Skip to main content

రాష్ట్రంలో ఉపాధ్యాయ నియూమకాలు ఎలా నిర్వహిస్తారు? డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హతలేంటి?

Question
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియూమకాలు ఎలా నిర్వహిస్తారు? డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హతలేంటి?
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియూమకాలకు ప్రభుత్వం నిర్వహించే పరీక్ష... డీఎస్సీ. స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ), ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌(పీఈటీ), భాషా పండిత ఉపాధ్యాయుల నియూమకాలను డీఎస్సీ ద్వారా నిర్వహిస్తారు. హైస్కూల్‌ స్థారుులో సబ్జెక్టులు బోధించే వారిని స్కూల్‌ అసిస్టెంట్స్‌ అంటారు. వీరికి అర్హత బీఎడ్‌. ఎడ్‌సెట్‌ ద్వారా బీఎడ్‌ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ప్రాథమిక స్థారుు పాఠశాల్లో బోధించేవారిని సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌గా పరిగణిస్తారు. వీరికి అర్హత డీఎడ్‌. ఇంటర్మీడియెట్‌ తర్వాత డీఎడ్‌ చేయొచ్చు. భాషా పండిట్‌ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు భాషా పండితులుగా, పీఈటీ చేసిన అభ్యర్థులు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌గా ఉద్యోగం పొందొచ్చు.

Photo Stories