు సృజనాత్మక ఆలోచన అవసరం. దీనికి నెట్‌వర్కింగ్‌ ఎంతో తోడ్పడుతుంది. నెట్‌వర్కింగ్‌ ద్వారా లభించే విస్తృత సమాచారం ఆధారంగా జాబ్‌ మార్కెట్‌ గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇది కెరీర్‌ ప్లానింగ్‌, ఉద్యోగాన్వేషణ సరైన మార్గంలో సాగేందుకు సహకరిస్తుంది. ముఖ్యంగా నెట్‌వర్కింగ్‌ ఎవరికో ఉద్యోగం అడగాల్సిన పరిస్థితిని కాకుండా మన సామర్థ్యాలకు సరిపడే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తుంది.
ఇపుడు వివిధ కంపెనీలు 75 శాతం నియూమకాలు నెట్‌వర్కింగ్‌ ద్వారానే నిర్వహిస్తున్నారుు. వేగం, సమాచారం త్వరితగతిన అందించే వెసులుబాటు వంటి అధునాతన సౌకర్యాలు నెట్‌వర్కింగ్‌ పట్ల ఆదరణను పెంచారుు. మనకు సంబంధించిన సమాచారాన్ని ఒకసారి నెట్‌లో ప్రవేశపెడితే చాలు, మీ అర్హతలను పరిశీలించిన కంపెనీలు అవకాశాల గురించి మీకు వివరించడం మెుదలు పెడతారుు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ఉద్యో గార్థులు, కంపెనీల మధ్య పరస్పర సంబంధాలు నెలకొల్పి అవకాశాలను అందించడంలో నెట్‌వర్కింగ్‌ కీలకపాత్ర వహిస్తుంది. ఇతర వనరుల ద్వారా లభించని జాబ్స్‌ సమాచారం కూడా నెట్స్‌లో లభిస్తుంది. కేవలం ఉద్యోగ వివరాలే కాకుండా మార్కెట్‌ ట్రెండ్‌, ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సమస్త సమాచారం నెట్‌వర్క్‌ సదుపాయం నుంచి నిమిషాల్లో పొందవచ్చు. సమాజంలో మారుతున్న పరిణామాలను గమనిస్తూ.. చక్కని భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకునేందుకు నెట్‌ వర్కింగ్‌ ఎంతో ఉపయుక్తం.
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, ఇప్పుడు నెట్‌వర్కింగ్‌ కోర్సులు చేయాలనుకుంటున్నాను. ఆఫర్‌ చేసే విద్యా సంస్థలేవి?ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు అభ్యర్థుల నుంచి ఆశించేదేమిటి?
+
నెట్‌వర్కింగ్‌ నిపుణులు కావాలనుకునే అభ్యర్థులు చేయదగ్గ కోర్సు సీసీఎన్‌ఏ (సిస్కో సర్టిఫైడ్‌ నెట్‌వర్క్‌ అసోసియేట్‌). ఈ రంగానికి సంబంధించి డబ్ల్యూఏ ఎన్‌-నిర్వహణ-పరికరాలు, ఓఎస్‌ఐ లేయర్స్‌, టీసీపీ/ ఐపీ అడ్రెసింగ్‌ అండ్‌ సబ్‌నెట్టింగ్‌, సిస్కో హైరార్కెల్‌ మోడల్‌, ఇంటర్‌ఫేసెస్‌ అండ్‌ కాంపోనెంట్స్‌, మోడల్స్‌ అండ్‌ బేసిక్‌ కమాండ్స్‌, నావిగేషన్‌ కమాండ్స్‌, పాస్‌వర్డ్‌ రికవరీ, డబ్ల్యూఏఎన్‌ ప్రొటోకాల్‌ వంటి వివిధ అంశాలపై పూర్తి పరిజ్ఞానం అందించేందుకు ఈ కోర్సు ఎంతో తోడ్పడుతుంది. ఈ కోర్సును ఆఫర్‌ చేసే సంస్థలు హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం www.sourceoneit.net చూడొచ్చు. వీటితోపాటు హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ -అసెంబ్లింగ్‌ అండ్‌ ట్రబుల్‌ షూటింగ్‌ పీసీ కాంపోనెంట్స్‌ కోర్సులు చేస్తే బావుంటుంది. ప్రాక్టికల్‌, థియరీలు కలిపి ఆరు రోజుల్లో నేర్పిస్తారు. అలాగే ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సు ప్రాక్టికల్స్‌, థియరీలతో కలిపి ఒక వారం రోజుల్లో నేర్చుకోవచ్చు. ఈ కోర్సులతో పాటు సీసీఎన్‌ఏ కోర్సు కూడా జూమ్‌ టెక్నాలజీస్‌, హైదరాబాద్‌లో లభిస్తుంది.
