పరమాణు నిర్మాణం అనే అధ్యాయాన్ని ఎలా అధ్యయనం చేయాలో తెలపండి?
గోపాల్, సత్తెనపల్లి
Question
పరమాణు నిర్మాణం అనే అధ్యాయాన్ని ఎలా అధ్యయనం చేయాలో తెలపండి?
రసాయన శాస్త్రంలో అతి ముఖ్యమైన అధ్యాయాల్లో పరమాణు నిర్మాణం ఒకటి. డీఎస్సీ -2012 ప్రశ్నపత్రాన్ని పరిశీలించినట్లయితే ఈ చాప్టర్ ప్రాముఖ్యత తెలుస్తుంది. డీఎస్సీ-2012లో ఈ పాఠంపై ఆరు ప్రశ్నలు అడిగారు. పరమాణు నిర్మాణం భౌతిక శాస్త్రంతో కూడా అనుబంధం కలిగి ఉంటుంది. భౌతిక శాస్త్రంలో ఈ అధ్యాయం ఆధునిక భౌతిక శాస్త్రం అనే పేరుతో ఉంటుంది. ఈ చాప్టర్‌లో శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, పరమాణు నమూనాలు - శాస్త్రవేత్తలు, భౌతిక స్థిరాంక విలువలు, సమీకరణాలు, ఆర్బిటాళ్లు - ఆకృతులు, క్వాంటం సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసాలు - నియమాలు, పరమాణు ధర్మాలు - ప్రమాణాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. వీటన్నింటిని వరుస క్రమంలో ఒక పట్టికలా రూపొందించుకుని చదువుకోవాలి. గత ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల శైలిని పరిశీలించాలి.