ఆమ్లాలు- క్షారాలు- లవణాలు పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
- కుసుమ, కదిరి
Question
ఆమ్లాలు- క్షారాలు- లవణాలు పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
గత నాలుగు సంవత్సరాల (2003, 2006, 2008, 2012) ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఆమ్లాలు- క్షారాలు - లవణాల పాఠ్యాంశం నుంచి సగటున 1- 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ అధ్యాయంలో ఆమ్ల ధర్మాలు, క్షార ధర్మాలు, ఆమ్ల-క్షార సిద్ధాంతాలు, ఆమ్ల - క్షార సూచికలు, నీటి అయానిక లబ్దం, ్కఏ విలువలు - సమస్యలు, తటస్థీకరణం, తటస్థీకరణోష్ణం మొదలైన అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఈ అధ్యాయాన్ని కూడా ఇంటర్మీడియట్ వరకు అనుసంధానం చేసుకుంటూ చదవాలి.