వెబ్‌సైట్‌ : www.zoomgroup.com
నేను 2004లో బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేశాను. ఇటీవలే టెస్టింగ్‌ టూల్స్‌ సాఫ్ట్‌వేర్‌ శిక్షణ పొందాను. ఈ రంగంలో ఉద్యోగాల ఇంటర్వ్యూలకు ‘ఫ్రెషర్‌’గా హాజరయ్యే అవకాశం నాకు ఉంటుందా?
+
సాధారణంగా ఇంటర్వ్యూలు జరిగే సంవత్సరంలోనే ఉత్తీర్ణులైన వారిని ‘ఫ్రెషర్‌’గా పరిగణిస్తారు. అంతకుముందు సంవత్సరాల్లో ఉత్తీర్ణులైనవారు ‘ఫ్రెషర్స్‌’ కాలేరు. కొన్ని సంస్థలు అప్పటి వరకు ఎటువంటి ఉద్యోగ అనుభవం లేనివారిని కూడా ఫ్రెషర్‌గా పరిగణిస్తున్నారుు. కావున.. మీరు తాజా అభ్యర్థి అవునో.. కాదో.. ఇంటర్వ్యూకి పిలిచే సంస్థ విధానాన్ని బట్టి ఉంటుంది. ‘ఫ్రెషర్‌’ హోదాలో ఇంటర్వ్యూకు హాజరైతే ఎటువంటి పరీక్షలు ఉండబోవని భావించొద్దు. ఎల్లప్పుడూ మీకున్న అదనపు అర్హతలను తెలియజేసే విధంగా.. కంప్యూటర్స్‌లో, టెస్టింగ్‌ రంగంలో మీకున్న ఆసక్తిని ఆకట్టుకునే రీతిలో తెలియజేయడం ఎంతో ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం... మీ చదువు పూర్తరుున సమయూనికి, దరఖాస్తు తేదీకి మధ్య ఉన్న ‘గ్యాప్‌’ గురించి సమాధానం ఇచ్చేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇంటర్వ్యూ చేసేవారిని సంతృప్తి పరచే రీతిలో సమాధానం ఇవ్వాలి. అప్పుడే మీకు ఉద్యోగం సులువుగా లభిస్తుంది.
శాప్‌ కోర్సు చేయాలనుకుంటున్నాను. సంబంధిత వివరాలను తెలపండి?
+

శాప్‌ (SAP) అనేది సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ సిస్టమ్‌. ఇందులో ఒక కంపెనీ, ఆర్గనైజేషన్‌, కార్పొరేషన్‌ వంటి సంస్థలను నిర్వహించడానికి అవసరమైన ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, ఎంఆర్‌పీ, ఇన్‌వెంటరీ కంట్రోల్‌ వంటి విభాగాల్లో ఉపయోగపడే చాలా రకాల మాడ్యూల్స్‌ ఉంటాయి. దీనిలో ఉపయోగించే శాప్‌ ఎఫ్‌/సీఓ మాడ్యూల్‌ ఫైనాన్స్‌, అకౌంట్స్‌, డెసిషన్‌ మేకింగ్‌ అంశాలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు..శాప్‌ హెచ్‌ఆర్‌ మాడ్యూల్‌..హ్యూమన్‌ రిసోర్స్‌ సంబంధ రికార్డులను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా ఆర్గనైజేషన్స్‌ శాప్‌ హెచ్‌ఆర్‌ క్వాలిఫికేషన్‌ ఉన్న వారిని రిక్రూట్‌ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతేకాకుండా ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో 90 శాతం కంపెనీలు శాప్‌ ఆధారంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు శాప్‌ కోర్సులో శిక్షణను ఇస్తున్నాయి.

