Skip to main content

డీఎస్సీ పరీక్ష కోసం సాంఘిక శాస్త్రంలోని ‘వ్యవసాయం’ పాఠ్యభాగంలో ఏయే అంశాలు చదవాలి.

పి.శైలజ, శ్రీకాకుళం
Question
డీఎస్సీ పరీక్ష కోసం సాంఘిక శాస్త్రంలోని ‘వ్యవసాయం’ పాఠ్యభాగంలో ఏయే అంశాలు చదవాలి.
భారతదేశం వ్యవసాయాధార దేశం. అందువల్ల పంటలు- వాటి కాలాల మీద తరచుగా ప్రశ్నలు అడుగుతారు. వీటిని మ్యాప్ సహాయంతో చదివితే బాగా గుర్తుంటుంది.

ఏయే నేలల్లో ఎలాంటి పంటలు పండు తాయో వాటికి అవసరమైన వర్షపాతంతో సహా అధ్యయనం చేయాలి.వాణిజ్య పంటలు, ఆహార పంటలు, తోట పంటలకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి.

వ్యవసాయ పంటలు, అవి విస్తరించిన నేలలు, భూవిస్తీర్ణం, వాటి ఉత్పాదనను విశ్లేషణాత్మకంగా చదవాలి. నేలలు, భూ విస్తీర్ణాన్ని, వాటి ఉత్పాదనను క్షుణ్నంగా చదివినట్లయితే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సులువుగా సమా దానాన్ని గుర్తించవచ్చు.

వ్యవసాయ విధానానికి అనుబంధంగా ఉండే శ్వేత విప్లవం, నీలి విప్లవం, మత్స్య సంపదకు సంబంధించిన అం శాలను అధ్యయనం చేయాలి.

Photo Stories