విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలు పాఠ్యాంశం నుంచి డీఎస్సీలో ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఏ విధంగా ప్రిపేర్ కావాలి?
పి.ఖాజా హుస్సేన్, జూలకల్
Question
విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలు పాఠ్యాంశం నుంచి డీఎస్సీలో ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఏ విధంగా ప్రిపేర్ కావాలి?
గణితం మెథడ్స్ లో ‘విద్యాలక్ష్యాలు- స్పష్టీకరణాలు’ ముఖ్యమైన పాఠ్యాంశం. దీని నుంచి ఎస్జీటీలో 3 లేదా 4 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవి ఎక్కువగా అప్లికేషన్ పద్ధతిలో ఉంటున్నాయి. విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమవ్వాలి. ప్రశ్నల సరళిని తెలుసుకోవడానికి గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన ‘గణిత బోధన పద్ధతులు’ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది.