డీఎస్సీ, టెట్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు మెథడాలజీ విభాగంలో మంచి మార్కులు సాధించడానికి ఏవిధంగా చదవాలి?
ఎల్.గాయత్రి, విద్యానగర్
Question
డీఎస్సీ, టెట్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు మెథడాలజీ విభాగంలో మంచి మార్కులు సాధించడానికి ఏవిధంగా చదవాలి?
టెట్, డీఎస్సీ, మోడల్ స్కూల్స్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు బోధనా పద్ధతులు సబ్జెక్టును తప్పనిసరి చేశారు. ర్యాంకు సాధనలో ఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ప్రతి మార్కు కీలకమే కాబట్టి అభ్యర్థులు తెలుగు మెథడాలజీపై ప్రత్యేక దృష్టి సారించి చదవాలి. దీంట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఎస్‌జీటీ, గ్రేడ్-2 తెలుగు పండిట్స్ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ‘డీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’; బీఎడ్, టీపీటీ చేసి స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసే వారు ‘బీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. టెట్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలన్నింటిలో తెలుగు మెథడాలజీ సిలబస్‌కు సంబంధించి కింద పేర్కొన్న పాఠ్యాంశాలున్నాయి.
- భాష - వివిధ భావనలు
- మాతృభాష బోధన - లక్ష్యాలు, స్పష్టీకరణలు
- భాషా నైపుణ్యాలు
- ప్రణాళికా రచన - పాఠ్య గ్రంథాలు
- పాఠ్య బోధన ప్రక్రియలు - ఆధునిక బోధన పద్ధతులు
- విద్యా సాంకేతిక శాస్త్రం - సహ పాఠ్య కార్యక్రమాలు
- మూల్యాంకనం - పరీక్షలు