Skip to main content

డీఎస్సీలో మన విశ్వం పాఠ్యాంశం ప్రాధాన్యం ఏమిటి? ఈ పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?

- కోగంటి భవాని, కర్నూలు
Question
డీఎస్సీలో మన విశ్వం పాఠ్యాంశం ప్రాధాన్యం ఏమిటి? ఈ పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
1995 నుంచి 2012 వరకు జరిగిన డీఎస్సీ ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే 2000 నుంచి 2012 వరకు క్రమం తప్పకుండా సరాసరిన రెండు బిట్లు డీఎస్సీ పరీక్షలో వస్తున్నాయి. ఈ అధ్యాయం 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ‘మనవిశ్వం’ ‘భూమి - చలనాలు’ ‘అంతరిక్షం’ అనే పేర్లతో ఉంది. ఈ పాఠ్యాంశానికి సంబంధించి గ్రహాలు - ఉపగ్రహాలు - కృత్రిమ ఉపగ్రహాలు - ఉల్కలు - తోకచుక్కలు - వ్యోమగాములు - అంతరిక్ష కేంద్రాలు - భూమి చలనాలు - ఖగోళ ప్రమాణాలు - రాశులు - రాశి చక్రాలు అనే భావనలపై ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ అధ్యాయాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నట్లయితే జి.కె. కరెంట్ అఫైర్‌‌సకు కూడా ఉపయోగపడుతుంది. అంతరిక్ష రంగంలో భారతదేశ ప్రస్థానంపై ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది. కాబట్టి భారత్ ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహాలు - విశిష్టత - తేదీలను చదవాలి.

Photo Stories