బీఎస్సీ మెుదటి సంవత్సరం చదువుతున్నాను. దీంతోపాటు అనుబంధంగా చేసే షార్ట్‌ టర్మ్‌ కంప్యూటర్‌ కోర్సులను తెలపండి?
+
ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో విద్యార్థులు తమ డిగ్రీలకు అదనపు అర్హతలు సమకూర్చుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో వారు ముందుగా కంప్యూటర్‌ కోర్సులపై దృష్టి సారిస్తే... పరిజ్ఞానంతోపాటు ఉద్యోగ సాధనలో కూడా అవి తోడ్పడతారుు. ఈ నేపథ్యంలో డిగ్రీ విద్యార్థులకు పలు షార్ట్‌టర్మ్‌ కంప్యూటర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నారుు. యునిక్స్‌, లినక్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, వెబ్‌ డిజైనింగ్‌, ఈ- కామర్స్‌, ఇంటర్నెట్‌ ఆపరేషన్స్‌, మల్టీ మీడియూ, వెబ్‌ డిజైనింగ్‌, యూనిమేషన్‌ ప్రస్తుతం క్రేజ్‌... కెరీర్‌ స్కోప్‌ ఉన్న షార్ట్‌టర్మ్‌ కోర్సులు. సైన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ విద్యార్థులకు పై కోర్సులతోపాటు సి, సి++, డేటాస్ట్రక్చర్‌, ఆటో క్యాడ్‌, జావా వంటి కోర్సులు కెరీర్‌ ఉన్నతికి దోహదం చేస్తారుు. వీటితోపాటు వేగంగా గ్రహించే శక్తి, విశ్లేషణ సామర్థ్యం ఉన్న విద్యార్థులకు ఒరాకిల్‌, జావా, టెస్టింగ్‌ టూల్స్‌.. శాప్‌, పీపుల్‌ సాఫ్ట్‌ వంటి ఈఆర్‌పీ సొల్యూషన్స్‌ అనుకూల కోర్సులు. ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్‌ వంటి పలు ప్రైవేట్‌ సంస్థలు ఈ తరహా కోర్సులను ఆఫర్‌ చేస్తున్నారుు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రంగమేదైనా.. ఎంట్రీ లెవల్‌ పోస్టరుునా.. ఉన్నత స్థానమైనా.. ఏ ఉద్యోగానికైనా ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ఈ నేపథ్యంలో డిగ్రీ స్థారుులోనే ఇంగ్లిష్‌ పరిజ్ఞానం సాధించే దిశగా పునాదులు వేసుకోవాలి. కాబట్టి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ వంటి కోర్సుల్లో చేరడం లాభిస్తుంది. దీనివల్ల భావాన్ని వ్యక్తం చేసే కనీస సామర్థ్యం సొంతమవడంతోపాటు లిజనింగ్‌, రీడింగ్‌, రైటింగ్‌ స్కిల్స్‌ అలవడతారుు. దీంతోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ తీసుకోవడం కూడా కెరీర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా అకౌంటింగ్‌ ప్యాకేజ్‌లు, బీపీఓ ట్రైనింగ్‌, మెడికల్‌ ట్రాన్స్‌కిప్షన్‌, కాల్‌సెంటర్‌ వంటి అవకాశాలను కూడా ఎంచుకోవచ్చు.
బీఎస్‌సీ రెండో సంవత్సరం చదువుతున్నాను. CAD కోర్సు చేయాలనుకుంటున్నా. ఈ కోర్సు చేయడానికి నాకు అవకాశం ఉందా? ప్రవేశమెలా?
