డీఎస్సీ పరీక్ష కోసం ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ పాఠ్యభాగంలో ఏయే అంశాలను చదవాలి?
ఎల్.కుసుమ, విద్యానగర్
Question
డీఎస్సీ పరీక్ష కోసం ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ పాఠ్యభాగంలో ఏయే అంశాలను చదవాలి?
2003 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఈ పాఠ్యభాగం నుంచి సగటున 3 ప్రశ్నలు అడిగినట్లు గమనించవచ్చు. దీంట్లో శాస్త్రవేత్తలు, సిద్ధాంతాలు, రచించిన గ్రంథాలు, కనుగొన్న పరికరాలు, బిరుదులు తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సాధారణంగా ఈ చాప్టర్ నుంచి డెరైక్టు ప్రశ్నలు అడుగుతున్నారు. పాశ్చాత్య విద్యా విధానం సంస్కరణ, నవీన విద్యావిధానం రూపకల్పన, పాశ్చాత్య భారతీయ శాస్త్రవేత్తలు, వారు రచించిన గ్రంథాలు మొదలైన అంశాలపై దృష్టి సారించాలి. గ్రీకులు, ఈజిప్షియన్లు, బాబిలేనియన్లు చేసిన కృషి గురించి అవగాహన పెంచుకోవాలి.