సెకండరీ గ్రేడ్ పోస్టులకు బీఎడ్ వారికి ఈసారి అవకాశముంటుందా?
యర్ర దుర్యోధనరావు, పీటీపల్లి, శ్రీకాకుళం
Question
సెకండరీ గ్రేడ్ పోస్టులకు బీఎడ్ వారికి ఈసారి అవకాశముంటుందా?
ఎన్‌సీటీఈ ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కేవలం డీఎడ్ వారే అర్హులు. ఇదివరకే సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, పోస్టుల సంఖ్యలో కొంత రిజర్వేషన్ కల్పించవచ్చు. ఒకవేళ ఇది జరిగినా మళ్లీ న్యాయపరంగా చిక్కులు తలెత్తవచ్చు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికే ప్రిపేరవడం మంచిది.