Skip to main content

ప్రస్తుతం ప్రకటించిన స్కూల్ అసిస్టెంట్ (గణితం) సిలబస్‌లో ‘గణితం మెథడాలజీ’కు ఎన్ని మార్కులు కేటాయించారు? ఎలా ప్రిపేర్ కావాలి?

వై. జయ సాగర్, ఏలూరు
Question
ప్రస్తుతం ప్రకటించిన స్కూల్ అసిస్టెంట్ (గణితం) సిలబస్‌లో ‘గణితం మెథడాలజీ’కు ఎన్ని మార్కులు కేటాయించారు? ఎలా ప్రిపేర్ కావాలి?
ప్రస్తుతం ప్రకటించిన స్కూల్ అసిస్టెంట్ (గణితం) సిలబస్‌లో గణితం సబ్జెక్టుకు మొత్తం 70 మార్కులు కేటాయించారు. గణితం కంటెంట్, గణితం మెథడాలజీ నుంచి 70 ప్రశ్నలు ఇస్తారు. ప్రత్యేకంగా ‘మెథడాలజీ’కి మార్కులు కేటాయించలేదు. అయినప్పటికీ సుమారు 18 నుంచి 24 ప్రశ్నలు ‘గణితం మెథడాలజీ’ నుంచి అడిగే అవకాశం ఉంది. తెలుగు అకాడమీ పుస్తకాలను చదివితే ఈ సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడం ద్వారా మెథడాలజీ ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు.

Photo Stories