తెలుగు పండిట్ ప్రిపరేషన్ ప్రణాళిక గురించి వివరంగా చెబుతారా?
మూల లతా చక్రపాణి, రాజపురం, శ్రీకాకుళం.
Question
తెలుగు పండిట్ ప్రిపరేషన్ ప్రణాళిక గురించి వివరంగా చెబుతారా?
మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు అకాడమీ ప్రచురించిన పాఠ్యపుస్తకాల కంటెంట్‌పై సిలబస్ ఉంటుంది. కాబట్టి ముందు ఆ పుస్తకాలను సేకరించాలి. ప్రతి రోజూ అన్ని తరగతుల పుస్తకాలను చదివేలా ప్రణాళిక రచించుకోండి. ముందు సారూప్యత ఉన్న అంశాలతో పట్టిక తయారు చేసుకోండి. ఒక్కో తరగతి నుంచి ఒక పాఠాన్ని పూర్తి చేసి, వెంటనే నోట్సు రాసుకోండి. పరీక్ష నెలరోజులు ఉందనగా మోడల్ పేపర్లను సాధన చేయండి. మంచి ఫలితముంటుంది.