స్కూల్ అసిస్టెంట్ (గణితం) మెథడాలజీలో ‘గణితశాస్త్ర చరిత్ర’ పాఠ్యాంశాన్ని ఏ విధంగా చదవాలి?
- ఎన్.శ్రీలక్ష్మి, హిమాయత్నగర్
Question
స్కూల్ అసిస్టెంట్ (గణితం) మెథడాలజీలో ‘గణితశాస్త్ర చరిత్ర’ పాఠ్యాంశాన్ని ఏ విధంగా చదవాలి?
సిలబస్ను అనుసరించి ప్రాచీన నాగరికతకు చెందిన అరబ్బులు, గ్రీక్లు, ఈజిప్షియన్లు, భారతీయులు గణితంలో చేసిన కృషికి సంబంధించిన వివిధ అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటికోసం తెలుగు అకాడమీ ప్రచురించిన ‘డీఎడ్ గణిత బోధన పద్ధతులు’ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది. ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్తోపాటు భారతీయేతర శాస్త్రవేత్తలైన పైథాగరస్, యూక్లిడ్, జార్జి కాంటర్ గురించి ప్రత్యేకంగా సిలబస్లో పేర్కొన్నారు. వీరు గణితానికి చేసిన సేవలు, రాసిన గ్రంథాలు, స్థాపించిన పాఠశాలల గురించి వివరంగా నేర్చుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు.