డీఎస్సీ పరీక్ష కోసం మానవుడి జీర్ణ వ్యవస్థ పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
- ప్రవల్లిక, ఒంగోలు
Question
డీఎస్సీ పరీక్ష కోసం మానవుడి జీర్ణ వ్యవస్థ పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
బయాలజీ కంటెంట్‌లో అవయవ వ్యవస్థలు అనే అంశం చాలా ముఖ్యమైంది. అందులో జీర్ణవ్యవస్థపై గత డీఎస్సీల్లో 2 లేదా 3 ప్రశ్నలు తరచూ ఇస్తుండటం గమనించవచ్చు. జీర్ణక్రియలోని ఎంజైమ్‌లు.. అవి వేటిపై పనిచేస్తాయి? ఆ పదార్థాలను ఏ పదార్థాలుగా మారుస్తాయి? అనే అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. జీర్ణ వ్యవస్థలోని అవయం పేరు - జీర్ణగ్రంథి - స్రవించే స్రావం - అందులోని ఎంజైమ్ - అదస్థ పదార్థం - అంత్య ఉత్పన్నాలు ఈ విధంగా పట్టిక వేసుకొని చదవడం వల్ల ఎంజైమ్‌లకు సంబంధించిన అన్నిటినీ గుర్తుంచుకోవచ్చు. పదో తరగతి వరకు ఉన్న మానవుడి జీర్ణ వ్యవస్థను క్షుణ్నంగా చదివి ఇంటర్‌లోని కుందేలు జీర్ణ వ్యవస్థను పోల్చుకుంటూ ఇంటర్ స్థాయి వరకూ జీర్ణక్రియా విధానాన్ని అధ్యయనం చేయాలి.