గణితం కంటెంట్‌కు పాత పాఠ్యపుస్తకాలు చదవాలా? కొత్త టెక్ట్స్‌బుక్ ప్రిపేర్ కావాలా?
కరీముల్లా, కావలి.
Question
గణితం కంటెంట్‌కు పాత పాఠ్యపుస్తకాలు చదవాలా? కొత్త టెక్ట్స్‌బుక్ ప్రిపేర్ కావాలా?
గణితానికి సంబంధించి ప్రకటించిన సిలబస్‌లోని అంశాలను పరిశీలించినట్లయితే అన్ని పాఠ్యాంశాలు పాత పాఠ్యపుస్తకాలకు చెందినవి. డీఎస్సీ నోటిఫికేషన్‌లో పాత టెక్ట్స్‌బుక్స్, కొత్త టెక్ట్స్‌బుక్స్ అని ప్రత్యేకంగా పేర్కొనలేదు. కాబట్టి సిలబస్‌లో ఇచ్చిన పాఠ్యాంశాలు ఏ పాఠ్యపుస్తకాల్లో లభ్యమైనా వాటిని ప్రిపేర్ కావడం మంచిది. సిలబస్‌లో ప్రకటించిన పాఠ్యాంశాలు కొత్త టెక్ట్స్‌బుక్స్‌లో కూడా వివరంగా ఉన్నాయి. వీలైతే రెండూ ప్రిపేర్ కావడం మంచిది.