+
తయూరీ రంగం, సాఫ్ట్‌వేర్‌, ఏరోస్పేస్‌, ఆటోమోటివ్‌, విద్యుత్‌, చమురు, సహజవాయువు, పారిశ్రామిక, వైద్య రంగ పరిశ్రమల్లో  కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ ఉపయోగం ఎంతో ఉంటోంది. CAD ఇంజనీర్లు (మెకానికల్‌ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఆర్కిటెక్చర్‌), సైంటిస్టులకు ఉపయుక్తంగా ఉంటారు. ఆటోక్యాడ్‌, IDEA, ప్రో/ఇంజనీర్‌, కేటియా వి4, కేటియా వి5, యూనిగ్రాఫిక్స్‌ ఎన్‌ఎక్స్‌, సాలిడ్‌ వర్క్స్‌, సాలిడ్‌ ఎడ్జ్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ క్యాడ్‌లో ఉపయోగిస్తారు. CAD చేయదలచిన అభ్యర్థులకు గణితంపై చక్కటి అవగాహనతోపాటు  అధిక సమయం కంప్యూటర్‌ై పె పని చేయగల ఆసక్తి, అభిరుచి ఉండాలి. అంతేకాకుండా ఎంపిక చేసుకున్న అంశానికి సంబంధించి వివిధ ఇంజనీరింగ్‌ అంశాలను సరిగా అవగాహన చేసుకోగలగాలి. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఆర్కిటెక్చరల్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, మల్టీమీడియా వంటి ప్రత్యేకాంశాలు CAD కోర్సులో ఉంటాయి. హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో శిక్షణ సంస్థలు ఉన్నాయి.
బీఎస్సీ (ఎంపీసీ) పూర్తి చేశా. జాబ్‌ ఓరియెంటెడ్‌ కంప్యూటర్‌ కోర్సుల వివరాలు తెలపండి?
+
ఐటీలో పలు జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బేసిక్‌ లెవెల్‌ కోర్సుల నుంచి ప్రోగ్రామింగ్‌ కోర్సుల వరకూ ఉన్నాయి. బేసిక్‌ కోర్సుల్లో రోజూవారీ కార్యక్రమాలకు అవసరమైన నైపుణ్యాలు, నాలెడ్జ్‌ని నేర్పిస్తారు.  వీటిల్లో ఎంఎస్‌ వర్డ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ పవర్‌ పాయింట్‌ ముఖ్యమైనవి. ఇలాంటి కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌లు అనేకం ఉన్నాయి. వీటిని నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు. అదే విధంగా పూర్తి ప్రొఫెషనల్‌ ఓరియెంటేషన్‌తో ఇంజనీరింగ్‌, గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్ల కోసం ఉద్దేశించిన కోర్సులూ ఉన్నాయి. ఉదాహరణకు ఎస్‌ఏపీ, ఎన్‌ఈటీ, ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌, ఒరాకిల్‌. ఇలాంటి కోర్సులను సమర్థంగా అందించడంలో... ఎన్‌ఐఐటీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు పేరుపొందాయి.  ఈ కోర్సులు పూర్తయ్యాక ప్రోగ్రామింగ్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా సర్టిఫికేషన్‌ కోర్సులు ఉన్నాయి. అవి సీసీఎన్‌ఏ, సీసీఎస్‌పీ, సీసీఐఈ సెక్యూరిటీ. వీటిని ఐటీ నిపుణులతోపాటు సాధారణ అభ్యర్థులు కూడా నేర్చుకోవచ్చు. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, హైదరాబాద్‌... సీ-డాక్‌(డీఏసీ)... సైబర్‌ సెక్యూరిటీ కోర్సును ఈ-లెర్నింగ్‌ మోడ్‌లో అందిస్తోంది. ఈ కోర్సు నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్స్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌, ఐటీ ప్రొఫెషనల్స్‌ కోసం ఉద్దేశించింది. పూర్తి వివరాలకు www.elearn.cdac.in ను చూడొచ్చు.