Skip to main content

Architecture

ఇంటర్ పూర్తయింది. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి?
+
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో భాగంగా విద్యార్థులు.. భవనాలు, గృహ సముదాయాల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, భద్రత; ఆకాశహర్మ్యాలు, అపార్ట్‌మెంట్‌ల డిజైన్,నిర్మాణం గురించి నేర్చుకుంటారు.

అర్హత: సైన్స్ స్ట్రీమ్‌తో 10+2 ఉత్తీర్ణత/ ఇంటర్ ఎంపీసీ. ఐఐటీలు, నిట్‌లలో జేఈఈ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తుండగా, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు స్వీయ ప్రవేశ విధానాన్ని పాటిస్తున్నాయి.

బ్యాచిలర్ స్థాయి కోర్సులు:
  • బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్.

ఉన్నత విద్య:
  1. మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్.
  2. పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్.

ఇన్‌స్టిట్యూట్‌లు:
  1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్.
  2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ.
  3. అలీఘర్ ముస్లిమ్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్
  4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఈఎస్‌టీ), షిబ్‌పూర్, పశ్చిమ బెంగాల్.
  5. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా, రాంచీ.
  6. అన్నా యూనివర్సిటీ, చెన్నై.
  7. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఢిల్లీ.
  8. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), పాట్నా.
  9. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), హమిపూర్.
  10. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ.
  11. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్.
  12. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇంజనీరింగ్, నాగ్‌పూర్.
ఇంటీరియర్ డిజైన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • ఇంటీరియర్ డిజైన్ కోర్సును.. షార్ట్ టర్మ్ కోర్సుగా, ఎంఆర్క్‌లో ఒక స్పెషలైజేషన్‌గా అధ్యయనం చేయవచ్చు.
  • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ.. ఇంటీరియర్ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంఆర్క్ అందిస్తోంది.
    అర్హత:
    గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఆర్క్.
    ప్రవేశం: పీజీసెట్/ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.jnafau.ac.in
  • సికింద్రాబాద్‌లోని సీఎస్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఇంటీరియర్ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంఆర్క్ అందిస్తోంది.
    అర్హత:
    గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఆర్క్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.csiitsap.ac.in
  • హైదరాబాద్‌లోని హామ్స్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్.. ఇంటీరియర్ డిజైన్‌లో ఏడాది, రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా కోర్సులు అందిస్తోంది.
    అర్హత:
    పదోతరగతి/ ఇంటర్మీడియెట్
    వెబ్‌సైట్:  www.hamstech.com
  • హైదరాబాద్‌లోని లఖోటియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్.. ఇంటీరియర్ డిజైన్‌లో ఏడాది పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    పదో తరగతి/ఇంటర్మీడియెట్.
    వెబ్‌సైట్:  www.lakhotiainstituteofdesign.com
హైదరాబాద్‌లో బీ.ఆర్క్‌ను పార్ట్‌టైం విధానంలో అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
+
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ బీ.ఆర్క్‌ను పార్ట్‌టైం విధానంలో అందిస్తోంది. 50 శాతం మార్కులతో మ్యాథ్స్‌ సబ్జెక్టుగా 10+2 లేదా ఆర్కిటెక్చర్‌లో డిప్లొమా ఉన్న వారు దీనికి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
మరిన్ని వివరాలకు https://jnafau.ac.in చూడొచ్చు.
ఆర్కిటెక్చర్‌ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి?
+
భవనాల నిర్మాణంలో ఆర్కిటెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నేడు డిమాండ్‌కు తగిన ఆర్కిటెక్ట్స్‌‌ల లేకపోవడంతో ఈ కోర్సు చదివిన వారి ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఢోకాలేదు.
ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల తర్వాత పరిశోధనాంశంగా కూడా ఆర్కిటెక్చర్‌ను ఎంచుకోవచ్చు.

ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్‌ కోర్సులను అందిస్తోన్న సంస్థలు:
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ-హైదరాబాద్‌ బీ.ఆర్క్‌ను ఆఫర్‌ చేస్తోంది. 50 శాతం మార్కులతో 10+2 (మ్యాథమెటిక్స్‌) లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. నేషనల్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ -నాటా(NATA)లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అలాగే బీ.ప్లానింగ్‌ కోర్సును కూడా ఇదే వర్సిటీ అందిస్తోంది. ఎంసెట్‌ ఆధారంగా ఈ కోర్సులో అడ్మిషన్‌ లభిస్తుంది.
వెబ్‌సైట్‌: http://jnafau.ac.in

స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌-న్యూఢిల్లీ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సులను అందిస్తోంది. 50 శాతం మార్కులతో 10+2 (మ్యాథమెటిక్స్‌) పూర్తి చేసిన వారు అర్హులు. ఏఐఈఈఈలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.spa.ac.in

నాటా(NATA) స్కోర్‌ ఆధారంగానే అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్సిటీ బీ.ఆర్క్‌ (వెబ్‌సైట్‌: www.cept.ac.in), సర్ధార్‌ వల్ల్లభాయ్‌ పటేల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-వాసద్‌, బీ.ఆర్క్‌(బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ స్పెలైజేషన్‌గా-వెబ్‌సైట్‌: www.svitasad.ac.in) లో ప్రవేశం కల్పిస్తున్నాయి. మరిన్ని వివరాలకు www.nata.in చూడొచ్చు.
సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. ఆర్కిటెక్చర్‌ అంటే ఆసక్తి. ఈ రంగంలో నా అభిరుచికి తగిన కోర్సులు ఏవైనా ఉన్నాయా?
+
ఆర్కిటెక్చర్‌ రంగంలో సివిల్‌ ఇంజనీర్లకు మంచి అవకాశాలుంటాయి. అయితే అవి సివిల్‌ పనులకు సంబంధించినవే అయి ఉంటాయి. ఈ రంగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేకుండా పూర్తి స్థాయి ఆర్కిటెక్చర్‌గా పనిచేసే అవకాశం లేదు. అలాగే మీరు మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(ఎం.ఆర్క్‌) కోర్సు చేయడానికి కూడా అర్హులు కారు. మీ ఆసక్తికనుగుణంగా మాస్టర్‌ స్థాయిలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలు..
స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌- న్యూఢిల్లీ, ఆఫర్‌ చేస్తోన్న కోర్సులు:
మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌, రీజనల్‌ ప్లానింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌, అర్బన్‌ ప్లానింగ్‌).
అర్హత: 55 శాతం మార్కులతో ప్లానింగ్‌/ ఆర్కిటెక్చర్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా జాగ్రఫీ/ ఎకనామిక్స్‌/సోషియాలజీలో మాస్టర్‌ డిగ్రీ ఉండాలి.
మాస్టర్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: 55 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌/బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చర్‌, ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్‌/ బిల్డింగ్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా కన్‌స్ట్రక్షన్‌ టెక్నాల జీలో ఐదేళ్ల డిప్లొమా కోర్సును పూర్తి చేసి ఉండాలి.
వెబ్‌సైట్‌: www.spa.ac.in
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూని వర్సిటీ-హైదరాబాద్‌. మాస్టర్‌ ఆఫ్‌ అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌ కోర్సు అందిస్తోంది. బీఆర్క్‌/బీటెక్‌(సివిల్‌) ఉత్తీర్ణత లేదా ఎకనామిక్స్‌ /జాగ్రఫీలో మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
వెబ్‌సైట్‌: https://jnafau.ac.in
సీఈపీటీ యూనివర్సిటీ- అహ్మదాబాద్‌, కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంటెక్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోంది. అర్హత-ఆర్కిటెక్చర్‌ లేదా సివిల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ .ఎంట్రన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. సివిల్‌ ఇంజనీర్లకు స్ట్రక్చరల్‌ డిజైన్‌లో ఎంటెక్‌, మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లానింగ్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా ప్లానింగ్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌, మేనేజ్‌మెంట్‌) కోర్సులను కూడా అందిస్తోంది. వెబ్‌సైట్‌: www.cept.ac.in
హామ్‌స్టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ సంస్థ ఇంటీరియర్‌ డిజైన్‌లో రెండేళ్ల డిప్లొమా, ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు, ఏడాది డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.hamstech.com